- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: అభిమన్యుతో ఖుషి గురించి ఛాలెంజ్ చేసిన వేద.. 'యశ్'కు సపోర్ట్ గా మిసెస్ న్యూసెన్స్!
Ennenno Janmala Bandam: అభిమన్యుతో ఖుషి గురించి ఛాలెంజ్ చేసిన వేద.. 'యశ్'కు సపోర్ట్ గా మిసెస్ న్యూసెన్స్!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఖుషి గురించి అభిమన్యు (Abhimanyu).. యష్ కు చెప్పిన మాటలు వేద కు యష్ చెప్పేస్తాడు. దాంతో వేద ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక వేద సారీ చెబుతుంది. అంతేకాక ఇంత భాద తన మనసులో ఉండడం వల్ల యశోదర్ (Yashodhar) సతమతమై అయ్యారు అని వేద మనసులో అనుకుంటుంది.
అంతేకాకుండా భార్యగా ఇతనికి సపోర్ట్ గా ఉండాలి అని వేద (Vedha) అనుకుంటుంది. ఇక ఇంటికి వచ్చిన యష్ పడుకొని ఉన్న ఖుషి ను చూసి తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. ఇక ఈ లోపు ఖుషి లేచి యష్ (Yash) ను కౌగిలించుకొని ఎక్కడికి వెళ్లావు డాడీ అని అడుగుతుంది.
ఆ క్రమంలో ఖుషి (Khushi) వాళ్ళ నాన్న కు ప్రేమగా మంచినీళ్లు తాగు డాడి అని ఇస్తుంది. ఆ తర్వాత ఖుషి వాళ్ళ నాన్న యదపై నిద్రపోతుంది. మరోవైపు మాళవిక (Malavika), అభిమన్యు నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్ గా వర్క్ అవుట్ అయింది డార్లింగ్ అని హాయిగా మందు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు.
ఆ తర్వాత మాలిని (Malini) యష్ ను జాగ్రత్తగా చూసుకోమని వేదను రిక్వెస్ట్ చేస్తుంది. ఇక వేద వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి మా భార్య భర్తల జీవితం చాలా అందంగా ఉంది అన్నట్లు మాట్లాడుతుంది. అంతే కాకుండా ఆయన సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడు అని వేద (Vedha) చెబుతుంది.
ఇక మాలిని (Malini) సులోచన లు ఎదురుగా కూర్చుని ఉంటారు. ఈ క్రమంలో సులోచన నా కూతురు అల్లుడు గారిని ఎంత వెనకేసుకు వస్తుందో తెలుసా అని అంటుంది. దానికి మాలిని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. మరోవైపు వేద అందంగా నడుము కనిపించే విధంగా ఉంటుంది. ఇక యష్ (Yash) వేదను అలానే చూస్తూ ఉంటాడు.
ఇక తరువాయి భాగంలో వేద (Vedha) అభిమన్యు ఇంటికి వెళ్లి ఖుషి కి తండ్రి యష్.. అది నేను నిరూపిస్తా అని అంటుంది. దాంతో అభిమన్యు (Abhimanyu) అది జరగని పని అంటాడు. అది జరిగేలా చేస్తానని వేద అంటుంది. అంతే కాకుండా అభిమన్యు ని మిస్టర్ లూజర్ అని అంటుంది.