MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేద చేసిన పనికి షాకైన యష్.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద?

Ennenno Janmala Bandham: వేద చేసిన పనికి షాకైన యష్.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 30 2022, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో ఝాన్సీ చెప్పండి యశోదర్ మాళవిక ఎవరితో ఉన్నారు అని అడగగా నాతోనే ఉంది అంటూ యష్ అబద్ధం చెప్పడంతో మాలిని వేద  ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు యష్ ఆదిత్య అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. ఆరోజు ఆ టైంలో మాళవిక నేను ఇద్దరం కలిసే ఉన్నాము అని అంటాడు యష్. అప్పుడు మాలిని యష్ కి ఏమయింది ఎందుకు సొంత వాళ్ళని కాదని దీనికి సపోర్ట్ చేస్తున్నాడు ఏమైంది వీడికి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఝాన్సీ ఎందుకు కలిశారు ఎక్కడ కలిశారు మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
 

26

అప్పుడు యష్ నేను మాళవికి తో ఉన్నాను కానీ ఎక్కడ ఉన్నాను అన్నది మీకు అనవసరం నేను మీకు చెప్పను అది మా పర్సనల్ అని అనడంతో అది మీ పర్సనల్ కాదు యశోదర్ గారు మీరు మీ మాళవికకు ఎక్స్ హస్బెండ్ అని అంటుంది. మీరు మీ మొదటి భార్యతో గొడవలు భరించలేక విడిపోయారు మరి అటువంటిది మళ్లీ మీరు ఎందుకు కలిశారు అని ప్రశ్నిస్తుంది లాయర్ ఝాన్సీ. మీరు మాళవికను కలిసిన విషయం వేదకి తెలుసా అని అడుగుతుంది. మీకు మీ మాజీ భార్య అంటే ఇష్టమా వేద ను మోసం చేస్తున్నారా అని అనడంతో ఆపండి లాయర్ గారు అని అంటాడు యష్. మరి నేను ఒక మాట అంటే అంతగా ఆలోచించే మీరు మరి ఆమెకు తెలియకుండా మాళవిక ను ఎందుకు కలిశారు అని అంటుంది ఝాన్సీ.
 

36

 మీ భార్య వేద మీద ఒట్టేసి చెప్పండి అని ఝాన్సీ అడగడంతో అప్పుడు జడ్జిగారు అని అంటుంది వేద. చెప్పండి అమ్మ అనడంతో నేను మా లాయర్ గారితో రెండు నిమిషాలు మాట్లాడండి అనడంతో సరే అని అంటాడు లాయర్. అప్పుడు లాయర్ ఏమైంది వేద నేను మీ భర్తని ప్రశ్నలు అడుగుతున్నాను అతని దగ్గర సమాధానం లేదు అడ్డంగా దొరికిపోయాడు అని అనడంతో వెంటనే వేద ప్లీజ్ లాయర్ గారు నా భర్తని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏది మీరు అడగద్దు అని అంటుంది. ప్లీజ్ దయచేసి మా ఆయనను ఏమీ అడగవద్దు అని అంటుంది. అప్పుడు ఝాన్సీ యశోదర్ గారిని అడగాల్సిన ప్రశ్నలన్ని అయిపోయాయి విచారణ అయిపోయింది అని అంటుంది.
 

46

తర్వాత మాలిని ఇంటికి రావడంతో ఆమె భర్త ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాళవిక యష్ కి మందు పెట్టింది దానిని కాపాడడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎంతలా ఆధారపడుతున్నాడో తెలుసా రత్నం అని అంటుంది. ఎందుకు వాడు ఇంతలా వేదని మోసం చేస్తున్నాడు అంటూ మాలిని యష్ గురించి బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు వేద కోర్టులో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. జరిగిన విషయం తల్చుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి లాయర్ ఝాన్సీ వస్తుంది. అప్పుడు ఎందుకు వేద ఇలా ప్రవర్తించావు మేము లాయర్లు ఇలాగే మాట్లాడుతాము.
 

56

 ఒక్క నిమిషం నువ్వు మౌనంగా ఉండి ఉంటే ఈపాటికి కేసు నువ్వే గెలిచే దానివి అని అంటుంది ఝాన్సీ. అప్పుడు వేద మాట్లాడుతూ ఉండగా ఇంతలో యష్ అక్కడికి వస్తాడు. ఆ టైంలో మాళవికతో మా ఆయన కలిసి ఛాన్స్ లేదు ఎందుకంటే మా అమ్మను పిలుచుకొని హాస్పిటల్ కి వెళ్లి సొంత కొడుకు కంటే ఎక్కువగా ఆరట పడ్డారు మాకు ధైర్యంగా నిలబడ్డాడు అని అంటుంది వేద. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే మా అమ్మ తరపున పోరాడతాను అని మాట ఇచ్చిన ఆయన సడన్ గా ఎందుకు మాళవిక వైపు వెళ్ళాడు అర్థం కావడం లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది వేద. మరి ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ లాయర్ ఝాన్సీ తో తన బాధ మొత్తం చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది వేద.

66

మా ఇద్దరి పెళ్లి ఒక ఒప్పందం కావచ్చు కానీ మా మధ్య భార్యాభర్తల బంధం ఉంది ఆయన నా గురించి ఆలోచించకపోవచ్చు కానీ నేను ఆయన గురించి ఆలోచించాను అని ఎమోషనల్ గా మాట్లాడడంతో ఆ మాటలు విన్న యష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను మీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఈ పోరాటం మా ఆయన కోసం కాదు ఆయన మీద నాకు ఎలాంటి అప నమ్మకం లేదు అని అంటుంది వేద. నేను తుది శ్వాస వరకు నా భర్తని నా భర్త నిజాయితీని నమ్ముతాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
120 కోట్ల ఒప్పందం రద్దు, దళపతి విజయ్ కి షాక్.. జన నాయగన్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎందుకలా చేసింది?
Recommended image2
అజిత్‌ కు 30 లక్షల గిఫ్ట్.. ప్రపంచంలోనే మొదటి ఫార్ములా E థీమ్ SUV ఇదే
Recommended image3
Hansika Motwani : 2.75 కోట్ల ఇల్లు.. హన్సిక ముంబై అపార్ట్‌మెంట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved