- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షికి క్లోజ్ అవుతున్న రిషి.. అది చూసి కుళ్లిపోతున్న వసుధార!
Guppedantha Manasu: సాక్షికి క్లోజ్ అవుతున్న రిషి.. అది చూసి కుళ్లిపోతున్న వసుధార!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈరోజు జులై 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. గౌతమ్ (Gautham) వారిద్దరినీ కారులో పంపించేలా చేసాము అని అంటాడు. ఇక మహేంద్ర వర్మ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో లేదో అయినా వసు నీరసంగా ఉంది అనటంతో.. జగతి (Jagathi) తాను వసుని అన్న మాటలు తలుచుకొని మహేంద్ర వాళ్లకు చెబుతుంది. ఒక మంచి స్టూడెంట్ అలా క్లాస్ లో ఉంటే కాదని అందుకే అరిచానని అంటుంది జగతి.
మరోవైపు రిషి (Rishi) వసు (Vasu) నీరసత్వానికి మందులు కొనిస్తాడు. ఆ తర్వాత వసును సమయానికి సరైన ఆహారం తీసుకోవు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఒకచోట కారు ఆపి కొబ్బరి నీళ్లు తాపిస్తాడు. ఇక రిషి తనతో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు. అంతే కాకుండా తన కారు టైర్ గాలి నువ్వే తీసావు కదా అని అంటాడు.
ఆ రోజు నాకు చాలా ఇబ్బంది అయిందని అంటాడు. నువ్వే టైర్ పంచర్ చేసావని నాకు తెలుసు అని అంటాడు. ఆ తర్వాత వసు (Vasu) అవును అన్నట్లు మాట్లాడుతూ.. ఎప్పుడైనా నన్ను సినిమాకి తీసుకెళ్ళావా అని అనటంతో రిషి (Rishi) వసు దగ్గర నుంచి తప్పించుకోవటానికి మాట మారుస్తూ మాట్లాడుతాడు.
అదే సమయంలో రిషి కి సాక్షి (Sakshi) నుండి ఫోన్ వస్తుంది. ఇక సాక్షితో ఎన్నడు మాట్లాడని విధంగా కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు. అది జీర్ణించుకోలేక వసు పక్కనే ఉండి వెటకారంగా మాట్లాడుతుంది. వసు మాటలు విన్న సాక్షి రిషి (Rishi) తోనే ఉంది అనుకోని తెగ మండిపడుతుంది.
ఆ తర్వాత రిషి (Rishi) వసు ను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అని చెప్పి బయలుదేరుతాడు. ఇక వెంటనే దేవయానితో జరిగిన విషయం చెబుతుంది సాక్షి. అంటే వారిద్దరు మళ్ళీ కలుసుకుంటున్నారు అని దేవయాని (Devayani) మండిపడుతుంది. ఆ తర్వాత సాక్షి రిషి తనతో మాత్రం చాలా క్లోజ్ గా మాట్లాడాడు అని అంటుంది.
ఇక దేవయాని సంతోషపడుతూ ఇకపై ఎటువంటి లేకుండా జాగ్రత్తగా డీల్ చేయు అన్నట్లు. ఆ తర్వాత జగతి (Jagathi) తన గదిలో మహేంద్ర వర్మతో రిషి, వసు ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. వారి మాటలు విన్న దేవయాని (Devayani) మళ్లీ ఏదో ప్లాన్ చేసేలా కనిపిస్తుంది.
ఇక రిషి గౌతమ్ ను వసు (Vasu) ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కోమని చెబుతాడు. గౌతమ్ వసుకి ఫోన్ చేసి ఎలా ఉందో రిషి కనుకోమన్నాడు అని అనటంతో వసు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ రిషితో వసును ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇక వసు కూడా రిషి (Rishi) ని తలుచుకుంటూ ఉంటుంది.