Guppedantha Manasu: శైలేంద్ర ఈగోని టచ్ చేసిన వసుధార.. కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు కోడలు జీవితం బాగోవాలని తపన పడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో అనుపమ తన జీవితంలోనికి రావడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర. తను నా బాధని పంచుకోవడానికి వచ్చిందా, మరింత పెంచడానికి వచ్చిందా.. జగతి చనిపోయిందని తెలిస్తే ఎలా ఫీలవుతుందో అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. ఇంతలో వసుధార మజ్జిగ తీసుకొని వస్తుంది. వసుధారని భోజనం అయిపోయిందా అని అడుగుతాడు మహేంద్ర. అయిపోయింది మావయ్య,మీరు ఎక్కడ భోజనం చేశారు అని అడుగుతుంది వసుధార.
రెస్టారెంట్ లో తిన్నానమ్మ, పాత ఫ్రెండ్ కలిసి బోంచేద్దామని రిక్వెస్ట్ చేస్తే కాదనలేక తినేసాను అంటాడు మహేంద్ర. వాళ్లు మాకు తెలుసా అంటుంది వసుధార. లేదమ్మా రిషి పుట్టిన తర్వాత మన ఇంటికి ఎప్పుడు రాలేదు, అయినా వాళ్ళు మనకి బాగా కావలసిన వాళ్లు అంటాడు మహేంద్ర. ఇంతలో శైలేంద్ర ఫోన్ చేయడంతో అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది వసుధార. ఫోన్ లిఫ్ట్ చేసిన వసుధారని అరుకు ఎలా ఉంది అక్కడ అంతా సౌకర్యంగా ఉందా అని అడుగుతాడు శైలేంద్ర.
తర్వాత మళ్లీ తనే నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా అని అడుగుతాడు. ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది, ధరణి మేడమ్ చేసినట్లుగా మెసేజ్ చేసి తెలుసుకున్నారు కదా అంటుంది వసుధార. నీకు ఎలా తెలుసు అంటాడు శైలేంద్ర. భర్త గురించి చెడుగా చెప్పేంత చెడ్డది కాదు మా ధరణి మేడం, అయినా ఆవిడకి మేము ఎక్కడ ఉన్నామో తెలుసు అంటుంది. కోపంతో ఊగిపోతాడు శైలేంద్ర, నాకు దక్కని ఎండి సీట్ మరెవరికీ దక్కకూడదు. డిబిఎస్టీ కాలేజీని నాశనం చేసేస్తాను అంటాడు.
అయినా పర్వాలేదు చెట్టుకొమ్మకి డిబిఎస్టీ అని బోర్డు తగిలించి మళ్ళీ మేము ఎదగగలము కానీ మీరే అలా చేయలేరు. మంచి ఉద్యోగం చూసుకోండి,కావాలంటే రిషి సార్ తో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అంటుంది వసుధార. కోపంతో రగిలిపోయిన శైలేంద్ర నా ఇగో ని టచ్ చేస్తున్నావు అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర ఈ లోపు ధరణి వస్తుంది.
నీకు వసుధార వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా మరి ఇందాక అడిగితే చెప్పలేదు అంటాడు శైలేంద్ర. నాకు చెప్పాలనిపించలేదు అందుకే చెప్పలేదు అని చెప్పే భర్త చేతిలో కాఫీ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధరణి. మరోవైపు తనమీద అటాక్ చేసిన వాళ్ల గురించి ఆలోచనలో పడతాడు రిషి. ఇక్కడ నాకెవరు శత్రువులు లేరు అయినా నన్ను అటాచ్ చేశారంటే నా గతం నన్ను వెంటాడుతుంది.
ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి అనుకుంటాడు. మరోవైపు తండ్రితో రిషికి ఫోన్ చేసి రమ్మనండి,కాలేజీ కి సెలవులు అయిపోయాయి కదా అంటాడు శైలేంద్ర. వాళ్ళేమి ఆడుకోవడానికి వెళ్ళలేదు నా తమ్ముడు ని బాగు చేయటానికి వెళ్లారు. అయినా కాలేజీని చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అంటాడు ఫణీంద్ర. ఆస్తమానం మీరు తమ్ముడు, తమ్ముడు అనడమే కానీ అసలు ఒక్కసారైనా వాళ్ళు ఎక్కడున్నారో అన్నది మీకు ఫోన్ చేశారా అంటుంది దేవయాని.
అపార్థం చేసుకోవటంలో నువ్వు ముందుంటావు.వాళ్ళు ఏం చేస్తున్నారు, నా తమ్ముడి పరిస్థితి ఎలా ఉంది అన్నది రిషి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తున్నాడు. అయినా మళ్లీ మళ్లీ రిషి కి ఫోన్ చేయమని నన్ను ఫోర్స్ చేయొద్దు చేస్తే సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అని కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర. ఇంతలో రిషి ఫోన్ చేయటంతో అతనితో మాట్లాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అంటే రిషి మీ నాన్నతో మాట్లాడుతున్నాడు.
కానీ మనల్ని పలకరించడం లేదు, అంటే మనల్ని పక్కన పెట్టేసాడా అంటుంది దేవయాని. ఆ తర్వాత వాళ్ల మీద ఎటాక్ లాంటివి ఏమీ చేయించకు అని హెచ్చరిస్తుంది దేవయాని. ఇప్పుడు ఏం జరిగినా అంతా మనల్నే అనుమానిస్తారు. నీకు ఎలాగైనా ఎండి సీటు దక్కేలాగా నేను చేస్తాను అని హామీ ఇస్తుంది దేవయాని. మరోవైపు రిషి వాళ్ళకి సర్ప్రైజింగ్ గా మ్యారీడ్ కపుల్ జీప్ అరేంజ్ చేసి హాయిగా తిరిగి రమ్మంటాడు మహేంద్ర.
వాళ్లు ఒప్పుకోకపోతే ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి అని ఒప్పించి పంపిస్తాడు. తర్వాత వాళ్ళ రూమ్ ని ఫస్ట్ నైట్ కోసం అరేంజ్ చేస్తాడు జగతి ని తలుచుకొని నువ్వు చేయవలసిన పని నేను చేస్తున్నాను వాళ్ళని ఆశీర్వదించు. నాకు ఒకే ఒక్క కోరిక, రిషి వాళ్ళు కడుపున నువ్వు మళ్ళీ పుట్టు ఈ ఒక్క కోరిక తీర్చు చాలు అనుకుంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.