- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారకు సాక్షి వార్నింగ్.. రిషీకి జగతి సలహ.. ఎటు తేల్చుకోలేని వసు?
Guppedantha Manasu: వసుధారకు సాక్షి వార్నింగ్.. రిషీకి జగతి సలహ.. ఎటు తేల్చుకోలేని వసు?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... సాక్షి, వసుధార దగ్గరకు వచ్చి తెగ గొప్పలు చెప్పుకుంటూ మురిసిపోతుంటాది. ఆట ముగిసింది,నేనే గెలిచాను,నువ్వు ఎప్పటికీ గెలవలేవు. రిషి నా సొంతం అని సంబరపడిపోతుంటాది సాక్షి. వసుధార, సాక్షికి శుభాకాంక్షలు చెప్పి, ఆట అయిపోలేదు, అసలు ఆట "మా ఇద్దరి ప్రేమ గెలిచి, అది నువ్వు చూసినప్పుడు" ముగుస్తుంది అని అంటుంది. సాక్షి మాత్రం చాలా పొగరుగా "నువ్వు రిషి గురించే కలలు కంటూ మిగిలిపో, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను.
చాలా పెళ్లి పనులు ఉన్నాయి వెళ్ళొస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో రిషి కార్లో కూర్చొని ఇందాక జరిగిన సంఘటన గురించి ఈ బాధపడుతూ ఉంటాడు.ఈ లోగా వసుధార గురించి ఆలోచిస్తూ ఇలా "నాకు అసలు ఆ విరిగిపోయిన బొమ్మని ఎన్ని రోజులకు ఎందుకు ఇవ్వాలనిపించింది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్? ఇన్ని రోజులకి నువ్వు నాకు ఆ బహుమతినిస్తే తీరా ఇచ్చిన తర్వాత అందుకునే స్థితిలో నేను లేను.
అసలు ఎందుకు ఇలా అవుతుంది?" అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత జగతి,మహీంద్రా అందరూ వసుధార దగ్గరికి వస్తారు.వచ్చి సాక్షికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అని, తర్వాత ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు రిషి మనసులో ఏముంది అని అందరూ ఆలోచిస్తూ ఉండగా రిషి అక్కడికి వస్తాడు. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు?అని అడగగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అని మహేంద్ర చెబుతాడు.
నేను మాత్రం కాఫీ తాగడానికే వచ్చాను అని చాలా కూల్ గా అంటాడు రిషి. ఇందాక జరిగిన దాని గురించి నువ్వేమీ రియాక్ట్ అవ్వవా అని మహేంద్ర రిషి ని అడగగా ఈ విషయం ఎవరితో తేల్చాలో వారితోనే తెల్చుతాను అని చెబుతాడు. తర్వాత సీన్లో దేవయాని సాక్షి మాట్లాడుకుంటూ, ఇందాక జరిగిన విషయం గురించి సంబరపడిపోతుంటారు. తర్వాత ఏం చేద్దాం అని అనుకొని, ఇప్పటి నుంచి ఇంక ఎక్కువ జాగ్రత్త పడాలి,రిషి ని ఎలాగైనా లొంగ దియ్యలని అనుకుంటాది సాక్షి.
తర్వాత వసుధర అమ్మవారి గుడికెళ్లి "రిషి సార్ ని ఎలాగైనా కాపాడాలి, తన మనసులో మాట చెప్పాలి, ఎప్పటికైనా ఇద్దరం ఒకటి అవ్వాలి" అని కోరుకుంటాది. ఆరోజు రాత్రి రిషి తన గదిలో కూర్చొని సాక్షి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా జగతి అక్కడికి వస్తుంది, రిషి మాత్రం "ఇప్పుడు నాకు ఎవరి గురించి చర్చించొద్దు, సాక్షి గురించి అసలు చర్చించొద్దు.
ఇక్కడ ఇంత జరుగుతున్న ఏం చేయని పరిస్థితిలో నేను ఉండిపోయాను" అని అంటాడు. జగతి "నేను దేని గురించి చర్చించను,ఇది మీ సమస్య మీరు మాత్రమే పరిష్కరించుకోగలరు. కానీ ,వసుధార కి మాత్రం మీరంటే చాలా ఇష్టం.అది నాకు స్పష్టంగా తెలుస్తుంది అని చెబుతుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!