Guppedantha Manasu: మహేంద్ర ఆరోగ్యంపై రిషి శ్రద్ధ.. దేవయానికి బుద్ధి చెప్పిన వసు?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రిషి, మహేంద్ర (Mahendra )ను హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్లి డాక్టర్ మీకు డాడ్ పాత రిపోర్ట్స్ అన్ని మెయిల్ చేసాను చూసారు కదా అని రిషి అడగగా అప్పుడు డాక్టర్ ఆ చూశాను చూసి ఇప్పుడు మళ్లీ అన్ని టెస్టులు ఒకసారి చేద్దాము అని అనడంతో అప్పుడు మహేంద్ర డాక్టర్ నేనిప్పుడు బాగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు రిషి(rishi) డాక్టర్ డాడ్ తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు అని చెబుతాడు.
మరొకవైపు గౌతమ్ (Gautham )హాస్పటల్లో బయట కూర్చొని వసు గురించి ఆలోచిస్తూ నాకు, వసు కి మధ్య రిషి అడ్డుపడుతుంటాడు అనుకుంటూ రిషిని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. డాక్టర్ మహేంద్ర కు అన్ని టెస్టులు చేసి బాగానే ఉన్నాడు అని చెప్పడంతో అక్కడి నుంచి సంతోషంగా వెళ్తారు మహేంద్ర, రిషి. మహేంద్ర, రిషి,(rishi) గౌతమ్ కారు లు వెళ్తు మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు జగతి(jagathi), మహేంద్ర, రిషి లు ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర కు కాల్ చేసి ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో ఇంటికి వచ్చాక చెబుతాను అని అంటాడు మహేంద్ర. ఇంతలోనే మహేంద్ర, రిషి లు జగతి ఇంటి దగ్గరికి వెళ్తారు. గౌతమ్(Gautham)కోసం జగతి ఇంటి బయట రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ నువ్వు వెళ్ళు లేకపోతే రిషి తిడతాడు అని మహేంద్ర అనడంతో అప్పుడు గౌతమ్ రిషి పై జోకులు వేసి అందర్నీ నవ్విస్తాడు.
బయట రిషి(rishi)కారులో వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో వసు రిషి కోసం ఐస్క్రీమ్ తీసుకుని వెళ్తుంది. ఐస్ క్రీమ్ ను చూసి ఏంటి స్పెషల్ పాయసం తీసుకొని వచ్చావు అని అనడంతో అప్పుడు వసు(vasu) అయ్యో సార్ అది ఐస్ క్రీమ్ అని అనడం తో రిషి షాక్ అవుతాడు. మరేంటి ఇది ఇలా ఉంది అని అడగగా ఇంట్లో నుంచి తీసుకుని వచ్చేసరికి కరిగిపోయింది సార్ అని అంటుంది. ఐస్ క్రీమ్ ని పదే పదే పాయసం అంటూ వసుని ఆట పట్టిస్తాడు రిషి.
ఇంతలో అక్కడికి గౌతమ్(gautham) వచ్చి రిషి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ను తీసుకొని తిని పాయసం బాగుంది వసుధార అని అనడంతో అప్పుడు రిషి నవ్వుతాడు. మరొకవైపు దేవయాని సూటిపోటి మాటలతో ధరణి (Dharani)ని బాధపెడుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్,రిషి వస్తారు. అప్పుడు ఎక్కడికి వెళ్లారు అని దేవయాని అడగగా మహేంద్ర అంకుల్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము అని చెబుతాడు గౌతమ్. అప్పుడు దేవయాని మహేంద్ర పై కోపంతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఫణీంద్ర అక్కడికి వచ్చి దేవయానిని అవమానించేది విధంగా మాట్లాడుతాడు.
దీంతో దేవయాని(Devayani)కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు జగతి చెప్పిన విషయం గురించి వసు ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటుంది. ఇక వసు ఆలోచిస్తూ రిషి (rishi)ఇంటికి వెళ్లగా ఎదురుపడిన దేవయాని వసు ని అవమానించే విధంగా మాట్లాడటంతో తన మాటలతో దేవయానికి బుద్ధి చెబుతుంది వసు. వసు ని చూసి రిషి కాస్త ఫన్నీగా పలకరించడంతో హర్ట్ అయిన వసు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.