- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతిని అవాయిడ్ చేస్తున్న వసుధార.. నిజం చెప్పి గురు, శిష్యులకి షాకిచ్చిన ఏంజెల్?
Guppedantha Manasu: జగతిని అవాయిడ్ చేస్తున్న వసుధార.. నిజం చెప్పి గురు, శిష్యులకి షాకిచ్చిన ఏంజెల్?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కొడుకుని చూసి ఆనంద పడుతున్న ఓ తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నా చెవిలో హలో అను వసుధార నాకు ఏమైనా హియరింగ్ ప్రాబ్లం ఉందేమో ఈఎన్టీ హాస్పిటల్ లో చూపిచ్చుకుంటాను అంటుంది ఏంజెల్. హలో అంటుంది వసుధార. బాగానే వినిపిస్తుంది కదా మరి ఏంటి మీరందరూ అలా అంటున్నారు అంటుంది ఏంజెల్. ఇంతలో విశ్వనాథం వచ్చి ఇంకా రూమ్ కి తీసుకెళ్లలేదా అని అడుగుతాడు. అప్పుడు విశ్వాన్ని కూడా చెవి దగ్గర హలో అను అంటుంది ఏంజెల్.
ఏమైంది అంటాడు విశ్వనాథం. జరిగిందంతా చెప్తుంది ఏంజెల్. అంటే అంటారు అందులో తప్పేముంది మహేంద్ర గారు రిషికి తండ్రితో సమానం అలా పిలవటంలో తప్పు ఏమీ లేదు. అదంతా పక్కన పెట్టు ముందు రూమ్ చూపించు అని ఏంజెల్ కి చెప్తాడు విశ్వనాథం. ఇంతలో పొయ్యి మీద పాలు పెట్టిన విషయం గుర్తొచ్చి మేడం కి రూమ్ చూపించమని వసు కి చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది ఏంజెల్. వసు జగతి ని రూమ్ కి తీసుకు వెళ్తుంది. అక్కడ జగతి నిన్ను ఇక్కడ చూసి చాలా ఆనంద పడుతున్నాను నీకోసం రిషి కోసం ఎక్కడెక్కడో వెతికాను అని వసుధారతో మాటలు కలుపుతుంది జగతి.
మేడం మీరు గురుదక్షిణ అడిగారు నేను ఇచ్చేశాను అంతే అక్కడితో అయిపోయింది. నేను రిషి సర్ కి దగ్గరగా ఉన్నాను అంతేకానీ ఆయన మనసులో లేను అంటుంది వసుధార. నేను నా కొడుకు విషయంలో భయపడిపోయాను అందుకే అలా ప్రవర్తించవలసి వచ్చింది అంటుంది జగతి. ఏదైతేనేమి మీరు నాతో మాట్లాడి నన్ను మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీతో మాట్లాడి రిషి సార్ కి మరింత దూరం కాలేను. మీరు ఏంజెల్ ఇంటికి గెస్ట్ లు మీకు ఏమైనా అవసరం ఉంటే ఆవిడని పిలవండి అని చెప్పి వెళ్ళిపోతుంది వసు.
ఆ తరువాత అందరూ భోజనాలకి కూర్చుంటారు. ఇలా అందరూ కలిసి భోజనం చేయడం చాలా బాగుంటుంది అంటుంది ఏంజెల్. ఇప్పుడు అలా ఎవరు తింటున్నారు అందరూ బిజీ అయిపోయారు ఎవరికి ఎప్పుడు వీలుంటే అప్పుడు భోజనం చేస్తున్నారు అంటాడు విశ్వనాధం. ఇంతలో మహేంద్ర నీకు ఈ కర్రీ ఇష్టం కదా తిను అని రిషికి చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు మీకు ఎలా తెలుసు అని నిలదీస్తుంది ఏంజెల్.
అందులో ఏముంది వాళ్ళిద్దరూ చాలాసార్లు కలిసి భోజనం చేసి ఉండవచ్చు అంటాడు విశ్వనాథం. మీ ఇంట్లో కూడా అందరూ కలిసి భోజనం చేస్తారా లేకపోతే విడివిడిగా భోజనం చేస్తారా అని మహేంద్ర అని అడుగుతుంది ఏంజెల్. కలిసే భోజనం చేస్తాము. అందరికీ కుదిరినప్పుడు వెన్నెల్లో భోజనం చేస్తాము అంటాడు మహేంద్ర. అవునా వినటానికి ఎంతో బాగుంది. రేపు వెన్నెల్లో డిన్నర్ ప్లాన్ చేద్దాము అంటుంది ఏంజెల్.
భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మీ కాలేజీ అంత డెవలప్ అవ్వటానికి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని మహేంద్ర ని అడుగుతాడు విశ్వనాథం. మా కాలేజీ డెవలప్మెంట్ అంతా మా ఎండి గారు వల్లే అయింది ఆయన ఆలోచన విధానం అంత బాగుంటుంది అంటాడు మహేంద్ర. మీ ఎండి గారి ఆలోచన విధానము రిషి ఆలోచనా విధానము ఒకలాగే ఉన్నట్లుంది అందుకే పవర్ ఆఫ్ స్టడీస్ అంత సక్సెస్ అయ్యింది అంటుంది ఏంజెల్.
మేడం గారిని అడిగి ఆ మెలకువలు తెలుసుకో అని రిషికి చెప్తాడు విశ్వనాథం. నాకన్నా నా కొడుక్కే బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది జగతి. కానీ రిషి ఏమి మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మహేంద్ర, విశ్వనాథం కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జగతితో మీరు ఏమీ అనుకోకండి రిషి ముందు నుంచి కూడా చాలా రిజర్వుడ్ ఉంటుంది ఏంజెల్. రిషి నీకు ఎప్పటి నుంచి తెలుసు అంటుంది జగతి.
మేమిద్దరిమి క్లాస్మేట్స్, తనని రక్షించుకోవడానికి మేము కలిసాము అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటుంది ఏంజెల్. జగతి ఏం జరిగింది అని అడుగుతుంది. మీకు తెలియదు కదా రిషి ని ఎవరో కత్తి తో పొడిచారు కొనఊపిరితో ఉన్న అతనిని నేను, విశ్వం ట్రీట్మెంట్ చేయించి కాపాడుకున్నాము అని చెప్పింది ఏంజెల్. ఆ మాటలకి జగతి వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.