MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషి దగ్గరికి వెళ్లిన వసు.. వసుధారని అసహ్యించుకున్న రిషి?

Guppedantha Manasu: రిషి దగ్గరికి వెళ్లిన వసు.. వసుధారని అసహ్యించుకున్న రిషి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 20 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 20 2023, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో సుమిత్ర వసుధార కి ఫోన్ చేస్తుంది. బాగున్నావా అమ్మ హెల్త్ బాగుందా అనగా మీ నాన్న నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి బాగున్నావా వసుధార, మా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు ధైర్యంగా ఉండు అని అంటాడు. అప్పుడు చక్రపాణి రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా, సార్ మనసు చాలా మంచిది మహారాజు లాంటి వాడు నాకు బాగా తెలుసు నిన్ను అర్థం చేసుకొని ఉంటాడు అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధర రాజీవ్ బావ తో జాగ్రత్తగా ఉండండి అనడంతో చక్రపాణి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాడు ఎంత మోసం చేశాడు వాన్ని వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రపాణి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరొకవైపు రిషి సోఫాలో పడుకుని ఉండగా ఇంతలోనే వసుధార అన్న మాటలు గుర్తు రావడంతో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత పని చేసావ్ ఏంటి వసుధార నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పావు కానీ చివరికి నువ్వే ప్రశ్నగా మిగిలిపోయావు అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసుధార, రిషి ఇచ్చిన పూల వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు రిషి, వసుధార ఆ పూలు తీసుకోవడాన్నీ బస్సు ద్వారా ఆ పూలు ఎందుకు తీసుకుంది వేరే వాళ్ళ భార్యగా ఉన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటుంది పూడి తీసుకోవడం తప్పు కదా అనుకుంటూ ఉంటాడు. నన్ను నేను కాపాడుకోవడం కోసం పెద్ద తప్పు చేశానా రిషి సార్ నన్ను ఎప్పుడు క్షమిస్తాడు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
 

36

అప్పుడు వసుధార ఫోటో తీసి వాట్సాప్ చేసి మాట్లాడాలి సార్ అనడంతో అది చూసిన రిషి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు రిషి చందమామ వైపు చూసి బాధపడుతూ ఉండగా మరోవైపు వసుధార కూడా చందమామ వైపు చూస్తూ ఉంటుంది. మా మధ్య ఎందుకు ఇంత దూరం వచ్చిందో అర్థం కావడం లేదు అని వసుధార అనగా, వసు ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు మీరు ఎక్కడున్నారో మాట్లాడదామంటే నాకు మీ అడ్రస్ తెలియదు అనుకుంటూ ఉంటుంది. రిషి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ అనుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఉన్నానో ఏమైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటాడు రిషి.
 

46

మరుసటి రోజు ఉదయం వసుధార కాలేజీకి వస్తుంది. రిషి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ రిషి,,వసు గతంలో కూర్చున్న ప్రదేశంలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి కీ ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధపడుతూ ఉంటుంది వసు. జగతి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సరికి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ధరణికి ఫోన్ చేయగా ధరణి కూడా తెలియదు అని చెప్పడంతో వసుధర బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి వసుధారతో గడిపిన క్షణాలే గుర్తు తెచ్చుకుంటూ ఏంటిది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే రిషి ఉన్న గది దగ్గరికి వసుధార వస్తుంది.

56

 అప్పుడు వసు కింద పడిపోతుండగా రిషి పట్టుకుంటాడు. వసు తాళి రిషి షర్ట్ కు  తగులుకోవడంతో అది తీసేసి పక్కకు వెళ్లి నిల్చుంటాడు రిషి. వసుధార ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగా ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని అంటుంది. నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది ఒక్క ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి అనడంతో నేను నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు వసుధార అంటాడు రిషి. ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి అయినా నేను మీతో మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వాలి అని అంటుంది వసు. నువ్వేం చెప్పకు వసుధార దయచేసి వెళ్ళు అని చేతులు జోడించి అడుగుతాడు రిషి. అప్పుడు వసుధార మిమ్మల్ని ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు అని వాట్సాప్ లో మహేంద్ర సార్ రిషి సార్ కాలేజీకి గెస్ట్ హౌస్ లో ఉన్నారు వచ్చి తీసుకెళ్లండి వాయిస్ మెసేజ్ పెడుతుంది.
 

66

ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చిపిచ్చిగా చేయకు, ఇక్కడి నుంచి వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అనగా ఇంటికి వెళ్ళండి సార్ నేను ఎక్కడికైనా వెళ్తాను అది నీకు అనవసరం అని కోపంగా మాట్లాడుతాడు. అప్పుడు వసుధార అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి తలుపు వేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధారకి చక్రపాణి ఫోన్ చేసి మీ అక్క మాధవికి ఉంటూ నలతగా ఉందంట మీ అమ్మ అక్కడికి వెళుతుంది నేను నీ దగ్గరికి వస్తాను ఎందుకో నీ దగ్గరికి రావాలని ఉందమ్మా అని అంటాడు చక్రపాణి. సరే నాన్న మీరు రండి అని అంటుంది వసు. మరొకవైపు కాలేజీలో రిషి ఉండడం ఏంటి అని దేవయాని టెన్షన్ గా అడుగుతుంది.
అక్కడికి వసుధార వెళ్ళిందా అసలు ఏం జరుగుతోంది అని దేవయాని అంటుంది. మీరంతా రిషి గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నారు అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని అందరి మీద సీరియస్ అవుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: నేచురల్ స్టార్ ఏజ్ సీక్రెట్, వయసు కనిపించకుండా హీరో నాని ఏం చేస్తారో తెలుసా?
Recommended image2
Suma Kanakala: అవును సుమ నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది, మనసులో మాట బయటపెట్టిన రాజీవ్ కనకాల, ఏమన్నాడంటే?
Recommended image3
Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇండస్ట్రీలో ఉండగా ఏ ధైర్యంతో వచ్చానంటే.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved