వరుణ్‌లవ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ మూమెంట్స్.. మెగా జోడీకి దిష్టి తీయాల్సిందే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెండు రోజుల క్రితం ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా వారికి మ్యారేజ్‌కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు.
photo credit - hotc
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అత్యంత గ్రాండ్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహం జరగడం విశేషం. మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు.
photo credit - hotc
అయితే తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటున్నారు వరుణ్, లావణ్య. మెగా ఫ్యామిలీ మెంబర్స్ సైతం ఈ పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో భాగంగా తమ బెస్ట్ పిక్స్ ని షేర్ చేసుకున్నారు. ఇందులో వరుణ్ లావణ్య బ్యూటీఫుల్ పిక్స్ ఉండటం విశేషం.
photo credit - hotc
లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసేటప్పుడు లావణ్య ఆనందానికి అవదుల్లేవు. ఆమె కళ్లల్లో ఆనందానికి ఆకాశమే హద్దులా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఇద్దరు కలిసి జోడీగా అలా వాక్ చేస్తూ ఇచ్చిన పోజు సైతం ఆకట్టుకుంటుంది. చూడ్డానికి ఎంతో మచ్చటగా ఉందీ జంట. దీంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతూ, వీరికి దిష్ట తీయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం.
photo credit - hotc
దీంతోపాటు పెళ్లి పీఠలమీదకు వచ్చేటప్పుడు ఆమె చేతిలో కొబ్బరికాయని పట్టుకుని వస్తుంది. ఆమె డ్రెస్‌ని పట్టుకుని వెనకాల సహాయకులు, బంధువులు ఉండటం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
photo credit - hotc
వీటితోపాటు.. నూతన పెళ్లి జంటతో అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, వారి పిల్లలు అల్లు అయాన్, అర్హలు కలిసి దిగిన పిక్ సైతం బ్యూటీఫుల్‌గా ఉంది. విజువల్ ట్రీట్‌లా ఉంది.
photo credit - hotc
మరోవైపు వరుణ్ ఫ్రెండ్, హీరో నితిన్ దంపతులు కూడా ఈ పెళ్లిలో హైలైట్ అయ్యారు. వరుణ్, లావణ్యలతో కలిసి నితిన్, ఆయన వైఫ్ కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.
photo credit - hotc
ఇంకోవైపు నిహారిక, అలాగే మెగా మరో డాటర్ శ్రీజలతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
photo credit - hotc
ఇటలీలో మూడురోజు పెళ్లి పూర్తయ్యింది. హైదరాబాద్‌కి రిటర్న్ అవుతున్నారు. ఈ రోజు రాత్రి, రేపటి వరకు హైదరాబాద్‌కి చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. దీనికి చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి రాబోతుంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.