వరుణ్-లావణ్యల మూడు రోజుల పెళ్లి సందడి షురూ.. ఈ త్రీ డేస్ ఏమేం చేయబోతున్నారంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరో రెండు రోజుల్లో ఒక్కటి కాబోతున్నారు. అయితే మూడు రోజులపాటు అత్యంత గ్రాండ్ సాగే వీరి పెళ్లి నేటితోనే ప్రారంభమైంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యత్రిపాఠి త్వరలో ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీలో గ్రాండ్‌గా డెస్టినీ మ్యారేజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది. అయితే వరుణ్-లవణ్యల పెళ్లి మూడు రోజులు జరగబోతుందట. 3 డేస్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఓ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
వరుణ్ తేజ్, లావణ్య ల మూడు రోజుల పెళ్లి ఈ రోజుతో ప్రారంభమైంది. ఈ మొదటి రోజు అక్కడ కాక్‌టెయిల్స్ ఉండబోతుంది. మెగా ఫ్యామిలీ, అత్యంద దగ్గరి బంధువులు ఈ కాక్ టెయిల్‌లో పాల్గొనబోతున్నారు. పార్టీ చేసుకుంటారు. ఇటలీలో కాక్ టెయిల్ అంటే దాని రేంజ్ వేరే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక రేపు అక్టోబర్ 31న హల్దీ ఫంక్షన్ నిర్వహిస్తారు. వరుణ్, లావణ్య ఈ హల్దీ, మెహందీ ఫంక్షన్‌లో పాల్గొంటారు. పెళ్లికళ అసలైనది రేపు ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. ఇందులో ఇటు వరుణ్, అటు లావణ్య పాల్గొని ఎంజాయ్ చేస్తారు. పెళ్లికి ముందు ఈ సంబరం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. మెమరబుల్‌గా ఉంటుంది. దాన్ని కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట.
మరోవైపు ఇక నవంబర్ 1న వరుణ్, లావణ్య పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ ఒకటిన మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వీరి పెళ్లి ముహూర్తం ఉంది. ఆ సమయంలో తన ప్రియురాలు లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు వరుణ్. అనంతరం సాయంత్రం(రాత్రి) 8.30లకు రిసెప్షన్ ఉంది. ఆ రోజు అక్కడే ఉంటారు. నెక్ట్స్ డేకి ఇండియా బయలు దేరి వస్తారు. ఈ లెక్కన మూడో తారీఖు వీరంతా ఇండియా చేరుకుంటారు.
ఇక నవంబర్ 5న ఐటెక్ సిటీలో ఎన్ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఇక్కడ టాలీవుడ్ సెలబ్రిటీలు, బంధువులు, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. నూతన వధువరులను ఆశీర్వదిస్తారు. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి వరుణ్‌లవ్ మూడు రోజుల పెళ్లి సందడి ఈ రోజుతో ప్రారంభమైందని చెప్పొచ్చు.