మారిపోవాల్సిందే... అల్లు అర్జున్, రామ్ చరణ్ పెళ్లిళ్లపై వరుణ్ తేజ్ హాట్ కామెంట్స్!
వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో వరుణ్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.

Ram Charan Allu Arjun
మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు యాంకర్ గా సుమ వ్యవహరించారు. చేతిలో గన్ పట్టుకొని ఆమె హల్చల్ చేశారు. చిత్ర యూనిట్ ని బుల్లెట్స్ వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ ని ఆమె అడిగిన ఓ ప్రశ్న అందరినీ ఆకర్షించింది.
Ram Charan Allu Arjun
రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో పెళ్లయ్యాక ఎవరు బాగా మారిపోయారని అడిగారు. ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో వరుణ్ తేజ్ కి అర్థం కాలేదు. నిజానికి ఈ ప్రశ్న వాళ్లనే అడిగాలి అన్నారు. అయితే సమాధానం చెప్పారు. పెళ్లయ్యాక ఎవరైనా మారిపోవాల్సిందే. ఏం చేసినా నోరు మూసుకుని ఉండాలి అన్నారు.
Ram Charan Allu Arjun
దర్శకుడు అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ... ఆయన ఎఫ్ 2 మూవీలో మాకు ఇదే నేర్పించాడని అన్నారు. పెళ్లయ్యాక మారిపోవడం మంచిదే అన్నట్లు వరుణ్ తేజ్ మాట్లాడాడు. అదే సమయంలో పరోక్షంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా భార్యలు వచ్చాక మారిపోయారని వెల్లడించారు. వరుణ్ తేజ్ సమాధానం అందరిలో నవ్వులు పూయించింది.
మరో ప్రశ్నగా సుమ లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరి నుండి ఒకేసారి 'అర్జెంటు గా ఫోన్ చెయ్' అని మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తావ్ అని యాంకర్ సుమ అడిగారు. ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. నిహారికకు చేస్తాను. ఎందుకంటే తాను చిన్న పిల్ల కదా అన్నాడు.
త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న వరుణ్ తేజ్ నుండి ఈ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. లావణ్య త్రిపాఠి లక్కీ గర్ల్ అంటున్నారు. భార్యా విధేయుడిగా ఉంటానని వరుణ్ తేజ్ చెప్పకనే చెప్పిన నేపథ్యంలో లావణ్య లైఫ్ హ్యాపీగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 9న లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనుంది.
ఇక గాండీవధారి అర్జున చిత్ర విషయానికి వస్తే... దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. సాక్షి వైద్య హీరోయిన్.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. వరుణ్ తేజ్ గత చిత్రాలు ఎఫ్ 3, గని నిరాశపరిచాయి. దీంతో గాండీవధారి అర్జున చిత్రంతో కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నాడు.