వాళ్లిద్దరూ రాంచరణ్ హీరోయిన్లే, పెళ్ళైన వారితో అందరి ముందు అసభ్యంగా.. క్రేజీ హీరో బిహేవియర్ పై రచ్చ
కొందరు హీరోలు, నటులు పబ్లిక్ గా నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆన్ స్క్రీన్ పై హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ సహజమే. కథ కోసం, డైరెక్టర్ చెప్పినట్లు చేయాల్సిందే. రొమాంటిక్ సీన్స్ లో నటించడం ఓకేనా కాదా అనే విషయాన్ని హీరోయిన్లు సైన్ చేసే ముందే చెప్పేస్తారు. వాళ్ళ అంగీకారాన్ని బట్టి సన్నివేశాలని దర్శకులు చిత్రీకరిస్తారు. ఇటీవల బోల్డ్ రొమాన్స్ కి కూడా హీరోయిన్లు ఓకే చెబుతున్నారు.
కొందరు హీరోలు, నటులు పబ్లిక్ గా నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో కమెడియన్ అలీ.. ఓ ఈవెంట్ లో అనుష్క గురించి వల్గర్ గా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. చోటా కె నాయుడు.. కాజల్ కి ఈవెంట్ లో ముద్దు పెట్టి తీవ్ర విమర్శలకు గురయ్యారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇలాంటి విమర్శలని ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ కొంచెం హైపర్ యాక్టివ్.
పెళ్ళైన ఇద్దరు హీరోయిన్లతో అతడు ఆఫ్ స్క్రీన్ లో ప్రవర్తించిన విధానం తీవ్ర విమర్శలకు కారణం అయింది. ఇటీవల, వరుణ్ ధావన్, కియారా అద్వానీ ఓ ఫోటో షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఈ వీడియోలో వరుణ్ ధావన్.. కియారా అనుమతి లేకుండా ఆమెకి ముద్దు ఇచ్చాడు. దీనితో కియారా షాక్ అయింది. కియారాకి సిద్దార్థ్ మల్హోత్రాతో ఆల్రెడీ పెళ్లైంది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంపై విమర్శలు రావడంతో వరుణ్ ధావన్ స్పందించారు.
అది మేమిద్దరం ప్లాన్ చేసి చేశాం అని వరుణ్ ధావన్ తెలిపాడు. ఆమె అనుమతి లేకుండా ముద్దు పెట్టలేదు. మా నుంచి సంథింగ్ కొత్తగా కావాలని ఫోటో గ్రాఫర్ అడిగారు. దీనితో నేను కియారాకి ముద్దు ఇచ్చాను. ఆమె నా వంక షాక్ అయినట్లు చూస్తుంది.. అప్పుడే ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించారు అని వరుణ్ ధావన్ తెలిపారు.
అదే విధంగా అలియా భట్ తో కూడా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాల వైరల్ అయ్యాయి. ఆమె నడుముపై చేయి వేసి వింతగా ప్రవర్తించిన దృశ్యాలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అది సరదాగా చేసింది మాత్రమే..సరసం కోసం కాదు అంటూ వరుణ్ చెప్పుకొచ్చారు. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించింది. కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో నటించింది. ఇద్దరూ రాంచరణ్ హీరోయిన్లే. వరుణ్ ధావన్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. దళపతి విజయ్ తేరి చిత్రానికి ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కింది.