హీరోగా వనితా విజయ్ కుమార్ తనయుడు, శ్రీహరి స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..?
తమిళ వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఆమె తనయుడు శ్రీహరి తెరంగేట్రానికి రంగం సిద్దం అయ్యింది.

నటుడు విజయకుమార్ కుమార్తె వనిత మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వనిత మొదట నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు శ్రీహరి అనే కుమారుడు కూడా ఉన్నాడు. దీని తరువాత, రాజన్‌ను రెండవ వివాహం చేసుకున్న వనితకు జోవిక మరియు జయనిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇక ఈ రెండు పెళ్లిళ్లు పెటాకులు అవవ్వడంతో వనిత పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకుంది. ఇది కూడా రెండు నెలల్లోనే ముగిసింది.ప్రస్తుతం వనిత తన కుమార్తెలతో ఒంటరిగా జీవిస్తోంది. వనిత పెద్ద కూతురు జోవిక ఇటీవల బిగ్ బాస్‌లో పాల్గొంది. అప్పటి నుంచి దర్శకుడు పార్తీబన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జోవిక త్వరలో హీరోయిన్ గా తెరంగేట్రం చేయనుంది.
vanitha vijayakumar
ఇందుకోసం రకరకాల ఫోటోషూట్‌లు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా మరో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే.. వనిత తనయుడు శ్రీహరి హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడట. అంతే కాదు దానికి సబంధించిన అప్ డేట్ కూడా రిలీజ్ అయినట్టు తెలుస్తోంది.
అందుకు తగ్గట్టుగానే వనిత తనయుడు శ్రీహరి హీరోగా తెరంగేట్రం చేయనుండగా, దర్శకుడు ప్రభుసాలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కొత్త ముఖాలతో దర్శకుడు ప్రభు సాలమన్ తెరకెక్కించిన సినిమాలు వరుసగా హిట్లు కొడుతున్నాయి. ఆ లిస్టులో శ్రీహరి నటించిన ఓ సినిమా కూడా చేరుతుందని భావిస్తున్నారు.దర్శకుడు ప్రభుసాలమన్ దర్శకత్వం వహించిన మైనా చిత్రం ద్వారా నటి అమలాపాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత కుమ్కితో పరిచయం అయిన విక్రమ్ ప్రభు ఇప్పుడు బిజీ నటుడిగా మారాడు. అదేవిధంగా కయల్ సినిమా ద్వారా ఆయన పరిచయమైన నటి ఆనంది ఇప్పుడు ఫేమస్ హీరోయిన్ గా వెలుగొందింది. ఈ వరుసలో శ్రీహరి కూడా చేరే అవకాశం ఉంది. అయితే వనిత తనయుడు మాత్రం ఆమె దగ్గర పెరగలేదు. విజయ్ కుమార్ ఇంట్లో పెరిగాడు. తల్లి తో అతనికి ఎటువంటి కాంటాక్ట్స్ లేవని తెలుస్తోంది.