- Home
- Entertainment
- కాన్స్ కార్పెట్ పై ఊర్వశి రౌటెలా మెరుపులు.. పింక్ అందాలతో విందు చేసిన బాలీవుడ్ బ్యూటీ.
కాన్స్ కార్పెట్ పై ఊర్వశి రౌటెలా మెరుపులు.. పింక్ అందాలతో విందు చేసిన బాలీవుడ్ బ్యూటీ.
గులాబీ అందంతో అద్భుతం చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో.. ఇండియన్ బ్యూటీ.. తళుక్కున మెరిసింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో అద్భుతాన్ని ఆవిష్కరించింది అందాల భామ ఊర్వశి రౌటెలా. స్టన్నింగ్ లుక్స్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకునేలాచేసింది. గులాభి అందంతో.. పింక్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోయింది. ఆమె సొగసులకు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు.
ఊర్విశి ని చూసి కళ్ళప్పచెప్పారు ఫారెన్ సౌందర్య ప్రియులు. అంతే కాదు తమ చేతిలో ఉన్న కెమెరాలకు వెంటనే పనిచెప్పారు. ఇక తన అందంతో అలరించిన ఊర్వశీ రౌటేలా.. తన మెడలోని మొసళ్ల నెక్లెస్ తో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ – 2023 వేడుకలు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. ఇండియా నుంచి పలువురుఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలు ఈ వేడుకల్లో మెరిశారు. అయితే ఫస్ట్ టైమ్ ఈ వేడుకలకు వచ్చారు పలువురు బాలీవుడ్ భామలు. కేన్స్ రెడ్ కార్పెట్‌పై హోయలు పోతూ..వయ్యారాల నడకలతో మెస్మరైజ్ చేశారు.
అందులో ముఖ్యంగా ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌటెలా. స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్ మైండ్ గతితప్పేలా చేసింది. ఈఫోటోలు అటుకేన్స్ లో... ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊర్వసి అందానికి ఇటునెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
ఊర్వశీ ధరించిన నెక్లస్ లో మొసళ్ళ డిజైన్ అందరికి ఆకర్షిస్తోంది. ఈహారం బంగారంతో ప్రత్యేకంగా చేయింది.. అందులో డైమండ్ డిజైన్ కూడా చేయించారు. గతంలో మనం ఎన్నడూ చూడని ప్రత్యేక డిజైన్ ఇది. అందుకే స్పెషల్ అవుతోంది. రెండు నిజమైనర మొసళ్లను మెడలో వేసుకున్నట్టుగా ఉంది ఆ నెక్లెస్.
ఆ నెక్లెస్‌కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఊర్వశి ధరించింది. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన తన ఫొటోలు, వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ పోస్టుకు 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫన్నీ కామెంట్లు కూడా వస్తున్నాయి.
మొసళ్ల నెక్లెస్ ను మెడలో వేసుకున్న అందాల రాశి... అవి నిజంగా బ్రతికి వస్తే.. అలానే ఫోటోషూట్ చేస్తావా.. లేక పారిపోతావా అని ఓ నెటిజన్ కామెంట్ విసిరాడు. అమ్మో ఈ నెక్లెస్ చాలా భయంకరంగా ఉంది అని మరో యూజర్ స్పందించాడు. కేన్స్‌లో ఊర్వశి హిస్టరీ క్రియేట్ చేసిందని ఇంకో యూజర్ ప్రశంసించాడు.
అంతే కాదు చాలా మంది లైక్ కొట్టగా.. కొంత మంది భయపడే ఎమ్మోజీలు పెట్టారు. గ్రేట్ లుక్ అని, ఫ్యాబులస్ అని, బ్యూటీఫుల్ అని ఇలా రకరకాలుగా మరికొందరు యూజర్స్ కామెంట్స్ పెట్టారు. మొత్తానికి కాన్స్ లో.. మరియ..సోషల్ మీడియాలో మన ఊర్వశీ రౌటేలా ప్రత్యేకం అనిపించుకుంది.