తప్పు సరిచేసిన ఊర్వశీ రౌతేలా, ట్రోల్స్ తట్టుకోలేక ట్వీట్ మార్చేసిన బ్యూటీ...?
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ను సీఎం ను చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. దాంతో ఆమెపై దారుణంగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. వాటినితట్టుకోలేకపోయిన బ్యూటీ..వెంటనే తన ట్వీట్ ను మార్చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈసినిమా నిన్న(జులై 28) రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ జోష్ లో ఉన్నారు టీమ్. కాగా ఈసినిమాలో స్పెషల్ పెర్పార్మెన్స్ తో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. తాజాగా ఆమెకు సబంధించిన ఓ వివాదం హైలెట్ అవుతోంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ ట్వీట్ చేసింది ఊర్వశీ రౌతేలా. దాంతో నెటిజన్ల ట్రోల్స్ కు అడ్డంగా దొరికిపోయింది. ఊర్వశీ ట్వీట్ తో.. ఆమెపే ట్రోలర్ల దాడి గట్టిగాజరిగింది. ఆ ప్రవాహం తట్టుకోలేక పోయింది ఊర్వశి. దాంతో తన తప్పును సరిచేసుకుంది. ట్వీట్ ను సరిచేసింది.
అనుకోకుండా పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆమె సంబోధించడంపై ఊర్వశిని సపోర్ట్ చేస్తూ కూడా కొంత మంది కామెంట్స్ చేశారు. ఆమెకు పెద్దగా అవగాహన లేక ఇలా చేసిందంటూ... కొత మంది కామెంట్ చేశారు. అయితే కొంత సేపటికి అసలు విషయం గమనించిన ఊర్వశీ.. గంట తరువాత తన ట్వీట్ను సరిచేసింది.
ఆమె ఎడిట్ చేసిన ట్వీట్ లో ఏం రాసిందంటే..? "మా సినిమా బ్రో అవతార్ లో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్‌ను శేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది... 28న బ్రో మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది... తప్పక చూడండి అంటూ ఊర్వశీ ట్విట్టర్ సారాంశం ఉంది.
పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఊర్వశి ఇద్దరు తారలతో పోజులిచ్చి, ఈ ఈవెంట్ లో హాట్ హాట్ గా మెరిసిన బ్యూటీ.. ఆ ఫంక్షన్ లో వారితో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ట్వీట్ చేసింది. అప్పుడు ఆమె ఈ పొరపాటు చేసింది.
బ్రో ది అవతార్ మూవీ తమిళ సినిమా వినోదయ సితంకి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. తమిళంలో ఈసినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసినిమాకుడైలాగ్స్ రాయడంతో పాటు స్క్రీన్ ప్లేను అందించారు.