MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైఫ్‌ పై దాడి మేటర్ లో, డాకు మహారాజ్ గురించి మాట్లాడి, సారి చెప్పింది

సైఫ్‌ పై దాడి మేటర్ లో, డాకు మహారాజ్ గురించి మాట్లాడి, సారి చెప్పింది

సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమె సైఫ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 18 2025, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Urvashi Rautela , Saif Ali Khan, Injury

Urvashi Rautela , Saif Ali Khan, Injury


మీడియా ముందు ఏ మాట్లాడుతున్నామో, దేని గురించి మాట్లాడుతున్నామో తెలియకుండా చెప్పుకుంటూ పోతే తర్వాత విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులోనూ గతంలో లాగ దేనికీ టైమ్ పట్టడం లేదు. ఒక మాట మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతోంది. చిన్న పొరపాటు ఉన్నా వివాదమై పోతోంది. దాంతో క్షమాపణ పర్వం మొదలువుతోంది. ఇప్పుడు ఊర్వశి రౌతేలా పరిస్దితి అదే. ఆమె సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇంతకీ ఆమె సైఫ్ విషయంలో ఏమి మాట్లాడింది
 

25


 సైఫ్‌పై జరిగిన దాడి రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎంతోమంది సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.  ఈ దాడి గురించి నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అయితే, ఆ సమయంలో ఊర్వశీ (Urvashi Rautela) తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం దాని గురించి మాట్లాడటం మొదలెట్టింది. అదే  తీవ్ర విమర్శలకు దారితీసింది. 

35


తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్‌కు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘సైఫ్‌ సర్.. మీకు ఈ మెసేజ్‌ చేరుతుందని ఆశిస్తున్నా. మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తంచేస్తున్నా. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు.

45


 గత కొన్ని రోజుల నుంచి నేను ‘డాకు మహారాజ్‌’ విజయోత్సాహంలో ఉన్నాను. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతులు గురించి మాట్లాడాను. ఈ విషయంలో సిగ్గు పడుతున్నా. నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీపై గౌరవం పెరిగింది’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సైఫ్‌ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

55

 ‘డాకు మహారాజ్’ సక్సెస్‌ కావడంతో తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని ఊర్వశీ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, తన బహుమతులను దాడికి ముడిపెట్టి మాట్లాడడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు రూ.150కోట్లు వసూళ్లు సాధించింది. నాకు మా అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్‌ వాచ్‌ ఇచ్చారు. కానీ, వీటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్‌ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Recommended image2
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Ranveer Singh: రణ్‌వీర్ డెబ్యూ చేసేటప్పటికి ఈ హీరోయిన్‌కు 5 ఏళ్లే.. ఇప్పుడు ఆయనతోనే రొమాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved