- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానాంబ మనసు మార్చేసిన జానకి స్నేహితురాలు.. మల్లికకు దిమ్మతిరిగే షాక్!
Janaki Kalaganaledu: జ్ఞానాంబ మనసు మార్చేసిన జానకి స్నేహితురాలు.. మల్లికకు దిమ్మతిరిగే షాక్!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబం అనే నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 29వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గోవిందరాజు (Govindaraju) దగ్గరుండి మనం ఆ బాబుని దీవిస్తే చాలా బాగుంటుంది అని తన భార్యతో అంటాడు. కానీ జ్ఞానాంబ ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోదు. మరోవైపు జ్ఞానాంబ కుటుంబమంతా వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది అని ఊర్మిళ (Urmila) తన భర్తతో అంటుంది.
ఇక ఒకవైపు జానకి (Janaki) ఇంట్లో ఫ్యామిలీ అంతా తన మేనల్లుడు బారసాల కు వెళ్లనందుకు భాద పడుతూ ఉండగా.. అది చూసిన మల్లిక ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఈలోపు రుక్మిణి (Rukmini) బాబుని తీసుకొని జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. ఇక మల్లిక నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావని తనని ఏ మాత్రం ఆలోచించకుండా అడుగుతుంది.
ఇక రుక్మిని (Rukmini) జ్ఞానాంబ ముందుకు వచ్చి నేను జానకి దోస్తును అని అంటుంది. దాంతో జానకి ఎంతో సంతోష పడుతుంది. ఇక రుక్మిణి నేను జానకి వాళ్ళ మేనల్లుడు బారసాల ఫంక్షన్ కు వచ్చాను అని చెబుతోంది. అంతేకాకుండా మీరు రాకపోతే ఊర్మిళ (Urmila) ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తానంటుంది అని చెబుతుంది.
అంతేకాకుండా ఫంక్షన్ కు మీరు రావడం కుదరదని బాబుని ఇక్కడికి తీసుకు వచ్చాను అని రుక్మిణి (Rukmini) అంటుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం ఒకసారి గా స్టన్ అవుతారు. ఈ క్రమంలో మల్లిక పుల్లలు పెడుతూ ఉండగా.. రుక్మిణి మల్లిక (Mallika) కు ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది. దాంతో మల్లిక నోరు మూత బడుతుంది.
ఇక రుక్మిణి జ్ఞానాంబ (Jnanamba) మంచితనాన్ని వర్ణించి.. ఊళ్ళోవాళ్ళ లో తన గౌరవం ఎంత ఉందో తెలుపుతుంది. అదే క్రమంలో తల్లి బిడ్డల గురించి ఎమోషనల్ గా చెప్పి జ్ఞానాంబ మనసు కరిగిపోయేలా చేస్తుంది. ఇక రుక్మిణి (Rukmini) మాటలకూ ఫ్యామిలీ అంతా ఎంతో ఎమోషనల్ అవుతారు.
ఇక తరువాయి భాగంలో మనకు అమ్మయినా అత్త అయిన.. అన్నీ అత్తయ్య గారే అని జానకి జ్ఞానాంబ (Jnanamba) ను అంటుంది. అంతేకాకుండా మీ చేతులతో ఈ బాబు ని దీవించి ఉయ్యాలలో పడుకోబెట్టండి అని జానకి (Janaki) అంటుంది. దాంతో జ్ఞానం ఆ బాబును ఎత్తుకుంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.