Kriti Shetty: ఉప్పెన బ్యూటీ తెగింపు... బ్యాక్ లెస్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేసిన కృతి శెట్టి!
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సైతం పంథా మార్చింది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ కలిగిన ఈ కన్నడ భామ హాట్నెస్ కి తెరలేపింది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది.
Kriti Shetty
మడిగట్టుకు కూర్చుంటే ఆఫర్స్ రావు. పోటీ గట్టిగా ఉన్నప్పుడు తెగించాల్సిందే. కృతి శెట్టి ప్రస్తుతం అదే చేస్తున్నారు. కృతి శెట్టి కూడా స్కిన్ షో చేస్తున్నారు. పొట్టిబట్టల్లో హాట్ గా కనిపిస్తున్నారు. తాజాగా కృతి సనన్ షార్ట్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది.
Kriti Shetty
ఈ మధ్య కృతి శెట్టి మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కాంపిటీషన్ ఎదుర్కొంటుంది. శ్రీలీల ఫార్మ్ లోకి వచ్చాక కృతికి ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దీంతో రేసులో వెనుకబడింది.
Kriti Shetty
మొదటి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి.
Kriti Shetty
ఇక శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.
Kriti Shetty
అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేశారు.
Kriti Shetty
అయితే గత ఏడాది ఆమెకు మూడు వరుస ప్లాప్స్ పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇది ఆమె కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది.
Kriti Shetty
నాగ చైతన్యకు జంటగా కస్టడీ విడుదల కాగా అదీ నిరాశపరిచింది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఆ చిత్రం కనీస ఆదరణ దక్కించుకోలేదు.
Kriti Shetty
ప్రస్తుతం మలయాళంలో ఏ ఆర్ ఎం టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. టోవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. జితిన్ లాల్ తెరకెక్కిస్తున్నారు.
Kriti Shetty
తెలుగు ఆమె చేస్తున్న ఒకే ఒక చిత్రం శర్వానంద్ తో. మరో కొత్త ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేయలేదు. తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం.
Kriti Shetty
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సైతం పంథా మార్చింది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ కలిగిన ఈ కన్నడ భామ హాట్నెస్ కి తెరలేపింది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది.