`ఉప్పెన` ఫేమ్, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కృతి శెట్టి.. ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమా ఛాన్స్?
ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా అందరి మనసులను దోచుకున్న కృతి శెట్టి క్రేజ్, ఆమె జోరు మామూలుగా లేదు. తాజా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్ లో ఈ క్యూట్ బేబీ భాగం కాబోతుందట. ఏకంగా సూపర్ స్టార్స్ తో నటించే ఆఫర్స్ కొట్టేసిందని టాక్.
క్యూట్ అందాలతో తొలిచూపులోనే టాలీవుడ్‌ని, తెలుగు ఆడియెన్స్ పడేసింది కృతి శెట్టి. `ఉప్పెన` చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ కి అంతగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ అబ్బురపరిచింది. ఫైనల్‌గా ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఓవర్ నైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
`ఉప్పెన` సినిమాలో బేబమ్మగా కృతి చేసిన నటన, పలికించిన హవాభావాలకు యావత్ టాలీవుడ్ ఫిదా అయ్యింది. దీంతో ఈ అమ్మడితో సినిమా చేయాలని, తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాలని దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే కృతి మూడు బిగ్ ప్రాజెక్ట్ల్ ల్లో భాగమైంది. నానితో `శ్యామ్ సింగరాయ్` సినిమా చేస్తుంది. అలాగే రామ్‌తో లింగుస్వామి సినిమాలో ఎంపికైంది. దీంతోపాటు సుధీర్‌బాబు తో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.
తాజాగా మరో రెండు బిగ్గెస్ట్ ఆఫర్స్ కృతిని వెతుక్కుంటూ వచ్చాయనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుంది. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్‌తో అట. ప్రస్తుతం `సర్కారు వారి పాట` చేస్తున్న మహేష్ నెక్ట్స్ అనిల్‌రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారట. ఇందులో హీరోయిన్‌గా కృతిని సంప్రదించారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో, సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.
మరోవైపు తమిళంలోనూ స్టార్ హీరోతో ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ప్రస్తుతం విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
ఇందులో మరో హీరోయిన్‌గా కృతిని అనుకుంటున్నారట. ఇటీవల విజయ్ సినిమా ఓపెనింగ్ సందర్భంగా చిత్ర యూనిట్‌కి కృతి అభినందనలు చెప్పింది. దీంతో ఇందులో బెర్త్ కన్ఫమ్ అయే టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.
ఇదే కాదు కృతి వ్యాపారాల పరంగానూ క్రేజీగా మారింది. వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి వెళ్తూ సందడి చేస్తుంది. సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయింది కృతి.
కేవలం ఒకే ఒక్క సినిమా కృతి జీవితాన్నే మార్చేసింది. ఆమెని ఎక్కడో ఆకాశంపై కూర్చోబెట్టింది. ప్రస్తుతం కృతి కుర్రాళ్లకి డ్రీమ్‌గర్ల్ గా మారిందంటే అతిశయోక్తి కాదు.
కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.