- Home
- Entertainment
- అల్లు అర్జున్ అందుకే ఇలా, పునీత్ తో ఆ కోరిక తీరకుండానే ..కన్నడ స్టార్ ఉపేంద్ర నుంచి ఊహించని కామెంట్స్
అల్లు అర్జున్ అందుకే ఇలా, పునీత్ తో ఆ కోరిక తీరకుండానే ..కన్నడ స్టార్ ఉపేంద్ర నుంచి ఊహించని కామెంట్స్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఉపేంద్ర అనేక చిత్రాల్లో నటించారు. కన్యాదానం చిత్రంలో శ్రీకాంత్ తో కలసి నటించారు. ఉపేంద్ర చిత్రాలకు సపరేట్ ఫాలోయింగ్ ఉంది.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఉపేంద్ర అనేక చిత్రాల్లో నటించారు. కన్యాదానం చిత్రంలో శ్రీకాంత్ తో కలసి నటించారు. ఉపేంద్ర చిత్రాలకు సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఒకే అక్షరంతో టైటిల్ ఉండేలా ఉపేంద్ర చిత్రాలు చాలా ఉన్నాయి.
1998లో ఉపేంద్ర, చాందిని జంటగా నటించిన 'A' అనే చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. దీనితో ఉపేంద్ర మరోసారి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. 'A' చిత్రం రీరిలీజ్ సందర్భంగా టాలీవుడ్ తో తనకున్న అనుబంధాన్ని మరోసారి ఉపేంద్ర గుర్తు చేసుకున్నారు.
ఉపేంద్ర చివరగా తెలుగులో స్ట్రైట్ గా చేసిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో ఉపేంద్ర విలన్ గా నటించారు. అల్లు అర్జున్ పై ఉపేంద్ర ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ డెడికేషన్ అప్పుడే చూశానని ఉపేంద్ర అన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు పొందుతున్న క్రేజ్ కి అర్హుడు అని తెలిపారు.
తన పనిని తాను నిజాయతీగా చేస్తాడని ఉపేంద్ర తెలిపాడు. అదే సమయంలో ఉపేంద్ర దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ని కూడా గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ తనకి మంచి స్నేహితుడు అని ఉపేంద్ర తెలిపారు. పునీత్ తో కలసి ఓ చిత్రం చేయాలనే కోరిక నెరవేరకుండానే అతడు వెళ్లిపోయాడని ఉపేంద్ర గుర్తు చేసుకున్నారు.
నటన, దర్శకత్వం ఇలా తన జీవితంలో తాను ఏదీ ప్లాన్ చేయలేదని ఉపేంద్ర తెలిపారు. ఉపేంద్ర కర్ణాటకలో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. అయితే తాను రాజకీయాల కోసం పార్టీ పెట్టలేదని ప్రజలకోసం పెట్టానని ఉపేంద్ర అంటున్నారు.
అదే విధంగా ఇటీవల 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఉపేంద్ర మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు తన స్టైల్ లో రాజకీయాల్లో మార్పు రావాలని ప్రయత్నిస్తున్నారు. నేను నా స్టైల్ లో ట్రై చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఉపేంద్ర తెలిపారు.