ఎఫ్3 తో పాటుగా ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే..
ఈ వీక్ వినోదాల విందుకు రెడీ అవుతున్నాయిన సినిమాలు. అటు థియేటర్ లో .. ఇటు ఓటీటీలో మోర్ ఫన్ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతుంది. అయితే ఈ వీక్ ఒకే ఒక్క సినిమా థియేటర్ లో సందడిచేయబోతుండగా... డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం తగ్గేదే లే అన్నట్టు సినిమాలు వెబ్ సిరీస్ లు దండయాత్ర చేయబోతున్నాయి.

ఈ వీక్ థియేటర్ల లో సోలో పెర్ఫామెన్స్ ఇవ్వబోతోంది ఎఫ్3 మూవీ. ఏమాత్రం తగ్గేది లేదంటోంది. ఓటీటీ మాత్రం మంచి మంచి సినిమాలు వెబ్ సిరీస్ లతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇంట్లోనే కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఈ వీక్ లో థియేటర్ లో సందడి చేయడానికి వస్తోన్న పెద్ద సినిమా ఎఫ్ 3 రెండు మూడు సార్లు వాయిదా పడ్డ ఈసినిమా ఎట్టకేలకు థియేటర్లను పలకరించబోతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈమూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు గా నటించారు. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 27న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మరి సమ్మర్ సోగ్గాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారో లేదో చూడాలి.
మాస్ సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్ నటనకు విమర్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈమూవీ మే 6న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ సినిమా ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
విజయ్ సేతుపతి, నయనతార, సమంత లీడ్ రోల్స్ లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాతువాకుల రెండు కాదల్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
జాన్ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్: పార్ట్ 1. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్1న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది.
హాట్‌స్టార్ లో మే 27న ఒబీ వ్యాన్ కెనోబి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు అంటే మే 23న తులసీదాస్ జూనియర్ , వెల్‌కమ్ టు వెడ్డింగ్ హెల్ స్ట్రీమింగ్ అయ్యాయి. మే 27న స్ట్రీమింట్ అవ్వడానికి స్ట్రేంజర్ థింగ్స్ నాలుగో సీజన్ ముస్తాబు అవుతోంది.
వీటితో పాటు సోనీ లివ్ లో నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ వెబ్ సిరీస్ మే 27 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. అటు జీ 5 లో మే 24న ఫోరెన్సిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా వరుసగా ఓటీటీలు కూడా ఈవీక్ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఆడియన్స్ ను అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ను ప్లాన్ చేస్తున్నాయి.