MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లో చిరంజీవికి సన్మానం

ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లో చిరంజీవికి సన్మానం

తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కనుంది. చిరంజీవి కి హౌస్ ఆఫ్ కామ‌న్స్ - యు.కె పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారంజరగనుంది. ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి దక్కబోతున్న అరుదైన గౌరవం ఇది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 14 2025, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
megastar chiranjeevi

megastar chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కనుంది. చిరంజీవి కి హౌస్ ఆఫ్ కామ‌న్స్ - యు.కె పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారంజరగనుంది. ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి దక్కబోతున్న అరుదైన గౌరవం ఇది. నాలుగు దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ,  సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
megastar chiranjeevi

megastar chiranjeevi

బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో  వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండ‌టం విశేషం. ఇది ఆయ‌న కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది.

34
megastar chiranjeevi

megastar chiranjeevi

యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవి గారిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వ‌టం అనేది ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం.

44
megastar chiranjeevi

megastar chiranjeevi

2024లో భార‌త ప్ర‌భుత్వం నుంచి రెండో అత్యున్న‌త‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌ ను చిరంజీవి గారు అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్థవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో సత్కరించబడ్డారు. ఎ.ఎన్‌.ఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో  చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved