- Home
- Entertainment
- చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?
చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?
చివరి మూవీ టైంలో ఉదయ్ కిరణ్ తన కెరీర్ డౌన్ ఫాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ పతనం కావడానికి ఉదయ్ కిరణ్ ఏం కారణాలు చెప్పారో ఈ కథనంలో తెలుసుకోండి.

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్, జీవితం విషాద భరితంగా ముగిసింది. 2014లో ఉదయ్ కిరణ్ మరణించారు. ఉదయ్ కిరణ్ సినీ జీవితం సంచలనాలతో మొదలైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఉదయ్ కిరణ్ కెరీర్ కి తొలి టర్నింగ్ పాయింట్ అదే.
ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీనితో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం జై శ్రీరామ్. ఈ మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో జోరు ప్రదర్శించిన ఉదయ్ కిరణ్ కి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ విషయంలో చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో చాలా రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. నా కెరీర్ ని అద్భుతమైన జర్నీగా భావిస్తాను. తొలి మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ కావడంతో నా కెరీర్ మారిపోయింది. అలాంటి చిత్రాల్లో నటించడం నా అదృష్టం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఇంత సాధిస్తానని అనుకోలేదు.
ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడడంపై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. సమస్య ఎక్కడ వచ్చింది అంటే తొలి మూడు చిత్రాలతో హిమాలయాల అంత ఎత్తైన సక్సెస్ సాధించాను. ఆ సక్సెస్ ముందు మిగిలిన చిత్రాలు తేలిపోయాయి. ఫ్లాపులు పడ్డ సమయంలో కూడా నా కెరీర్ లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ అవి ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలినా మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిని నేను కాదు.
లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ గారి దర్శకత్వంలో నటించాను. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. చిత్రం తర్వాతే నాకు తమిళంలో నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ కెరీర్ ఆరంభంలోనే రెండు పడవల మీద ప్రయాణం చేయాలని అనుకోలేదు. అందుకే ఆరేళ్ళ వరకు తమిళ చిత్రాలు అంగీకరించలేదు. కానీ తమిళ చిత్రాలు చేయడం ప్రారంభించాక తన కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది అన్నట్లుగా ఉదయ్ కిరణ్ తెలిపారు.