- Home
- Entertainment
- అరుంధతిలో అనుష్క కంటే ముందు, జేజమ్మ పాత్రను వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
అరుంధతిలో అనుష్క కంటే ముందు, జేజమ్మ పాత్రను వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జేజమ్మ పాత్ర కోసం ముందుగా ఇద్దరు హీరోయిన్లను సంప్రదించారట దర్శకుడు. వాళ్లు వదులుకోవడంతో ఈమూవీ అనుష్కకు వెళ్లింది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?

రికార్డు క్రియేట్ చేసిన అరుంధతి
2009లో విడుదలైన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అరుంధతి' సినిమాతో అనుష్క శెట్టికు సినీ కెరీర్‌లో భారీ మలుపు వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఈ పాత్ర కోసం మొదట అనుష్కను ఎంపిక చేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను ఇద్దరు స్టార్ హీరోయిన్లు మిస్ అయ్యారని మీకు తెలుసా?
మమతా మోహన్ దాస్
ఈ పాత్రకు ముందు ఎంపికైన నటి మమతా మోహన్ దాస్. ఆమెతోనే ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేశారు. అయితే మమతా, ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు సినిమాను వదులుకుంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, దర్శకుడిపై దుష్ప్రచారాన్ని నమ్మి సినిమా చేయకపోవడం తాను చేసిన తప్పే అని అన్నారు. ఆమె తప్పుకున్న తరువాత చిత్రబృందం కన్నడ నటి ప్రేమను సంప్రదించింది.
డేట్స్ కుదరక
ప్రేమ తెలుగులో దేవి, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, ఉపేంద్ర వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలోని 'దేవి'లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అరుంధతి సినిమా కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక ఆ అవకాశం వదులుకున్నారు.
కోడి రామకృష్ణ తో అనుబంధం
ఈ విషయాన్ని ప్రేమ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, "కోడి రామకృష్ణ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. దేవి సినిమా సమయంలో ఆయన నాకు తెలుగు కూడా నేర్పారు. అరుంధతి సినిమా కోసం నా వద్దకు వచ్చారు. కానీ అప్పటికే నేను కన్నడలో కొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదు. సినిమా విడుదలైన తర్వాత చూశాను, చాలా అద్భుతంగా ఉంది. కానీ అనుష్కకు ఈ అవకాశం దక్కినందుకు నేను సంతోషిస్తున్నాను" అని పేర్కొన్నారు.
అనుష్క రీ ఎంట్రీ
ఇక ఈ ఇద్దరు హీరోయిన్లు వదులుకున్న పాత్ర అనుష్క చేతిలోకి వెళ్లి ఆమెను టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత బాహుబలి వంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోనూ నటించే అవకాశాలు అనుష్కకు వచ్చాయి. ప్రేక్షకుల హృదయాల్లోనూ స్థిరమైన స్థానం సంపాదించారు. ఇక అరుంధతి తర్వాత అనుష్క కెరీర్‌కు తిరుగే లేదు. ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ఘాటీ సినిమా చేశారు. కానీ ఈసినిమా అంత ప్రభావం చూపించలేదు.