బిగ్ బాస్ 4 అప్‌డేట్: హౌజ్‌లోకి టీవీ 9 సీనియర్ యాంకర్
తాజాగా టీవీ 9 నుంచి మరో సీనియర్ హౌజ్‌లోకి అడుగుపెట్టడం కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది. సీనియర్ యాంకర్, రిపోర్టర్ దేవీ నాగవల్లి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు అదికారిక ప్రకటన మాత్రం రాలేదు.
టాలీవుడ్ లో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఇప్పటికే సీజన్ 4కు సంబంధించిన ప్రోమో కూడా రావటంతో కంటెస్టెంట్‌లు ఎవరు అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని లిస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వైరల్ అయ్యింది. అయితే ఈ వార్త దాదాపుగా కన్ఫమ్‌గా అన్న టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ తాజా సీజన్‌లో ప్రముఖ వార్త సంస్థ టీవీ 9కి చెందిన సీనియర్ యాంకర్ కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇదే సంస్థకు చెందిన కంటెస్టెంట్‌లు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయటంతో ఈ సారి కూడా టీవీ 9 నుంచి ఓ కంటెస్టెంట్ పాల్గొనటం ఖాయం అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
బిగ్ బాస్ సీజన్ 2లో టీవీ 9 రిపోర్టర్, యాంకర్ దీప్తి నల్లమోతు పార్టిసిపేట్ చేసింది. బుల్లితెర మీద యాంకర్‌గా ఫేమస్ అయిన దీప్తి హౌస్‌లోనూ గట్టిగానే సందడి చేసింది. అయితే ఫైనలిస్ట్‌గా మాత్రం కాలేకపోయింది దీప్తి.
సీజన్ 3లోనూ టీవీ 9 నుంచి ఒకరు పార్టిసిపేట్ చేశారు. ఆ సంస్థ సీనియర్ రిపోర్టర్‌గా ఉన్న జాఫర్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అయితే జాఫర్ హౌస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడన్న విమర్శలు వినిపించాయి. దీనికి తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీవీ 9కి కూడా దూరమయ్యాడు జాఫర్.
తాజాగా టీవీ 9 నుంచి మరో సీనియర్ హౌజ్‌లోకి అడుగుపెట్టడం కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది. సీనియర్ యాంకర్, రిపోర్టర్ దేవీ నాగవల్లి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు అదికారిక ప్రకటన మాత్రం రాలేదు.