కృష్ణ కూతురు బాలకృష్ణ తో హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?
బాలకృష్ణ జంటగా కృష్ణ కూతురు మంజుల నటించాల్సిన సినిమా ఎందుకు మిస్ అయ్యిందో తెలసా? సినిమా మొదలు పెట్టిన తరువాత కూడా ఎందుకు వెనక్కి తగ్గారో తెలుసా? హీరోయిన్ గా మంజుల ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?

టాలీవుడ్ లో సాహసాల హీరో
తెలుగు సినీ పరిశ్రమలో సాహసాల హీరోగా “సూపర్ స్టార్ కృష్కకు పేరుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రభంజనం కొనసాగుతున్న టైమ్ లో.. ఇండస్ట్రీలో కి వచ్చి.. తన మార్క్ సినిమాలతో సవాల్ విసిరిన హీరో కృష్ణ. కమర్షియల్ సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి దిగ్గజాలు విభిన్న తరహా పాత్రల్లో నటిస్తుంటే, కృష్ణ మాత్రం మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి మూవీస్ చేశారు. ఇక సూపర్ స్టార్ వారసులుగా.. ఆయన ఫ్యామిలీ నుంచి హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అయితే కృష్ణ ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ కూడా రావాల్సి ఉంది. కాని మిస్ అయ్యింది.
సూపర్ స్టార్ వారసులు
సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా పెద్ద కొడకు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు, నిర్మాతగా సినిమాలు చేశారు. ఆతరువాత కాలంలో తెరమరుగై... అనారోగ్యంతో మరణించారు. ఇక కృష్ణ చిన్న కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్నారు. కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా సినిమా చేస్తున్నారు. పెద్ద కూతురు పద్మావతి కొడుకులిద్దరు హీరోలుగా ఎంట్రీ ఇవ్వకగా.. కృష్ణ రెండో కూతురు మంజుల చిన్ననాటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ తో .. ఇండస్ట్రీలో పలు రకాల విభాగాలలో పనిచేశారు. తన తండ్రి లాగానే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాలి అనుకున్నారు. దీనిని గమనించిన కృష్ణ, ఆమెకు సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో, విజయనిర్మల దర్శకత్వంలో ఆమెను అసిస్టెంట్‌గా పెట్టారు . దీంతో మంజుల డైరెక్షన్, ప్రొడక్షన్ తదితర అంశాల్లో మంచి అవగాహన సాధించారు.
బాలకృష్ణ సరసన హీరోయిన్ గా మంజుల
అయితే మంజుల మాత్రం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆశడింది. ఆమె ఇండస్ట్రీలో చురుగ్గా ఉండటంతో.. కృష్ణ కూడా మంజులను హీరోయిన్ గా పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంతే కాదు అప్పట్లో వరుస సినిమాలతో ఊపుమీద ఉన్న నటసింహ బాలకృష్ణ హీరోగా, తన కూతురు మంజుల హీరోయిన్‌గా ఒక సినిమాను తానే నిర్మించాలని ప్లాన్ చేశాడట కృష్ణం. అంతే కాదు ఆసినిమాకు ఓపెనింగ్ పూజ కూడా జరిగినట్టు సమాచారం. బాలయ్య హీరోగా మంచి మాస్ మూవీని చేయాలని అనుకున్నారట. ఈసినిమాకు దర్శకుడు ఎవరో తెలియదు కానీ.. కృష్ణ నిర్మాతగా ఈసినిమా తెరకెక్కించాలనే ప్లాన్ చేశారు.
కృష్ణ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ?
అయితే మంజుల హీరోయిన్ అవ్వడపై కృష్ణ అభిమానుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. తమ అభిమాన హీరో కూతురు మరో హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం ఇష్టం లేదు అని ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారట. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట కృష్ణ. ఈ విషయంలో కృష్ణ ఫ్యాన్స్ తో చాలా కాలం దూరంగా ఉండిపోయిందని సమాచారం. అయితే ఈ విషయంపై అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు కానీ.. టాలీవుడ్ లో మాత్రం టాక్ గట్టిగా నడిచింది.
నటిగా మంచి గుర్తింపు
తరువాత కాలంలో మంజుల హీరోయిన్ గా ఓ సినిమా చేసింది. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ‘షో’ (2001) ద్వారా నటిగా మంచి ప్రశంసలు అందుకుంది మంజుల. అయితే ఫుల్‌టైమ్ హీరోయిన్‌గా మారాలనే ఆమె ఆశ నెరవేరలేదు.కానీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్‌గా, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ఇప్పుడు కూడా హీరోలకు అక్కగా అడపాదడపా పాత్రలు చేస్తూనే ఉంది.