- Home
- Entertainment
- లగ్జరీ ఇల్లు.. కార్ల కలెక్షన్.. లైఫ్‌స్టైల్, అనుష్క శెట్టి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
లగ్జరీ ఇల్లు.. కార్ల కలెక్షన్.. లైఫ్‌స్టైల్, అనుష్క శెట్టి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
44వ ఏట అడుగుపెట్టిన అనుష్క శెట్టి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతోంది. విభిన్న పాత్రలు, అద్భుతమైన కెరీర్, విలాసవంతమైన జీవనశైలి, సినిమాల్లో సాధించిన విజయాలు ఆమె ఇమేజ్ ను పెంచాయి.

44 వ ఏట అడుగు పెట్టిన అనుష్క..
నవంబర్ 7, 1981న మంగళూరులో జన్మించిన అనుష్క శెట్టి (స్వీటీ శెట్టి) 44 ఏట అడుగు పెట్టింది. మల్టీ టాలెంట్ కలిగిన నటిగా పేరుగాంచిన ఈమె, బెంగుళూరులో బీసీఏ పూర్తి చేసి, సినిమాల్లోకి రాకముందు యోగా శిక్షకురాలిగా శిక్షణ పొందింది.
Net Worth and Earnings
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో అనుష్క ఒకరు. ఆమె ఆస్తి విలువ సుమారు 120 నుంచి134 కోట్లు ఉంటుందని అంచన. 2025 నాటికి ఒక్కో సినిమాకు 6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ను అనుష్క శెట్టి తీసుకుంటున్నట్టు సమాచారం.
అనుష్క శెట్టి ఆస్తులు..
అనుష్క శెట్టి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. ఆమెకు హైదరాబాద్ సమీపంలో ఒక విశాలమైన ఫామ్‌హౌస్ కూడా ఉందని సమాచారం. వీటితో పాటు తన సొంత రాష్ట్రం కర్ణాటకలలో కూాడా ఇళ్లు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
అనుష్క శెట్టి కార్ కలెక్షన్
అనుష్క శెట్టి లగ్జరీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తోంది. ఆమె వద్ద బీఎండబ్ల్యూ 6 సిరీస్, ఆడి క్యూ5, ఆడి ఏ6, టయోటా కరోలా ఆల్టిస్ వంటి కార్లు ఉన్నాయి. అయితే ఎక్కువగా మీడియాలో కనిపించడం ఆమెకు ఇష్టం ఉండదు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. అనవసరంగా మాట్లాడటం కూడా ఆమెకు ఇష్టం ఉండదు.
అరుంధతతో మలుపు తిరిగిన కెరీర్
2005లో 'సూపర్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'అరుంధతి', 'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి చిత్రాలతో.. హీరోలకు సమానంగా ఇమేజ్ సాధించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్మురేపింది అనుష్క. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఆమె పెళ్లి గురించి ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు.