పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కేసు... మరో ఇద్దరు అరెస్ట్!
అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ప్రధాన ముద్దాయిగా ఉన్న ఈ కేసులో మరికొందరు అరెస్ట్ అయ్యారు.

Pallavi Prashanth
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారీగా అక్కడకు చేరుకున్న అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. అమర్ దీప్ కారుపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్ల అద్దాలు కూడా పగిలాయి.
పబ్లిక్, ప్రవేట్ ప్రాపర్టీ నాశనం అయ్యింది. పల్లవి ప్రశాంత్ ఆ సమయంలో అభిమానుల దగ్గరకు వస్తే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంది. అందుకే పోలీసులు విషయం చెప్పి పల్లవి ప్రశాంత్ ని అన్నపూర్ణ స్టూడియో వెనుక గేట్ నుండి పంపేశారు. పల్లవి ప్రశాంత్ మాత్రం తిరిగి మెయిన్ గేటు వద్దకు వచ్చింది.
దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ ప్రధాన ముద్దాయిగా... పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
పల్లవి ప్రశాంత్ రెండు రోజుల అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే అల్లర్లకు పాల్పడిన యువకులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
Pallavi Prashanth
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరు అరెస్ట్ అయ్యారు. నేడు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది. హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన 20 ఏళ్ల హరినాధ్ రెడ్డి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అలాగే యూసఫ్ గూడకు చెందిన 23 ఏళ్ల సుధాకర్ అరెస్ట్ అయ్యాడు.
వీరిద్దరినీ రిమాండ్ కి పంపినట్లు సమాచారం. అలాగే పవన్ అనే ఒక యువకుడిని విచారిస్తున్నారట. అభిమానుల అల్లర్లు, టైటిల్ విన్నర్ అరెస్ట్ బిగ్ బాస్ షో పరువు తీశాయి. ఆల్రెడీ అనేక విమర్శలు ఎదుర్కుంటున్న షో కొత్త చిక్కుల్లో పడింది...