- Home
- Entertainment
- TV
- రాజమౌళి నోటి దురుసు, హనుమంతుని పై నోరు జారిన స్టార్ డైరెక్టర్.. నీ పని అయిపోయిందంటూ.. జక్కన్నపై ట్రోలింగ్
రాజమౌళి నోటి దురుసు, హనుమంతుని పై నోరు జారిన స్టార్ డైరెక్టర్.. నీ పని అయిపోయిందంటూ.. జక్కన్నపై ట్రోలింగ్
రాజమౌళి ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాడు అన్న పేరుంది. కామ్ గా తన పని తాను చేసుకునే జక్కన్న.. ఇన్నేళ్ల కెరీర్ లో ఏవివాదంలోను వేలు పెట్టలేదు. కానీ ఫస్ట్ టైమ్ దేవుడిపై నోరు జారి.. ట్రోలింగ్ మెటీరియల్ అయ్యాడు రాజమౌళి.

భారీగా వారణాసి ఈవెంట్
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో జరిగింది. భారీ అంచనాల మధ్య ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ వెంట్ కోసం ఎక్కడెక్కడి నుంచో.. మహేష్ బాబు అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. వేదిక చుట్టు.. జనాలతో కిక్కిరిపోయింది. ఈవెంట్‌లో సంచారి పాటకు ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. అలాగే వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా, ఆ వీడియోతో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ ఈవెంట్ తో వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈవెంట్ లో మూవీ యూనిట్ సభ్యులంతా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు.
రాజమౌళి అసహనం..
ఈ సందర్భంగా మూవీ రైటర్ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ సినిమా నిర్మాణంలో హనుమంతుడు వెనుక ఉండి నడిపించాడని” వ్యాఖ్యానించారు. అయితే ఈవెంట్ ప్రారంభంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయి. అభిమానులకు గ్లింప్స్ స్పష్టంగా కనిపించేందుకు 100 అడుగుల LED స్క్రీన్ ఏర్పాటు చేయించినా, వీడియో పలుమార్లు ఆగిపోవడం వల్ల ప్రదర్శన సరిగ్గా సాగలేదు. దీనిపై రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు టెక్నికల్ టీమ్‌పై మండిపడ్డాడు. అంతే కాదు రాజమౌళి మొదటిసారి దేవుడిపై నోరు జారాడు.
హనుమంతుడిపై రాజమౌళి కామెంట్స్..
రాజమౌళి ఈసందర్భంగా దేవుడిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై పెద్ద నమ్మకం లేదు. మా నాన్నగారు హనుమంతుడు వెనుక ఉంటాడని చెప్పగానే కోపం వచ్చింది. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనతో స్నేహితుడిలా మాట్లాడుతుంది. ఆమెపైన కూడా కోపం వచ్చింది. ఇదేనా చేసేది అనిపించింది. చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. మహాభారతం నా డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని తీయాలని అసలు అనుకోలేదు,” అని వివరించాడు.
ఇదే... ఈ నోటి దూల తగ్గిచుకుంటే మంచిది
Enduku @ssrajamouli 🤷🏼♂️🤦🏼♂️ pic.twitter.com/WslvtrZVfy— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) November 15, 2025
రాముడి పాత్రలో మహేష్ బాబు..
రాజమౌళి ఇంకా మాట్లాడుతూ, “ఒక్కో సన్నివేశం రాస్తుంటే నేనెక్కడో గాల్లో నడుస్తున్నట్టు అనిపించింది. షూటింగ్ మొదటి రోజు మహేష్ బాబుకు రాముడి గెటప్ వేసి ఫోటో షూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. మహేష్ కృష్ణుడి పాత్రకు సూట్ అవుతాడని అనుకున్నా, రాముడికి సరిపోతాడా అనే సందేహం ఉండేది. ఆ అనుమానాల మధ్యనే ఫోటో షూట్ చేశాము. ఆ ఫస్ట్ లుక్‌ను నిన్నటి వరకు నా వాల్‌పేపర్‌గా ఉంచుకున్నాను. ఈ ఎపిసోడ్‌ను 60 రోజులు షూట్ చేశాము. ఇందులో అనేక సబ్ ఎపిసోడ్స్ ఉంటాయి,” అని వివరించాడు.
రాజమౌళిపై దారుణంగా ట్రోలింగ్
రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వీడియో రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. టెక్నికల్ సమస్యలపై దేవుడిని దూషించాడా, దేవుడిపైన నమ్మకం లేదని చెప్పి దేవుళ్ల కథలతో సినిమాలు తీస్తాడా అని కొంతమంది నెటిజన్లు, భక్తులు విమర్శిస్తున్నారు. పలు హిందూ సంస్థలు కూడా రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై సినిమాలు చేసి.. కోట్లు కోట్లు డబ్బు సంపాదిస్తావు.. కానీ దేవుడు అంటేనమ్మకం లేదు అంటావా అని రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్నారు.
రాజమౌళి నీ పతనం ప్రారంభః 👎
మహామహులే కాలగర్భంలో కలిసిపోయారు.
నీకు పొగరు తల కెక్కి దేముడి మీద మాట్లాడుతున్నావ్.....
దేముడంటే ఇష్టం లేదా నీకు ....?
అతిసర్వత్రా వర్జ్యతేన్..— NAMO NAMO (@VVRBSRSU) November 16, 2025
పతనం ప్రారంభః 👎
మహామహులే కాలగర్భంలో కలిసిపోయారు సార్
అతిసర్వత్రా వర్జ్యతేన్https://t.co/kRmyvXOjg4— Bond-Imhotep 🚩 (@BondImhotep) November 15, 2025
ముదురుతోన్న వివాదం..
మహామహులే కాలగర్భంలో కలిసిపోయారు సార్ నువ్వెంత.. నీ పతనం స్టార్ట్ అయ్యింది అని కొందరు.. నోటి దూల తగ్గిచుకుంటే మంచిది అని మరికొందరు.. నీకు పొగరు తల కెక్కి దేముడి మీద మాట్లాడుతున్నావ్..... దేముడంటే ఇష్టం లేదా నీకు ....?అని ఇంకొందరు.. ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక రాజమౌళి దీనిపై స్పందించకపోతే వివాదం మరింత ముదిరి.. పెరిగే అవకాశం కనిపిస్తోంది.
That error was ur team’s mistake, not God’s.
Being an atheist is fine, but blaming the divine (Hanuman) at an event for a God based movie was unnecessary & can hurt the sentiments of many people.
Be careful with ur words, @ssrajamouli garuhttps://t.co/7D7x00FMDS— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 ⛩️⚔️彡★ (@_jspnaveen) November 15, 2025