పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సరైనదేనా? జనాల రియాక్షన్ ఏంటీ?
పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించారు. దీనిపై జనాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం. ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకునే ఒక యువకుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ షోకి వెళ్లడమే గొప్ప. అలాంటిది టైటిల్ గెలిచి సంచలనానికి తెరలేపాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టాడు. సింపథీతో జనాలు అతన్ని ఆదరించారు అంటే సరికాదు. పల్లవి ఆటతో, మాటతో మెప్పించి అభిమానులను సంపాదించుకున్నాడు. పల్లవి ప్రశాంత్ హౌస్లో కీలక విజయాలు సాధించాడు. పవర్ అస్త్ర గెలిచాడు. హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. అవిక్షన్ పాస్ గెలిచాడు.
టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి దక్కకుండా పోయింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో పడ్డాడు. పోలీసుల మాట వింటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యేవాడు కాదు. బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్ కి పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడిని పంపారు.
రెచ్చిపోయి పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేసిన ఆకతాయిలు అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పలేం. ఆ ముసుగులో ఎవరైనా చేసి ఉండొచ్చు. పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సామాన్యులకేనా శిక్షలు. అదే ఒక సెలెబ్రిటీ ఇదే పని చేస్తే... అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరోల ఫ్యాన్స్, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎన్నిసార్లు పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేయలేదు. ఏ హీరోనైనా అరెస్ట్ చేశారా? రాజకీయనాయకుడిని రిమాండ్ కి తరలించారు. ఫ్యాన్స్ వరకు ఎందుకు హీరోలు, రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ ఉల్లఘించిన సందర్భాలు అనేకం. మొక్కుబడిగా జీప్ ఎక్కించి మరలా వదిలేస్తారు.
ఫ్యాన్స్ చేసిన రచ్చకు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి ఏకంగా... రిమాండ్ కి పంపారు. దీనిపై జనాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్షించాలి. కానీ న్యాయం సామాన్యులకు ఒకలా, సెలెబ్రిటీలకు మరోలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఇగో దెబ్బ తీసిన పల్లవి ప్రశాంత్ పై కక్ష తీర్చుకున్నారన్న వాదన తెరపైకి వస్తుంది...
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ షో కారణంగా అరెస్ట్ అయిన మొదటి కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ రికార్డులు ఎక్కాడు. తమకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని యూట్యూబ్ ఛానల్స్ అతనిపై అక్కసు వెళ్ళగక్కాయి. అది కూడా ప్రశాంత్ ని దెబ్బతీసింది. రిమాండ్ ముగిసే వరకు పల్లవి ప్రశాంత్ బయటకు రాలేడు.