- Home
- Entertainment
- TV
- Pranitha : బుల్లితెరపైకి ప్రణీతా... మొత్తానికి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న బుట్టబొమ్మ
Pranitha : బుల్లితెరపైకి ప్రణీతా... మొత్తానికి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న బుట్టబొమ్మ
టాలీవుడ్ బుట్టబొమ్మ ప్రణీతా సుభాష్ Pranitha Subhash చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రత్యేకంగా బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యింది.

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తెలుగు చిత్రాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, సిద్ధార్థ్, మంజు మనోజ్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక మొదటి లాక్ డౌన్ లోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, వ్యాపార వేత్త నితిన్ రాజ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది పండంటి ఆడబిడ్డకూ జన్మిచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొందింది.
ఇక ప్రస్తుతం మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. కొద్దినెలలుగా సినీ ఫంక్షన్లకు హాజరవుతూనే కనిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని ఎదురుచూస్తున్నారు.
కాగా, ఐదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయ్యింది. తన అభిమానులతో టీవీ ఆడియెన్స్ ను ఖుషీ చేసేందుకు ప్రణీతా సుభాష్ స్మాల్ స్క్రీన్ పై మెరియబోతోంది. అదికూడా పాపులర్ డాన్స్ షో Dhee న్యూ సీజన్ కోసం రానుండటం విశేషం.
Dhee Celebrity Speial మెగా లాంచ్ సందర్భంగా ప్రణీతా సుభాష్ గెస్ట్ గా హాజరయ్యారు. శేఖర్ మాస్టర్ తో కలిసి షోకు జడ్జీగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రణీతను షోకు గ్రాండ్ గా ఆహ్వానించారు. ప్రణీతా షోలో ఆకర్షణీయంగా మెరిశారు.
షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబ్ 27న ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. నందు, హైపర్ ఆది యాంకర్లుగా వ్యవరిస్తున్నారు. ఈసారి కూడా మరింత జోష్ గా షోను రన్ చేస్తున్నారు. ఇక ప్రణీతా అటు మలయాళంలో తన మొట్టమొదటి సినిమా చేస్తోంది. దిలీప్ కుమార్ సరసన నటిస్తోంది.