NagaPanchami 29thJanuary:జ్వాలలోకి నంభూద్రి ఆత్మ, మేఘనతో పెళ్లికి ఒకే చెప్పిన మోక్ష, నాగమణి పూజకు పంచమి..!
తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు నాటకం ఆడతాను.. మీరు నన్ను ఆపి పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి చాలు అంటుంది. దానికి మోక్ష సరే అంటాడు.
Naga panchami
NagaPanchami 29thJanuary Episode:గత ఎపిసోడ్ లో పంచమి, ఫణీంద్రలు కరాళి స్థావరానికి వెళతారు. మేఘనను కరాళి తన కంట్రోల్ చేసి ఇలా చేస్తోందని అనుకుంటారు. అయితే.. ఆ విషయాన్ని ఆత్మ రూపంలో ఉన్న నంభూద్రి వినేస్తాడు. అందుకే ఆ విషయాన్ని తన చెల్లెలు మేఘనకు చెప్పాలని వెళతాడు. తనకు శరీరం లేకపోవడంతో.. జ్వాల శరీరంలోకి వచ్చి మేఘనతో మాట్లాడతాడు.
Naga panchami
నీ మీద పంచమి, ఫణీంద్రకు అనుమానం కలిగిందని.. జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. ఇప్పటి నుంచి నీకు ఏ సమాచారం ఇవ్వాలన్నా.. ఈ జ్వాల శరీరంలోకి వచ్చి మాట్లాడతాను అని అంటాడు. అప్పుడు మేఘన.. తాను ఆ మోక్షను బలి ఇవ్వాలని.. అందుకోసం ఈ ఇంట్లోనే ఉండాలని అంటుంది. అయితే.. మోక్ష తల్లి వైదేహి మాత్రం.. గతంలో తనను ఈ ఇంటి కోడలిని చేసుకోవాలి అని అనుకునేది.. ఇప్పుడు వేరే అమ్మాయిలను వెతుకుతోంది అని చెబుతుంది. నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే.. నువ్వు అనుకున్నది జరుగుతుంది చెల్లెమ్మ అని నంభూద్రి అంటాడు. ఆ ప్రయత్నంలోనే ఉంటాను అన్నయ్య అని మేఘన చెప్పడంతో జ్వాల శరీరంలో ఉన్న నంభూద్రి వెళ్లిపోతాడు.
Naga panchami
తన గదిలో కూర్చొని మోక్ష.... పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే.. మేఘన ఇస్తుంది. మీ అమ్మగారు మీకు ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారని.. నా స్నేహితురాలికి అన్యాయం చేయకండి అని మోక్షని అడుగుతుంది. తాను పంచమిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని మెక్ష అంటాడు. కానీ.. మీ అమ్మగారు అని మేఘన అంటే.. మా అమ్మ అనుకన్నది చేసే వరకు ఊరుకోదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు. అయితే.. మేఘన వెంటనే నాదో సలహా అని.. మీరు పెళ్లి చేసుకుంటాను అని మీ అమ్మగారికి చెప్పండి అంటుంది. అలా చెబితే.. వెంటనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తుంది అని మోక్ష అంటాడు.
Naga panchami
కానీ.. మీరు ఏ అమ్మాయి నచ్చడం లేదు అని చెప్పండి అని మేఘన అంటే.. మా అమ్మ దగ్గర అలాంటి పప్పులు ఏమీ ఉడకవు.. ఒప్పుకోదు అంటుంది. అప్పుడు మేఘన.. అయితే.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని మీ అమ్మగారికి చెప్పండి అంటుంది. ఆ మాట విని మోక్ష షాకౌతాడు. అయితే.. నిజంగా చేసుకోవద్దని.. మీరు నన్ను చేసుకుంటానని చెప్పండి.. ఆలోగా.. పంచమిని ఒప్పించి.. తీసుకురావచ్చు అని సలహా ఇస్తుంది. ఈ ఐడియా బాగుందని మోక్ష అంటాడు. కానీ మా అమ్మ నమ్మదేమో అని మోక్ష అంటాడు. అయితే.. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు నాటకం ఆడతాను.. మీరు నన్ను ఆపి పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి చాలు అంటుంది. దానికి మోక్ష సరే అంటాడు.
బయటకు వచ్చిన తర్వాత మేఘన.. ఈ జన్మలో మోక్ష, పంచమిలు కలుసుకోకుండా చేస్తానని.. ఆ పంచమికి మోక్ష బూడిద తప్ప మరేమీ మిగలనివ్వను అని అనుకుంటుంది. సంతోషంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది.
Naga panchami
మరోవైపు నాగమాతకు ఆదిశేషుడు ప్రత్యక్షమౌతాడు. తమ నాగలోంలో నాగమణి కాంతి.. మొత్తం వెదజల్లుతుందని అంటాడు. అయితే.. ఆ నాగమణికి పూజ చేయాల్సిన సమయం వచ్చిందని అంటాడు. అయితే.. దానికి రాణి వంశస్థులు మాత్రమే చేయాలి అని గుర్తు చేస్తాడు. అయితే.. రాణి వంశంలో చివరి మహారాణి ప్రాణాలు కోల్పోయిందని.. ఆమె కుమార్తె భూలోకంలో మనిషి రూపంలో ఉందని నాగ దేవత చెబుతుంది. ఆమెకు నాగశక్తులు ఇచ్చి.. నాగలోకానికి రప్పించి.. పూజలు చేయిస్తాను అని చెబుతుంది. ఆలస్యం చేయవద్దని ఆదిశేషు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో.. నాగ దేవత పంచమిని వెంటనే తమ లోకానికి రప్పించాలని అనుకుంటుంది.
Naga panchami
తర్వాత.. మోక్ష.. పంచమి దగ్గరకు వెళతాడు. నువ్వు లేకుండా నేను బతకలను అని మోక్ష చెబుతాడు. అయితే పంచమి తానొక విష కన్య అని..మీరు అమృతం అని.. కలిసి ఉండటం కష్టం అని అంటుంది. కానీ.. మోక్ష చెప్పిన మాటలకు బాధపడి.. పంచమి హత్తుకుంటుంది. కమింగప్ లో.. మేఘనతో పెళ్లి మోక్ష అందరి ముందు ఒప్పుకుంటాడు. ఇదే విషయం పంచమికి చెబుతాడు. కానీ.. పంచమి ఈ పెళ్లి జరగకూడదు అని అంటుంది. మేఘన కూడా తనలాగే నాగకన్య అని..కలిస్తే చనిపోతారు అని చెబుతుంది. అయితే.. మేఘననే పెళ్లి చేసుకుంటాను అని మోక్ష పట్టుపడతాడు.