- Home
- Entertainment
- TV
- Naga Panchami Episode: మోక్షకు మరో పెళ్లి చేస్తానన్న వైదేహి, కరాళిపై పంచమికి అనుమానం..!
Naga Panchami Episode: మోక్షకు మరో పెళ్లి చేస్తానన్న వైదేహి, కరాళిపై పంచమికి అనుమానం..!
తనకు మళ్లీ ఇష్టరూప శక్తులు ఇస్తే.. తాను నిజం నిరూపించి, నాగలోకానికి యువరాణితో సహా వస్తాను అని చెబుతాడు. దీంతో.. నాగదేవత సరే అంటుంది.

Naga panchami
Naga Panchami Episode: పంచమి సుబ్బుతో మాట్లాడుతూ ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని.. ఒకరు లేకుండా మరొకరు జీవించలేరని సుబ్బు చెబుతాడు. కానీ.. పంచమి తాము పూర్తిగా విడిపోయాం అని.. మళ్లీ కలిసేది లేదు అిని తేల్చి చెబుతుంది. కానీ.. అదంతా తన కళ. సుబ్బు వచ్చినట్లు ఊహించుకొని నిద్రలో మాట్లాడుతుంది. అది విని పంచమి తల్లి లేస్తుంది. పంచమిని కూడా లేపుతుంది. అప్పుడు పంచమి తల్లి.. నువ్వు మోక్ష లేకుండా జీవించలేవమ్మా అని చెబుతుంది. కానీ పంచమి తప్పదని.. మర్చిపోక తప్పదు అని చెప్పి బాధపడుతుంది.
Naga panchami
సీన్ కట్ చేస్తే... ఫణీంద్ర ఒంటికాలుతో దీక్ష చేస్తాడు. అతని దీక్షకు సంతోషించి నాగదేవత ప్రత్యక్షమౌతుంది. నీ దీక్ష కు మెచ్చాను ఫణీంద్ర అని చెబుతుంది. ఇక.. తాను ఏ తప్పు చేయలేదని.. యువ రాణి వేషంలో వచ్చి ఎవరో తనను మోసం చేశారని జరిగినందంతా చెబుతాడు. అతని మాటలు నమ్మసక్యంగా ఉండటంతో నాగదేవత కాస్త కూల్ అవుతుంది. తనకు మళ్లీ ఇష్టరూప శక్తులు ఇస్తే.. తాను నిజం నిరూపించి, నాగలోకానికి యువరాణితో సహా వస్తాను అని చెబుతాడు. దీంతో.. నాగదేవత సరే అంటుంది.
Naga panchami
మరోవైపు మోక్ష.. పంచమి ఊరు వెళ్లతాడు. తనతోపాటు రమ్మని బతిమాలడతాడు. కానీ పంచమి వినిపించుకోదు. తాను ప్రస్తుతం పంచమిని కాదని.. కేవలం ఓ నాగకన్యని మాత్రమే అని చెబుతుంది. తనతో ఉంటే.. జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం ఉండవని చెబుతుంది. అయితే.. తనకు అవన్నీ అవసరం లేదని.. నువ్వు నా వెంట ఉంటే చాలు అని మోక్ష ఎంత బలిమిలాడినా పంచమి వినిపించుకోదు. దీంతో.. నిరాశగా.. మోక్ష ఇంటికి వెళ్లిపోతాడు.
Naga panchami
ఇక.. పంచమి దగ్గరకు ఫణీంద్ర వచ్చి.. నాగదేవత మరో అవకాశం ఇచ్చిందనే విషయం చెబుతాడు. నీ రూపంలో వచ్చింది ఎవరో ఎలా తెలుసుకోవాలి అని ఫణీంద్ర అంటే... కరాళి వచ్చి ఉంటుంది.. తన శత్రువు కరాళి మాత్రమే అని పంచమి చెబుతుంది. నువ్వు నాకు సహాయం చేస్తే.. ఆ కరాళిని పట్టుకుంటాను అని ఫణీంద్ర అంటాడు.. అప్పుడు మనం నాగ లోకానికి వెళ్లొచ్చని.. నీ మీద ఉన్న నింద తొలగిపోతుందని చెబుతాడు.
Naga panchami
అయితే.. తన కోసం కాకపోయినా.. మోక్ష బాబుని ఆ కరాళి మాయ నుంచి కాపాడటానికి అయినా... తాను సహాయం చేస్తాను అని పంచమి చెబుతుంది. మరోవైపు మోక్షకు మరో పెళ్లి చేయాలని వైదేహి పట్టుపడుతుంది. అది విని... మోక్ష షాకౌతాడు. అది విన్న మేఘన... మోక్ష తన చెయ్యిజారకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుంటుంది.