- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: జ్యో, పారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన దీప- భయంతో దాసు దగ్గరకి జ్యో..
Karthika Deepam 2 Latest Episode: జ్యో, పారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన దీప- భయంతో దాసు దగ్గరకి జ్యో..
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 8వ తేదీ)లో ఎందుకు మీరు ఆ ఇంట్లో అవమానాలు పడుతున్నారో నిజం చెప్పమని అడుగుతుంది కాంచన. జ్యో సుమిత్ర కూతురు కాదంటుంది దీప. భయంతో దాసు దగ్గరకి పరిగెత్తుతుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 Latest Episode:
కార్తీక దీపం 2 బుధవారం ఎపిసోడ్ లో.. ఇంతకు ముందు దీప కోసం అనేవాడివి ఇప్పుడు మా అన్నయ్య కూతురి కోసం అంటున్నావని.. ఎవరినో బాగు చేయడానికి మీరు అవమానపడటం ఎందుకు? అని కాంచన దీప, కార్తీక్ లపై అరుస్తుంది. దాని బుద్ధి మంచిది కాదు. ఆలోచనలు సరిగ్గా ఉండవు. దాని కోసం ఎందుకు అంత తాపత్రాయం అంటుంది కాంచన. వదిలేయమంటావా అమ్మా అంటాడు కార్తీక్. కొందరికి మంచి జరుగుతుందంటే మన విలువలను తగ్గించుకోవడంలో తప్పేం లేదంటాడు. ఏదో ఒక రోజు దీప, కార్తీక్ కలిసి అన్ని కుటుంబాలను ఒకటి చేస్తారని అనసూయ అంటుంది.
అలిగిన శౌర్య
అందరూ కనిపిస్తున్నారని కానీ శౌర్య ఎక్కడికి వెళ్లింది అంటాడు కార్తీక్. రౌడీ రాదు. మాట్లాడదు అంటుంది. అలిగింది అంటుంది శౌర్య. ఎందుకో అని కార్తీక్ అనగానే.. సైకిల్ కావాలని అడుగుతుంది. దీపావళికి కొంటానని చెబుతాడు కార్తీక్. అయితే ఈ రోజే దీపావళి సైకిల్ కొనమని అంటుంది శౌర్య. నాన్న ఎప్పుడైనా మాట తప్పాడా.. చెప్పాడంటే కొనిస్తాడు అనగానే సంతోషంగా పక్కకు వెళ్తుంది శౌర్య. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం నీకు బాగా అలవాటైంది బావ అంటుంది దీప. ఏదో ఒక రోజు నిజం అందరికీ చెప్పేలా ఉన్నావని అంటుంది. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అంటాడు కార్తీక్. నువ్వు కూడా ఇలా ఉండకు. జ్యో, పారులకు తగ్గట్టుగా ఉండూ.. వారితోనే ఈ నిజాన్ని బయటపెట్టించాలి అంటాడు కార్తీక్.
జ్యో, పారులకు షాకిచ్చిన దీప
నవ్వుతూ పూల మొక్కలకు వాటర్ పడుతుంది దీప. అక్కడే ఉన్న జ్యో.. ఏంటీ బాగా హుషారుగా ఉన్నావని అడుగుతుంది. మనిషి అన్నాక ఇలాగే ఉండాలని మా బావ చెప్పాడని కౌంటర్ ఇస్తుంది దీప. నా కోసం బావ ఎందుకు ఇంట్లో ఉంటున్నాడని అడుగుతుంది జ్యో. అమ్మాయిగారి వల్లే ఇక్కడ ఉంటున్నాడు. కానీ మీకోసం కాదని అంటుంది దీప. అక్కడికి వచ్చిన పారు.. అత్త కూతురు ఎవరు? జ్యోత్స్ననే కదా అంటుంది. సుమిత్రమ్మ కూతురు నిజంగా అమ్మాయి గారేనా అని అర్థం వచ్చేలా దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. సుమిత్రత్త అమ్మాయి కోసమని కార్తీక్ అన్నాడు కదా అని పారు అంటుంది. జ్యోత్స్న కోసమని చెప్పలేదు కదా అని దీప అడుగుతుంది. సుమిత్ర కూతురు జ్యోత్స్నే కదా అని పారు అంటే, కానీ బావ అలా చెప్పలేదు కదా అని దీప అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఏంటో ఈ కన్య్ఫూజన్ అని పారు అంటే… నేను ఈ ఇంటి కూతురిని కాదు అని అది చాలా క్లారిటీగా చెప్పిందని జ్యో అంటుంది.
భయంతో దాసు దగ్గరికి పరిగెత్తిన జ్యో
దీప ఇచ్చిన షాక్ కి దాసు దగ్గరకు పరిగెడుతుంది జ్యోత్స్న. నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా నాన్న అంటుంది. ముందు నువ్వు నన్ను నాన్న అని పిలవడం మానేయ్. నేను లేనప్పుడు నువ్వు ఎలా పిలుస్తావో నాకు తెలుసు అంటాడు దాసు. అమ్మ మీద ఒట్టు నీ మీద ప్రేమ ఉంది నాన్న అంటుంది జ్యో. అందుకేనా మీ అమ్మ దగ్గరికి పంపించాలి అనుకున్నావంటాడు దాసు. తప్పు సరిదిద్దుకున్నా కదా అంటుంది జ్యోత్స్న. దీపకు తను ఎవరి కూతురో చెప్పావా? అని దాసును అడుగుతుంది జ్యో. నేను దీపకు నువ్వే సుమిత్ర, దశరథల అసలైన కూతురివని చెప్పడానికి క్షణం పట్టదు. కానీ నేను చెప్పలేదు. అయినా ఈ నిజం తెలిసినవాడ్ని నేను ఒక్కడినే ఉన్నానా? నాలాగే ఇంకెవరైనా చూసి ఉండొచ్చు కదా అని అంటాడు దాసు.
మా అమ్మ చంపించిన సైదులు ఇంకా బతికే ఉన్నాడేమో. వాడే వచ్చి దీపకు నిజం చెప్పాడేమో అంటాడు దాసు. జ్యోత్న్స, దాసు మాట్లాడుకునేది చూస్తాడు కాశీ. వీళ్లు పర్సనల్ గా కలవడం ఏంటీ? జ్యోత్న్స.. నాన్న చేతులు పట్టుకొని మరీ బ్రతిమాలడటం ఏంటి అని అనుకుంటాడు.
కాఫీ కప్ పగలగొట్టిన దశరథ
దశరథకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది దీప. ఈ రోజు చాలా విశేషమైన రోజట. భార్య భర్తలు కలిసి గుడికి వెళ్తే మంచిదట అని సుమిత్రను పిలిచి చెబుతుంది దీప. నేను ఎక్కడికీ వెళ్లడం లేదంటాడు దశరథ. మనలో మంచి లేకుండా దేవుడి గుడికి వెళ్లి నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన మంచి జరగదని అంటాడు. ఇంకెంత కాలం మీరు సుమిత్ర అమ్మతో మాట్లాడకుండా ఉంటారని అడుగుతుంది దీప. నాకు సుమిత్రమ్మకు మధ్య సమస్యలో మీరు ఎందుకు ఆమెను దూరం పెడుతున్నారని అడుగుతుంది. ఎవరి సమస్య? ఎవరు బాధపడుతున్నారో బాధ పడేవాళ్లకు, బాధ పెట్టేవాళ్లకే తెలుసు అంటాడు దశరథ.
చేతిలో ఉన్న కాఫీ కప్ ను చూపించి.. ఈ కప్ నా భార్య మీద పెట్టుకున్న నమ్మకం లాంటిదని నేలకేసి కొడుతాడు దశరథ. దీన్ని నువ్వు అతికించగలవా దీప అంటాడు. ఆఫ్ర్టాల్ కాఫీ కప్ నే అతికించలేవు. ఇక్కడ నేను కొన్నేళ్లుగా పెట్టుకున్న నమ్మకం పగిలిపోయింది. ఎలా అతుక్కుంటుంది? అని దశరథ అక్కడినుంచి వెళ్లిపోతాడు.
నువ్వ చేసిన తప్పును మర్చిపోను
సుమిత్రను చూస్తూ.. ఎందుకు మీరు సైలెంట్ గా ఉంటున్నారు. మీరైనా దశరథ గారితో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు కదా అని అంటుంది దీప. తప్పు చేశాను, శిక్ష అనుభవించనివ్వు దీప.. నేను కూడా నీ విషయంలో మారాలేమో అంటుంది సుమిత్ర. నీ మీద నాకున్న కోపాన్ని, ద్వేషాన్ని, నా భర్త విషయంలో నువ్వు చేసిన తప్పును నేను మాట్లాడను. అలా అనీ వాటిని ఎప్పటికీ మర్చిపోను అని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.