- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు మతిస్థిమితం లేదన్న శివన్నారాయణ- కోపంతో ఊగిపోయిన జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు మతిస్థిమితం లేదన్న శివన్నారాయణ- కోపంతో ఊగిపోయిన జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 31వ తేదీ)లో నా కూతురిపై నువ్వు కేసు పెడితే నీపై నేను పెడతాను అంటాడు శివన్నారాయణ. మీపై పరువునష్టం దావా వేస్తాను అంటాడు శ్రీధర్. జ్యోకు మతిస్థిమితం సరిగ్గా లేదు అంటాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో మీరు ఎవ్వరిని స్టేషన్ కి తీసుకొచ్చారో తెలుసా? శివన్నారాయణ కూతురినే పోలీసు స్టేషన్ కి తీసుకొస్తారా అని ఫైర్ అవుతాడు శివన్నారాయణ. నేను అత్తపై కేసు పెట్టలేదు. కోడలి కోసం అత్తే వచ్చిందని చెప్తుంది జ్యోత్స్న. నా కొడుకు లేని టైంలో నా కోడలిని తీసుకొస్తే ఊరుకుంటానా అంటుంది కాంచన.
శభాష్.. శివన్నారాయణ కూతురివి అనిపించావు అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న కంప్లెయింట్ చేస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు నా కూతురిని, నా కూతురి కోడలిని ఎలా స్టేషన్ కి తీసుకొస్తారని ఎస్సైని గట్టిగా ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. గతంలో జరిగిన విషయాలను చెప్పబోతాడు ఎస్సై. గతం గురించి కాదు. ఇప్పుడేం ఆధారాలు ఉన్నాయని అడుగుతాడు శివన్నారాయణ. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు కేసు ఫైల్ చేయండి అంటుంది జ్యోత్స్న.
నీపై నేను కేసు పెడతాను జ్యోత్స్న
నువ్వు నా కూతురిపై కేసు పెడితే.. నేను నీపై కేసు పెడతాను అంటాడు శివన్నారాయణ. షాక్ అవుతుంది జ్యోత్స్న. నా కోడలు సేఫ్ గానే ఉంది అని ఎస్సైతో చెప్పి బయటకు వెళ్తాడు శివన్నారాయణ. కాంచన మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటుంది పారు. గ్రానీ అని గట్టిగా అంటుంది జ్యోత్స్న. చేసింది చాలు. వెళ్దాం పదా అంటుంది పారు. ఇంతలో దీపకు ఫోన్ చేస్తాడు శ్రీధర్. మేము పోలీస్ స్టేషన్ లో ఉన్నామని చెప్తుంది కాంచన. ఎందుకు అని శ్రీధర్ ఆరా తీస్తుండగా.. ఫోన్ తీసుకొని అల్లుడు గారు మేము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పారు. నా భార్య జోలికి వచ్చావంటే నీకు బుద్ధి చెప్పాల్సిందే జ్యోత్స్న అనుకుంటాడు శ్రీధర్.
నీకు మా నాన్నకు వాళ్లే ఎక్కువ
మా నాన్నకు కూతురి కంటే మేనల్లుడు ఎక్కువ. భార్యకంటే చెల్లెలు ఎక్కువ. నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ. మనుమరాలి కంటే మనుమడు ఎక్కువ. పోలీస్ స్టేషన్ లో నన్ను అంత దారుణంగా అవమానించి వీళ్లను బయటకు తీసుకురావాలా అంటుంది జ్యోత్స్న. దాన్ని అవమానించడం అనరు. సరైన పద్ధతిలో నడిపించడం అంటారు అని చెప్తాడు శివన్నారాయణ. మా మమ్మీ కనిపించకుండాపోయి రెండు రోజులవుతోంది. దీపే కిడ్నాప్ చేసిందని తెలిసినా కూడా చూస్తూ ఊరుకోవాలా… నా కోడలు సేఫ్ గా ఉందని చెప్పారు కదా ఎక్కడుంది మా మమ్మీ? మా మమ్మీ సేఫ్ గా ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతుంది జ్యోత్స్న.
పరువు నష్టం దావా వేస్తా
నా భార్య మీ అమ్మను కిడ్నాప్ చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతూ లోపలికి వస్తాడు శ్రీధర్. కాంచన ఏదో చెప్పబోతుండగా నువ్వు ఇంకా నీ మేనకోడలిని వెనకేసుకురాకు అంటాడు శ్రీధర్. నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మామయ్య అంటుంది జ్యోత్స్న. నీకు ఇంకా బంధాలు, బంధుత్వాలు గుర్తు ఉన్నాయా? అంటాడు శ్రీధర్. నా భార్యపై ఎందుకు కేసు పెట్టారో చెప్పకపోతే మీపై పరువునష్టం దావా వేస్తాను అంటాడు.
జ్యోకు మతిస్థిమితం సరిగ్గా లేదు
జ్యోత్న్సకు ఈ మధ్య మతిస్థిమితం సరిగ్గా లేదు శ్రీధర్.. చూసినవి చూడలేదు అనుకుంటోంది. చూడనివి చూశాను అనుకుంటోంది అంటాడు శివన్నారాయణ. అది తనని చూస్తే అర్థమవుతోంది అంటాడు శ్రీధర్. సుమిత్ర అమ్మ గారు మా ఇంట్లో లేరని దీపను అత్త మీద ఒట్టేసి చెప్పమను. చెప్పలేదు. ఎందుకంటే మా మమ్మీని దీపే దాచిపెట్టిందని అంటుంది జ్యోత్స్న. దీపపై డౌట్ ఉంటే నా భార్యపై ఎందుకు కేసు పెట్టావని అడుగుతాడు శ్రీధర్. నేను పెట్టలేదు. వాళ్లు ఉత్తమ అత్తకోడళ్లు కాబట్టి ఒకరికోసం ఒకరు వచ్చారు అని చెప్తుంది జ్యోత్స్న.
ఇంటికి వచ్చిన సుమిత్ర, దశరథ
ఇంతలో ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. నీ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. ఎర్రనీళ్లు తీసుకు రా అని దీపతో చెప్తాడు కార్తీక్. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. ఈ ఇంటి దేవత కోసమని చెప్తాడు కార్తీక్. అర్థం కాలేదా అయితే ఇటువైపు చూడండని సుమిత్ర, దశరథలను చూపిస్తాడు. షాక్ అవుతుంది జ్యోత్స్న. సంతోషపడతారు మిగతా వాళ్లంతా. సుమిత్ర, దశరథలను అక్కడే ఆగమని చెప్పి.. ఎర్రనీళ్లతో దిష్టి తీయమని దీపకు చెప్తాడు కార్తీక్. కొత్త పెళ్లి జంటలాగా కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మని అత్తమామలకు చెప్తాడు.
క్షమాపణ కోరిన సుమిత్ర
ఇంట్లోకి వచ్చిన సుమిత్ర.. శివన్నారాయణ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండి మామయ్య గారు అంటుంది. తప్పు చేశారు. సరిదిద్దుకున్నారు. చాలు అని కొడుకు, కోడలిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు శివన్నారాయణ. మీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది సుమిత్ర. మెడిసిన్ లాంటి మనుమడు నా పక్కన ఉంటే నాకేం అవుతుందమ్మ అంటాడు శివన్నారాయణ. కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది పారు.
కోపంతో ఊగిపోయిన జ్యో
నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? నీకేమైనా మతిపోయిందా అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ తిరిగి వచ్చిందే. వెళ్లి పలకరించాలి కదా అంటుంది పారు. నా మొహం చూసిందా? నాతో మాట్లాడిందా? అంటుంది జ్యోత్స్న. ఇంకో రెండు నిమిషాలు ఉంటే మాట్లాడేది అంటుంది పారు. తాత ఒకప్పుడు మనుమడిని పక్కకు పెట్టి నన్ను సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టి మనుమడిని నెత్తిన పెట్టుకుంటున్నాడు అంటుంది జ్యోత్స్న.
ఆ కార్తీక్ పెద్ద మాయలోడే. అయినా వాళ్లను అనడం కాదు.. తప్పు నీదే అంటుంది పారు. నేనేం తప్పు చేశాను అంటుంది జ్యో. మన తప్పులు మన నోటితే చెప్పుకుంటే బాగుండదు కిందకి వెళ్దాం పదా అంటుంది పారు. అందరూ నన్నే అనండి. నేను రాను అంటుంది జ్యోత్స్న. రాకపోతే ఛీ అంటారే.. నువ్వు అలాంటి దిక్కుమాలిన పని చేసి చచ్చావ్ అంటుంది పారు. అయితే నువ్వు కూడా వెళ్లి వాళ్లతో కలిసిపో అంటుంది జ్యోత్స్న. నువ్వు నా మనుమరాలివి కాకపోతే అలాగే చేసేదాన్ని అంటుంది పారు. ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా అంటుంది జ్యోత్స్న. ఏంటి చేసేది గాడిద గుడ్డు అని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.