- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోను ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న శివన్నారాయణ- కోపంతో ఊగిపోయిన పారు
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోను ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న శివన్నారాయణ- కోపంతో ఊగిపోయిన పారు
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 13వ తేదీ)లో నువ్వు నా టీంలో ఉండాలి జ్యోత్స్న అంటాడు శ్రీధర్. నాకు జరిగిన అవమానం చాలు అంటుంది జ్యోత్స్న. ఇంట్లో నుంచి వెళ్లిపో జ్యోత్స్న అంటాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో నేను స్వాగత సత్కారాల కోసం ఇక్కడికి రాలేదు. నాకు మీ ప్రేమ కావాలి. అది ఈ రూపంలో అందింది అంటాడు శ్రీధర్. నీకు అందింది అంటే ఇంకెవరికో దూరమైనట్లే కదా అంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న.. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఏదో సాధించాననే గర్వం కూడా లేదు. నేను ఇప్పుడు నీకోసమే వచ్చాను అంటాడు శ్రీధర్.
ఇంట్లో నుంచి వెళ్లిపోతాను
చేయాల్సింది అంతా చేసి నాకోసం ఎందుకు రావడం అంటుంది జ్యోత్స్న. నువ్వు ఆఫీసుకు రావాలి అంటాడు శ్రీధర్. నాకు జరిగిన అవమానం చాలు అంటుంది జ్యోత్స్న. చెప్పేది పూర్తిగా విను అంటాడు శ్రీధర్. నా మీద ఎవ్వరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి రాను. అసలు ఈ ఇంట్లోనే ఉండను. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటుంది జ్యోత్స్న.
వెళ్లిపో జ్యోత్స్న
వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఈ క్షణమే వెళ్లిపో.. ఇంట్లో నుంచి కాదు.. ఈ దేశం నుంచే వెళ్లిపో అంటాడు. అంతా షాక్ అవుతారు. నీకు మేము అవసరం లేనప్పుడు.. నువ్వు ఎక్కడున్నా మాకు ఒకటే అంటాడు శివన్నారాయణ. సుమిత్ర తన కూతురి గురించి బాధపడుతోందని ఇష్టం ఉన్నా, లేకున్నా.. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అంటాడు శివన్నారాయణ. ఆ మాటకు సపోర్ట్ చేస్తాడు దశరథ.
నువ్వు జ్యోత్స్నను సీఈఓగా చూడాలి అనుకుంటున్నానని ఒక్క మాట చెప్పు అత్తా.. నేను తాతను ఎలాగైనా ఒప్పిస్తానని సుమిత్రతో అంటాడు కార్తీక్. నా తండ్రికి పదవి ఇవ్వడం వల్ల నీ కూతురు నీకు దూరం అవుతుందని నువ్వు అనుకుంటే నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటాడు కార్తీక్. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంటుంది సుమిత్ర. నువ్వు నాతో ఉండు జ్యోత్స్న. నేను కోరుకున్నట్లు ఉండు. పెళ్లి చేసుకో.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నీకొద్దు అని లగేజ్ బ్యాగ్ ని తీసుకెళ్లి లోపల పెడుతుంది సుమిత్ర.
అన్నింటికి కారణం నువ్వే
నువ్వు కచ్చితంగా ఆఫీసుకి రావాలి. నువ్వు నా టీంలో ఉండాలి. కంపెనీ లాభనష్టాల గురించి చెప్పాల్సింది నువ్వే జ్యోత్స్న అంటాడు శ్రీధర్. నీకిచ్చే గౌరవం నీకు ఇస్తారు. ఛైర్మన్ గారి మనుమరాలి పోస్ట్ అంటే చిన్నదేమి కాదు అంటాడు కార్తీక్. వీటన్నింటికి కారణం నువ్వేరా అంటుంది పారు. వెనకాల నుంచి నడిపించేది నువ్వే. మీ నాన్నను సీఈఓ చేసింది నువ్వే. నా మనుమరాలికి అన్యాయం చేశారు. మీ ఇంట్లో మేము ఉన్నామో.. మా ఇంట్లో మీరున్నారో తెలియకుండా అయిపోయింది. మిగిలిన వాళ్లని కూడా తీసుకొచ్చి ఏదో ఒక పదవి కట్టపెట్టండి అని అక్కసు వెళ్లగక్కుతుంది పారిజాతం.
శ్రీధర్ ను సీఈఓ చేయాలి అనుకున్నది నేను. దాంతో కార్తీక్ సంబంధం లేదు అంటాడు శివన్నారాయణ. మీరు చేసిన తప్పులు వేరేవాళ్లు ఎత్తి చూపిస్తే తప్పా మీకు బుద్ధి రాదా పారిజాతం అంటాడు శివన్నారాయణ. ఏం తప్పులు చేశాం అంటుంది పారిజాతం. నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం తప్పు కాదా? అంటాడు శ్రీధర్. కార్తీక్ ని ఇక్కడ అగ్రిమెంట్ తో బంధించారు కాబట్టే.. జ్యోత్స్న రెస్టారెంట్స్ ఇలా ఉన్నాయి. లేకపోతే.. సత్యరాజ్ రెస్టారెంట్ దెబ్బకు మీ పని ఔట్ అయ్యేది అంటాడు శ్రీధర్.
అగ్రిమెంట్ రాయించి కార్తీక్ ని ఆపింది జ్యోత్స్న తెలివితేటలే అల్లుడు అంటుంది పారు. జ్యోత్స్నకు సీఈఓ పోస్టు కాదు.. ఎండీ పోస్టు ఇచ్చిన తప్పులేదు అంటుంది. చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడం తెలివితేటలు కాదు స్వార్థం అవుతుంది అంటుంది దీప. నా బావ ఔన్నత్యాన్ని కొలవడానికి సరిపడా పదాలు నా దగ్గర లేవు అని కౌంటర్ ఇస్తుంది. సరే నేను వెళ్తాను మామయ్య గారు అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. నీతో పనుంది పదా కార్తీక్ అంటాడు శివన్నారాయణ. నన్ను ఎవ్వరూ లోపలికి రమ్మనలేదు అంటుంది జ్యోత్స్న. మీ మమ్మీ బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టిందంటేనే నిన్ను ఉండమని అర్థం. మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటుంది పారు.
మనమే కలపాలి
నీవల్లే మీ నాన్న సీఈఓ అయ్యాడని వీళ్లంతా అనుకుంటున్నారు. కానీ నాకు, నీకు మాత్రమే తెలుసు అది పూర్తిగా నా నిర్ణయమే అని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. నువ్వు సీఈఓ అయితే బాగుండు అనిపించింది. కానీ అడ్డుపడుతారని ముందే తెలుసు. అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది. దీప సీఈఓ అయినా ఓకే అనుకున్నా. కానీ దీప చేయలేను అంది. అందుకే నేను అనుకున్న మనిషినే పిలిపించా అంటాడు శివన్నారాయణ.
మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే మీ అమ్మ ముందు మీ నాన్నని కొట్టాను. ఇంట్లో నుంచి గెంటేశాను. అదే నేను చేసిన తప్పు. నేను కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసిందని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. మీ నాన్నను ఎందుకు సీఈఓ చేశానంటే.. నేను మీ నాన్నను క్షమించానని మీ అమ్మకు తెలియాలి. వారిద్దరూ మళ్లీ కలవాలి. మనమే వాళ్లను కలపాలి కార్తీక్ అంటాడు శివన్నారాయణ. మీ అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయమని చెప్తాడు.
కాస్త ఆశ్చర్యంగానే ఉంది
మీ నాన్నను సీఈఓగా మా నాన్న ఒప్పుకున్నారంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది అంటుంది కాంచన. కోడలు కూతురితో సమానం అయితే అల్లుడు కొడుకుతో సమానం. పిల్లనిచ్చిన మామకు పెట్టే హక్కు ఉంటుంది. కొట్టే హక్కు ఉంటుంది. తప్పు చేశాడని దూరం పెట్టారు. ఆయనలో వచ్చిన మార్పు చూసి దగ్గరకు తీసుకున్నారని అంటుంది అనసూయ. కొన్నిసార్లు మంచి కొడుకు వల్ల కూడా తండ్రి విలువ మారుతుంది అంటుంది కాంచన. బావ లాంటి కొడుకు ఉన్న మీరిద్దరూ అదృష్టవంతులే అంటుంది దీప. మాట వరుసకు కూడా మా ఇద్దరిని కలిపి అనకు అంటుంది కాంచన.
మాస్టారు సీఈఓ అయిన సందర్భంగా మనం కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి అంటాడు కార్తీక్. నాకు ఆకలిగా ఉంది. తినడానికి వెళ్దామని టాపిక్ డైవర్ట్ చేసి పక్కకు వెళ్లిపోతుంది కాంచన. అత్తయ్య మనసు బాధపెట్టకు అంటుంది దీప. చిరాకుగా లేచి వెళ్లిపోతాడు కార్తీక్. నేను ఏమన్నానని అలా వెళ్లిపోతున్నావు. అత్తయ్య మనసు బాధపెట్టకు అనడం కూడా తప్పేనా అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.