- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను అవమానించిన జ్యో- సీఈఓ పోస్ట్ వద్దన్న దీప- కొత్త పర్సన్ ఎంట్రీ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను అవమానించిన జ్యో- సీఈఓ పోస్ట్ వద్దన్న దీప- కొత్త పర్సన్ ఎంట్రీ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 11వ తేదీ)లో ఒక పల్లెటూరి మొద్దు సీఈఓ కావడానికి నేను అస్సలు ఒప్పుకోను అన్న జ్యోత్స్న. నోరు అదుపులో పెట్టుకోమన్న కార్తీక్. ఓటింగ్ లో గెలిచి సీఈఓ పోస్టును రిజెక్ట్ చేసిన దీప. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో నా తరఫున నా భార్య దీపను సీఈఓగా ప్రపోజ్ చేస్తున్నాను అంటాడు కార్తీక్. ఆ మాట విని బయటకు వెళ్లిపోతుంది దీప. వెనుకే వెళ్తాడు కార్తీక్. ఏంటీ బావ ఇది. నేను లోపలికే రాను అన్నాను. నువ్వేమో ఏకంగా సీఈఓ పోస్టే తీసుకోమంటున్నావు. నాకు ఇష్టం లేదు అంటుంది దీప. ఇదంతా ఎవరిది? కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా.. అని దీపను కన్విన్స్ చేసి మీటింగ్ రూమ్ లోకి తీసుకెళ్తాడు కార్తీక్.
పల్లేటూరి మొద్దుకు సీఈఓ పోస్టా?
సీఈఓ కావడానికి దీపకున్న అర్హత ఏంటి? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. 5వ తరగతి కూడా పూర్తిచేయని ఓ పల్లెటూరి మొద్దు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అవుతుంది? ఇంగ్లీష్ చదవలేదు. మీటింగ్స్ లో మాట్లాడలేదు తను సీఈఓ అయితే ఈ కంపెనీ భవిష్యత్తు ఏంటి? అని బోర్డు మెంబర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది జ్యోత్స్న. అదీ అలా అడగవే. ఇప్పుడు కార్తీక్ గాడి నోరు మూసుకుపోతుంది అని మనసులో అనుకుంటుంది పారు. ఇప్పుడు ఏం మాట్లాడుతాడు చూద్దామని పక్కనే ఉన్న సుమిత్రతో అంటుంది.
అన్నీ అర్హతలున్న నువ్వు ఈ కంపెనీకి ఏం చేశావు?
నా భార్య గురించి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోమంటాడు కార్తీక్. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటుంది జ్యోత్స్న. పల్లెటూరి మొద్దు అని నా భార్య గురించి అనడం కరెక్ట్ కాదు అంటాడు కార్తీక్. ఆ మాటను నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటుంది జ్యోత్స్న.
దీప ముత్యాల గూడెం అనే పల్లెటూరిలో పుట్టింది. 5వ తరగతి వరకే చదివింది నిజమే. కానీ తన తండ్రి కష్టం చూడలేక తనకు ఇష్టమైన చదువును వదిలేసింది. చిన్నప్పటి నుంచే వాళ్ల హోటల్లో పనులు చేయడం మొదలు పెట్టింది. రకరకాల వంటలు నేర్చుకుంది. చిన్న చిన్న స్కీములు పెట్టి వాళ్ల హోటల్ ఆదాయాన్ని పెంచింది. సత్యరాజ్ రెస్టారెంట్ ని కూడా ఎలా పైకి తీసుకొచ్చామో మీరే చూశారు. అదీ దీప అర్హత. అన్నీ అర్హతలున్న నువ్వు ఈ కంపెనీని ఏం చేశావు జ్యోత్స్న అంటాడు కార్తీక్. ఒక మాజీ సీీఈఓగా నేను నా భార్య పేరు ప్రపోజ్ చేస్తున్నానంటే తనపై నాకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అంటాడు బోర్డు మెంబర్స్ తో.
ఓటింగ్ లో గెలిచిన దీప
నీకు నమ్మకం ఉంటే సరిపోదు. అందరూ నమ్మాలి అంటుంది జ్యోత్స్న. అయితే మీ ఇద్దరి మధ్య ఓటింగ్ పెడతాను. ఎవరు గెలిస్తే వారే సీఈఓ అంటాడు శివన్నారాయణ. మా కుటుంబ సభ్యులు కాకుండా మిగిలిన ఆరుగురికి ఓటు వేసే అధికారం ఉంది. నా నిర్ణయం నేను చివరలో చెప్తాను అంటాడు శివన్నారాయణ. దశరథను జ్యోత్స్నకే ఓటు వేయమని చెప్పు అని సుమిత్రతో చెప్తుంది పారు. ఆయనకు తెలుసులేండి అత్తయ్య అంటుంది సుమిత్ర. అందరూ దీపకే ఓటు వేస్తారు. షాక్ అవుతుంది జ్యోత్స్న. కార్తీక్ తో సహా అందరూ దీపకు కంగ్రాట్స్ చెప్తారు. నువ్వు కూడా దీపనే సపోర్ట్ చేశావు కదా డాడీ. నేను ఈ విషయాన్ని అస్సలు మర్చిపోను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
నాకు ఈ పదవి వద్దు
దీపను ధైర్యంగా మాట్లాడమని చెప్తాడు కార్తీక్. దీప అందరికీ థాంక్స్ చెప్తుంది. మా బావ లేకుండా నేను లేను. తనని చూసే మీరందరూ నాకు ఓటు వేశారని నాకు తెలుసు. కానీ నేను ఈ పదవికి అర్హురాలిని కాను అని షాక్ ఇస్తుంది దీప. నా భర్తను రెండుసార్లు అవమానించిన ఈ స్థానాన్ని నేను తీసుకోలేను అంటుంది దీప. అందరూ షాక్ అవుతారు. శివన్నారాయణ మాత్రం దీపను మెచ్చుకుంటాడు.
ఇదంతా ఓ నాటకం
ఇదంతా ఓ నాటకం అని కూర్చున్న చోటు నుంచి పైకి లేస్తుంది పారిజాతం. కార్తీక్ ని మళ్లీ సీఈఓ చేయడానికి దీప నాటకం ఆడుతోంది అంటుంది పారు. దీప సీఈఓ పోస్టును వద్దంటే సీఈఓ మళ్లీ కార్తీకే అవుతాడు. వీళ్లిద్దరూ కావాలనే నాటకం ఆడుతున్నారు అంటుంది పారు. పిన్నీ మీరు కూర్చొండి అంటాడు దశరథ. కూర్చుంటావా.. లేదా బయటకు వెళ్తావా అని శివన్నారాయణ గట్టిగా అనడంతో సైలెంట్ గా కూర్చుంటుంది పారు.
కొత్త సీఈఓ ఎవరు?
అటు బావ, దీప సీఈఓ కాకుండా.. నేను సీీఈఓ కాకుండా మరి ఇంకెవరు కొత్త సీఈఓ అవుతారు తాత అంటుంది జ్యోత్స్న. నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానం ఉందంటాడు శివన్నారాయణ. కొత్త సీఈఓ ఎవరో అర్థంకాక అంతా షాక్ లో ఉంటారు. చిన్న స్మైల్ ఇస్తాడు కార్తీక్. మరోవైపు ఓ వ్యక్తి స్టైల్ గా వాక్ చేసుకుంటూ వస్తుంటాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.