MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కొత్త సీఈఓగా దీప- దీపను చంపుతానన్న పారు- దీప ప్లేస్ నాదేనన్న జ్యో

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కొత్త సీఈఓగా దీప- దీపను చంపుతానన్న పారు- దీప ప్లేస్ నాదేనన్న జ్యో

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 10వ తేదీ)లో నా మనుమరాలిని కాదని పనిమనిషిని సీఈఓ చేస్తే నేను ఊరుకోను అన్న పారు. దీపను నిజంగా చంపేస్తావా గ్రానీ అన్న జ్యో. నీకు ఒక్కసారైనా తాళికట్టినవాడు గుర్తుకు రాడా అన్న శ్రీధర్.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

3 Min read
Author : Kavitha G
Published : Nov 10 2025, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో ఈ రోజు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు ఉన్నావు అంటాడు కార్తీక్. అవును బావ అంటుంది దీప. ఎందుకు చేయరు. సీఈఓ అవుతోంది కదా.. ఇద్దరు కలిసే అన్ని చేస్తారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ గ్రానీ ఏంటీ ఇంకా రాలేదు అని ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఎంట్రీ ఇస్తుంది పారు. అది చూసిన జ్యోత్స్న.. గ్రానీ ఏంటీ మమ్మీని తీసుకొని వస్తోంది అని అనుకుంటుంది. నువ్వేంటి మమ్మీ ఆఫీసుకి వచ్చావు అంటుంది జ్యోత్స్న. రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది సుమిత్ర. 

మీరేందుకు ఆఫీసుకు వచ్చారు అంటాడు శివన్నారాయణ. దీప రాగా లేనిది మేమేస్తే తప్పేంటి? అంటుంది పారు. తప్పు అని నేను అన్నానా? అంటాడు శివన్నారాయణ. నేను మీతో మాట్లాడాలి అంటుంది పారు. ఇప్పుడే అదే చేస్తున్నావు కదా అంటాడు శివన్నారాయణ. విడిగా మాట్లాడాలి అంటుంది పారు. సరే పదా అని పక్కకు వెళ్తాడు శివన్నారాయణ. వెనకాలే వెళ్తారు కార్తీక్, జ్యోత్స్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దీప సీఈఓ ఏంటి?
Image Credit : jiohotstar

దీప సీఈఓ ఏంటి?

దీప సీఈఓ ఏంటి? అంటుంది పారు. ఆఫీసు విషయాలు నీకెందుకు అంటాడు శివన్నారాయణ. నా మనుమరాలిని కాదని ఓ పనిమనిషిని సీఈఓ చేస్తే నేను ఊరుకోను అంటుంది పారు. దీప  సీఈఓ అని ఎవరు చెప్పారని అడుగుతాడు శివన్నారాయణ. ఇంకెవరు చెప్తారు జ్యోత్స్న చెప్పుంటుంది అంటాడు కార్తీక్. నేను చెప్పడం నువ్వు చూశావా బావ అంటుంది జ్యోత్స్న. మరి పారిజాతానికి ఎవరు చెప్పారు అంటాడు శివన్నారాయణ. అయినా నేను దీపను సీఈఓగా చేయాలని అనుకోలేదు. కానీ నువ్వు చెప్పాక అది మంచి ఆలోచనే అనిపిస్తోంది. థాంక్స్ పారిజాతం మంచి సలహా ఇచ్చినందుకు అంటాడు శివన్నారాయణ. షాక్ అవుతారు పారు, జ్యో. నా భార్యను సీఈఓ చేయమన్నందుకు థాంక్స్ పారు అంటాడు కార్తీక్.

Related Articles

Related image1
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌కి జ్యో వార్నింగ్- బోర్డు మీటింగ్‌లో జ్యోకు ఎదురుదెబ్బ
Related image2
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు బిగ్ షాక్- కొత్త సీఈఓగా దీప?- దీప చావు ఖాయమన్న పారు
37
దీపను చంపేస్తాను..
Image Credit : jiohotstar

దీపను చంపేస్తాను..

గ్రానీ నువ్వు వచ్చిన పనేంటి? చేస్తున్న పనేంటి అంటుంది జ్యోత్స్న. ఓ పిచ్చిదాన వాళ్లు మనల్ని వెర్రివాళ్లను చేస్తున్నారే.. నేను అడిగాను కాబట్టి ఆ ఆలోచన నేను ఇచ్చాను అంటున్నారు. నేను అడకపోయినా వాళ్లు దీపనే సీఈఓ చేస్తారు అంటుంది పారిజాతం. అదే కదా నేను కూడా చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం గ్రానీ అంటుంది జ్యోత్స్న. సీఈఓగా దీప పేరు చెప్పనివ్వు.. ఒక్క పోటు పొడిచి దాన్ని పై లోకాలకు పంపిస్తాను అని కత్తి చూపిస్తుంది పారు. నిజంగా చంపుతావా అంటుంది జ్యోత్స్న. నా మనుమరాలి జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. దీప పేరు అనౌన్స్ చేయని ఏం చేస్తానో నువ్వే చూస్తావు అంటుంది పారు. ఆ మాటతో కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది జ్యోత్స్న.

47
తాళికట్టినవాడు గుర్తుకు రాడా?
Image Credit : jiohotstar

తాళికట్టినవాడు గుర్తుకు రాడా?

మరోవైపు కాంచన దగ్గరకు వస్తాడు శ్రీధర్. భోజనం చేస్తూ ఉంటుంది కాంచన. ఇంట్లో ఎవ్వరూ లేనట్లు ఉన్నారు అంటాడు. కార్తీక్, దీప డ్యూటీకి వెళ్లారు. అనసూయ అక్క పనుందని బయటకు వెళ్లింది. శౌర్య స్కూల్ కి వెళ్లింది అని చెప్తుంది కాంచన. నాకు బాగా ఆకలిగా ఉంది. నీతో పాటు తినొచ్చా అంటాడు శ్రీధర్. ప్లేటు తెస్తాను అని కాంచన వెళ్లబోతుండగా.. నేను తెచ్చుకుంటాను అని వెళ్తాడు శ్రీధర్. ప్లేటు తీసుకొని అన్నం వడ్డించుకుంటాడు. టమాటా పచ్చడిని చూసి ఇష్టంగా వేసుకొని తింటాడు.

ఇది నువ్వే చేశావు కదా. అదే టేస్ట్. రెండు సంత్సరాలు వెనకకు వెళ్లాను అంటాడు శ్రీధర్. నువ్వు నాకోసం ఓసారి ఈ పచ్చడి పెట్టావు అని పాత రోజులు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాంచన మాత్రం వారు విడిపోయిన  విషయాన్నే గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఎన్నిరోజులు కాంచన ఇలా.. నీ మెడలో ఉన్న తాళిని చూసినప్పుడైనా నేను నీకు గుర్తుకు రానా? అంటాడు శ్రీధర్. ఎందుకు గుర్తుకురారు. ఆ తాళికట్టిన చేయి మూడు ముళ్లు కాదు.. ఆరు మూళ్లు వేసింది అంటుంది కాంచన. సిగ్గుతో తల దించుకుంటాడు శ్రీధర్.

57
దీప ప్లేస్ నాదే మమ్మీ
Image Credit : jiohotstar

దీప ప్లేస్ నాదే మమ్మీ

మీరు కూడా కూర్చొని తినమని కార్తీక్, దీపలను అంటాడు శివన్నారాయణ. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. దీపకు వడ్డిస్తాడు కార్తీక్. దీప వంటలను మెచ్చుకుంటాడు దశరథ. జ్యోత్స్న దగ్గరికి వెళ్లి నేను ఎందుకు నీకు తోడు కావాలని కోరుకున్నానో నీకు అర్థమైందా జ్యోత్స్న అంటుంది సుమిత్ర. ఇక్కడ ఒకరికి మరొకరు తోడుగా ఉన్నారు. నీకే ఎవ్వరూ లేరు.. ఇప్పటికైనా అర్థం చేసుకొని పెళ్లి చేసుకో అంటుంది సుమిత్ర. నేను అనుకున్నది సాధించాకే అవన్నీ మమ్మీ అంటుంది జ్యోత్స్న. పక్కకు వెళ్తుంది సుమిత్ర. గ్రానీ దీపను చంపేస్తే ఆ ప్లేస్ నాదే మమ్మీ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

67
నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు సుమిత్ర
Image Credit : jiohotstar

నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు సుమిత్ర

కొత్త సీఈఓ ఎవరని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. ఇంకెవరూ తన రక్త సంబంధమే అని చెప్తుంది పారు. నువ్వు కొంచెం ఆగు పారిజాతం అంటాడు శివన్నారాయణ. సుమిత్ర వైపు చూసి నాతో ఏమైనా చెప్పాలా అమ్మా అంటాడు శివన్నారాయణ. ఏం లేదు మామయ్య గారు.. ఈ సంస్థని నిలబెట్టింది మీరు. దీనికోసం ఏం చేయాలో మీకు తెలుసు. మీ నిర్ణయమే మా నిర్ణయం అంటుంది సుమిత్ర. నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు కదా సుమిత్ర అని మనసులో అనుకుంటుంది పారు.

77
కొత్త సీఈఓగా దీప
Image Credit : jiohotstar

కొత్త సీఈఓగా దీప

కార్తీక్ మనం అనుకున్నది చెప్పు అంటాడు శివన్నారాయణ. నేను ఈ సంస్థలో ఉన్నా.. లేకపోయినా నా సేవలు, సహకారం ఎప్పుడూ ఈ సంస్థకు ఉంటూనే ఉన్నాయి.మనం ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి పనిచేశాం. ఇకపై కూడా అలాగే పనిచేయబోతున్నాం. నేను సీఈఓగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి.. కొత్త సీఈఓగా నేను నా భార్య దీప పేరును ప్రపోజ్ చేస్తున్నానని చెప్తాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌కి జ్యో వార్నింగ్- బోర్డు మీటింగ్‌లో జ్యోకు ఎదురుదెబ్బ
Recommended image2
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు బిగ్ షాక్- కొత్త సీఈఓగా దీప?- దీప చావు ఖాయమన్న పారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved