- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode:కంపెనీ షేర్లు కొనేందుకు వైరా కుట్ర-తెలివిగా తిప్పి కొట్టిన కార్తీక్
Karthika Deepam 2 Latest Episode:కంపెనీ షేర్లు కొనేందుకు వైరా కుట్ర-తెలివిగా తిప్పి కొట్టిన కార్తీక్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 10వ తేదీ)లో శివన్నారాయణ కంపెనీలో షేర్లు కొనేందుకు కుట్ర చేసిన వైరా. కార్తీక్ ఎంట్రీతో బెడిసికొట్టిన వైరా ప్లాన్. ముఖం వెలిగిపోతోంది నువ్వు ప్రెగ్నెంట్ వా దీప.. అని అడిగిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 Latest Episode:
కార్తీక దీపం 2 శుక్రవారం ఎపిసోడ్ లో సీఈఓగా నేనొక నిర్ణయం తీసుకున్నాను అని జ్యోత్న్స చెప్పబోతుంది. అంతలో బోర్డ్ మెంబర్స్ మేము ఈ కంపెనీ షేర్లను వేరే వాళ్లకు అమ్మాలి అనుకుంటున్నాము అంటారు. అది విన్న శివన్నారాయణ, దశరథలు షాక్ అవుతారు. ఎవ్వరికి అమ్మాలి అనుకుంటున్నారు అని అడుగుతారు. ఆ వ్యక్తిని ఇక్కడికి ఇన్వైట్ చేశామంటారు బోర్డ్ మెంబర్స్. ఇంతలో వైరా ఎంట్రీ ఇస్తాడు. వైరాను చూసిన కార్తీక్ కు కాస్త డౌట్ వస్తుంది. వైరా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే.. నువ్వు ఎందుకు వచ్చావని దశరథ ప్రశ్నిస్తాడు. మీ కంపెనీలో షేర్లు కొనేది నేనే అని చెబుతాడు వైరా.
నెలతప్పావా దీప?
మరోవైపు వంట చేయడానికి ప్రిపేర్ అవుతున్న దీప మామిడి కాయను కాస్త కట్ చేసి తింటుంది. చాలా పుల్లగా ఉందే అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పారు. ముఖం చూస్తే బాగా వెలిగిపోతోంది. నువ్వు నెల ఏమైనా తప్పావా దీప అంటుంది పారు. నేను నెలా తప్పలేదు. సంవత్సరం తప్పలేదు అంటుంది దీప. తప్పితే తప్పేం ఉందిలే అంటుంది పారు. అవతలి వాళ్ల పర్సనల్స్ గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది అంటుంది సుమిత్ర. ఇప్పుడు కోపాలు ఉన్నాయని కానీ.. భవిష్యత్తులో అందరూ కలిసిపోవచ్చు. దీప సీమంతం నీ చేతుల మీదుగా మన ఇంట్లోనే జరగవచ్చు ఎవ్వరికి తెలుసు సుమిత్ర అంటుంది పారు. అందుకు సుమిత్ర అవన్నీ జరగకూడదని అయితే నేను కోరుకోను అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
మీటింగ్ హాల్ లోకి కార్తీక్ ఎంట్రీ
శివన్నారాయణకు చెప్పి తనని మీటింగ్ రూమ్ లోకి పిలిపించుకునేలా చేస్తాడు కార్తీక్. లోపలికి వచ్చిన కార్తీక్ ను మీ డ్రైవర్ లోపలికి ఎందుకు వచ్చాడు అని వైరా అడగ్గా.. కార్తీక్ ఈ కంపెనీకి మాజీ సీఈఓ. నా కూతురి కొడుకు అని చెబుతాడు శివన్నారాయణ. సీఈఓకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చారా? డ్రైవర్ కి సీఈఓ పోస్ట్ ఇచ్చారా అని తక్కువచేసి మాట్లాడుతాడు వైరా.. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు వచ్చిన పని చూద్దాం అంటాడు కార్తీక్.
భయపెట్టిన కార్తీక్
బోర్డు మెంబర్స్ తో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు కార్తీక్. కొన్నేళ్ల క్రితం అమీర్ పేట్ లో ఓ చిన్న కాకా హోటల్ ఉండేది. అక్కడికి వచ్చిన ఓ పెద్ద మనిషి టిఫిన్ చేసి బాగుందని.. ఆ హోటల్ ఓనర్ ను పార్ట్ నర్ చేసుకున్నాడు అంటాడు. ఆ హోటల్ నాదే సార్ అని ఒక బోర్డ్ మెంబర్ అంటాడు. మీకు పార్ట్ నర్ షిప్ ఇచ్చి ఈ స్టేటస్ ఇచ్చింది శివన్నారాయణ అని కార్తీక్ అంటాడు. మీ తాత గారు ఛాన్స్ ఇచ్చారని మీ మరదలు కంపెనీని రోడ్డుకు ఈడుస్తున్నా మేము చూస్తు ఊరుకోవాలా అంటాడు ఇంకొక బోర్డు మెంబర్. కంపెనీ రూల్స్ ప్రకారం మీరు షేర్లు అమ్ముతున్నట్లు ఛైర్మన్ కు చెప్పారా? బోర్డు మెంబర్స్ లో ఎవరూ కొనమని అంటేనే కదా బయటివాళ్లకు అమ్మాలి? శివన్నారాయణ కొనను అన్నారా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. రూల్స్ పాటించకుండా ఇలా చేయడం క్రైమ్ అంటాడు. మీ మీద యాక్షన్ తీసుకోవచ్చని వారిని కాస్త బెదిరిస్తాడు.
వైరాకు ఎదురుదెబ్బ
మీరు సీఈఓగా ఉన్నప్పుడు లాభాలు వచ్చేవి కానీ ఇప్పుడు లేరు కదా అని బోర్డు మెంబర్ భరణి అంటాడు. లేడని ఎవరు చెప్పారు? వాడు ఎప్పుడూ మాతోనే ఉన్నాడు. ఇక మీదట కూడా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల కంపెనీకి దూరంగా ఉన్నాడు అంతే అంటాడు శివన్నారాయణ. కార్తీక్ సార్ ఉంటే మాకు ఇబ్బంది లేదు అంటాడు భరణి. దానికి వైరా గట్టిగా అరుస్తాడు. షేర్లు నాకు అమ్ముతామని మాట ఇచ్చారు అంటాడు. ముందు మీరు బయటకు వెళ్లండి అంటాడు కార్తీక్. నేను నీతో మాట్లాడాలి కార్తీక్ అంటాడు వైరా. ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్. బయట వెయిట్ చేస్తాను అని వెళ్లిపోతాడు వైరా.
కోపంతో ఊగిపోయిన జ్యో
ఇదంతా చూసి కోపంతో ఊగిపోతుంది జ్యోత్న్స. అందరి ముందు నన్ను డమ్మీని చేశారు. తిరిగి తల ఎత్తుకోకుండా చేశారని అక్కడినుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ కు థ్యాంక్స్ చెప్తాడు శివన్నారాయణ. వైరా షేర్స్ ఎందుకు కొనాలనున్నాడో? కొంటే వాడు ఏం చేస్తాడో నాకు బాగు తెలుసు అని అంటాడు దశరథ. లీగల్ గా మనం వారిపై చర్య తీసుకునే అవకాశం నిజంగానే ఉందా అని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. లేదు తాత వారిని కాస్త భయపెట్టాలని అలా చెప్పాను అంతే అంటాడు కార్తీక్.
వైరాతో కార్తీక్ వైరం
కార్తీక్ కోసం బయట వెయిట్ చేస్తున్న వైరాను చూసి వెళ్లిపోయారు అనుకున్నానే అంటాడు కార్తీక్. నా అవసరం కాబట్టి ఎంతసేపైనా వెయిట్ చేస్తాను అంటాడు వైరా. లైఫ్ గేమ్ లాంటిది. నేను దశరథతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. నువ్వు అడ్డుపడకపోవడమే మంచిది అని వైరా అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.