- Home
- Entertainment
- TV
- కాంతార చాప్టర్ 1 క్లోజింగ్ కలెక్షన్స్..? తెలుగు రాష్ట్రాల్లో నష్టాలను మిగిల్చిన రిషబ్ శెట్టి సినిమా?
కాంతార చాప్టర్ 1 క్లోజింగ్ కలెక్షన్స్..? తెలుగు రాష్ట్రాల్లో నష్టాలను మిగిల్చిన రిషబ్ శెట్టి సినిమా?
Kantara Chapter 1 Closing Collections : భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి.. సంచలనంగా మారింది కాంతార చాప్టర్ 1 సినిమా. 1000 కోట్లు కలెక్షన్స్ సాధించలేకపోయిన రిషబ్ శెట్టి సినిమా.. ఓవర్ ఆల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

భారీ అంచనాల నడుమ రిలీజ్
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కాంతారా 2: ది చాప్టర్ 1 (Kanthara: The Chapter 1) విడుదల రోజు నుంచే అద్బుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది మూవీ. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022లో సంచలన విజయాన్ని సాధించిన కాంతారాకు ప్రీక్వెల్‌గా రూపొందించబడింది. అందువల్ల ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచీ భారీ స్థాయిలో ఉన్నాయి.అయితే, ఆ అంచనాలకు తగినట్టుగా ప్రీమియర్ షోస్ నుంచే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చినా.. అనుకున్న టార్గెట్ ను మాత్రం చేరుకోలేకపోయింది సినమా.
కొన్ని ప్రాంతాల్లో నిరాశపరిచిన కాంతార 1
కాంతార 1 కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా ఈమూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాక్సాపీస్ వసూళ్లు నిరాశపరిచాయి. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నప్పటికీ, 90 శాతం సెంటర్లలో షేర్ వసూళ్లు ఆగిపోవడంతో బయ్యర్స్ క్లోజింగ్ కలెక్షన్లను లెక్కగట్టారు. ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..?
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల మొత్తం షేర్ వసూళ్లు 66.84 కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 91 కోట్ల వరకూ జరిగినందున, బయ్యర్స్‌కు దాదాపు 25 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు సమాచారం. ఏరియాల వారిగా కాంతార 1 కలెక్షన్లు ఎంత వచ్చాయంటే..
నైజాం: 31.65 కోట్లు
సీడెడ్: 9.78 కోట్లు
ఉత్తరాంధ్ర: 9.08 కోట్లు
తూర్పు గోదావరి: 3.90 కోట్లు
పశ్చిమ గోదావరి: 2.73 కోట్లు
గుంటూరు: 3.55 కోట్లు
కృష్ణా: 4.00 కోట్లు
నెల్లూరు: 2.15 కోట్లు
టాలీవుడ్‌లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ నష్టం ఎదుర్కొన్న అరుదైన సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా కాంతార 1 కలెక్షన్ల వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో నిరాశ కలిగించినా, ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా దూకుడు కొనసాగించింది. కర్ణాటకలో 245 కోట్ల గ్రాస్, తమిళనాడులో 71.75 కోట్ల గ్రాస్, కేరళలో 55.68 కోట్ల గ్రాస్, హిందీతో పాటు ఓవర్ ఆల్ ఇండియా నుంచి 251 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా దాదాపు 110 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 840 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. వసూళ్ల పరంగా గ్లోబల్ స్థాయిలో ‘కాంతారా 1’ విజయం సాధించినప్పటికీ, తెలుగు మార్కెట్‌లో మాత్రం బయ్యర్స్ ను గట్టి దెబ్బ కొట్టిందని సమాచారం.