- Home
- Entertainment
- TV
- Extra Jabardasth : వర్షను అంత మాట అన్నవేంటీ బ్రో? ఎక్ట్సా జబర్దస్త్ లో ‘నేను సరదా సరదాకే’ డైలాగ్!
Extra Jabardasth : వర్షను అంత మాట అన్నవేంటీ బ్రో? ఎక్ట్సా జబర్దస్త్ లో ‘నేను సరదా సరదాకే’ డైలాగ్!
జబర్దస్త్ బాబు, వర్ష (Varsha) మధ్య సాగిన సంభాషణలో బాబు డబల్ మీనింగ్ డైలాగ్ వదిలారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ‘సరదా సరదాకే’ డైలాగ్ ను వర్షపై ప్రయోగించడం ఆసక్తికరంగా మారింది.

దశాబ్ద కాలంగా ఎక్ట్సా జబర్దస్త్ Extra Jabardasth టీవీ ఆడియెన్స్ కు నవ్వులు పంచుతూనే వస్తోంది. Jabardasth తో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న తర్వాత వెంటనే ‘ఎక్ట్సా జబర్దస్త్’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. మల్లెమాల నిర్వహిస్తున్న ఈ కామెడీ షో ఈటీవీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా డిసెంబర్ 29కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో జబర్దస్త్ బాబు (Jabardasth Babu) సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ తో స్క్రిప్ట్ చేశారు. ఈ క్రమంలో వర్షపై డబుల్ మీనింగ్ డైలాగ్ ను ప్రయోగించారు.
స్కిట్ లో భాగంగా.. వర్ష బాబు దగ్గరకు వెళ్లి ‘ఏమండీ ఈరోజు మన శోభనం’ అంటుంది.... దాని బాబు ‘నేను సరద సరదాకే నడుము గిల్లేటోన్నీ, నువ్వేవో శోభనం అంటున్నావ్ చూసుకో మరీ’ అంటూ బదులిస్తాడు.
ఓ అబ్బాయి చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ డైలాగ్ ను ఎక్ట్సా జబర్దస్త్ వేదికపై పలికించడం, పైగా వర్షపై వాడటంతో మరింత ట్రెండింగ్ గా మారింది. నెక్ట్స్ ఎపిసోడ్ లో బాబు, వర్షల స్కిట్ ఆసక్తికరంగా మారనుంది.
మరోవైపు యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పైనా ఇమ్మాన్యుయేల్ ఫన్నీ కామెంట్ చేశారు. ఇతర ఆర్టిస్టులు నరేశ్ తన ప్రేమకథను చెప్పారు. బుల్లెట్ భాస్కర్, రామ్ ప్రసాద్, రోషిని తమదైన శైలిలో స్కిట్లను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. మరో ఐదు రోజుల్లో ఫుల్ ఎపిసోడ్ రానుంది.
ఎక్ట్సా జబర్దస్త్ షోకు సీనియర్ నటి ఖుష్భూ (Khushboo) మరియు కృష్ణ భగవాన్ (Krishna Bhagwan) జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. రోజా, నాగబాబు తర్వాత వీరు తమదైన శైలిలో షోను ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నారు.