MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • ప్రభాస్ మళ్లీ రిస్క్ చేయబోతున్నాడా? మంచి ఫామ్ లో ఉండగా అవసరమా బ్రో..?

ప్రభాస్ మళ్లీ రిస్క్ చేయబోతున్నాడా? మంచి ఫామ్ లో ఉండగా అవసరమా బ్రో..?

బాహుబలి తరువాతా కొంత కాలం ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేసిన ప్రభాస్.. ఇప్పుడిప్పుడే వరుస హిట్లతో..మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈటైమ్ లో మళ్లీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడట యంగ్ రెబల్ స్టార్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 16 2025, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాన్ ఇండియాలో దూసుకుపోతున్న ప్రభాస్..
Image Credit : X

పాన్ ఇండియాలో దూసుకుపోతున్న ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. దాదాపు అరడజన్ సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించబోతున్నాడు రెబల్ స్టార్. బాహుబలి తరువాత వరుసగా మూడు ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన ప్రభాస్.. ఆతరువాత సలార్, కల్కీ సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి పెద్ద ప్రాజెక్టులు ఉండగా, వీటితో పాటు కొత్త కథలు కూడా వింటూ ఉన్నాడని సమాచారం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రభాస్ రిస్క్ చేయబోతున్నాడా?
Image Credit : Film

ప్రభాస్ రిస్క్ చేయబోతున్నాడా?

ఈమధ్యనే మంచి ఫామ్ లోకి వచ్చాడు.. ఇక వరుసగా హిట్లు కొడతాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నటైమ్ లో.. షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అతను మరెవరో కాదు ప్రేమ్ రక్షిత్. RRR సినిమాలో ఆస్కార్ సాధించిన నాటునాటు పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. సీనియర్ డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న ప్రేమ్ రక్షిత్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడట.

Related Articles

Related image1
వారణాసి ఈవెంట్ అట్టర్ ప్లాప్, రాజమౌళి పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్, గ్లోబ్ ట్రాటర్ ఫెయిల్యూర్ కు కారణాలివే
Related image2
మూగమనసులు రివ్యూ.. సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని నాగేశ్వరరావు, కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడానికి కారణం ఏంటి?
34
ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
Image Credit : Asianet News

ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

నాటు నాటు పాటతో అంతర్జాతీయ గుర్తింపును అందుకున్న ప్రేమ్ రక్షిత్ ప్రస్తుతం దర్శకత్వ వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈక్రమంలో ప్రేమ్ రక్షిత్ ఇప్పటికే ప్రభాస్‌కు ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. కథపై ప్రభాస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఆయన స్పందన కోసం ప్రేమ్ రక్షిత్ ఎదురుచూస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఈ వార్తలు అధికారికంగా ఎక్కడా ధృవీకరించకపోయినా, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా ఇవి నిజమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రేమ్ రక్షిత్ కెరీర్ ప్రభాస్‌ సినిమాతోనే మొదలైంది. ఆయన కొరియోగ్రాఫర్‌గా మొదట పని చేసిన సినిమా ఛత్రపతి. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, బాహుబలి వంటి చిత్రాల్లో కూడా ప్రభాస్‌తో కలిసి పనిచేసి మంచి గుర్తింపును సంపాదించాడు ప్రేమ్.

44
డాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో ప్రభాస్ రెండు సినిమాలు
Image Credit : instagram

డాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో ప్రభాస్ రెండు సినిమాలు

టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్ల అవతారం ఎత్తడం కొత్తేమొ కాదు. గతంలో కూడా చాలామంది కొరియోగ్రఫర్స్ దర్శకులుగా మారారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే ప్రభాస్ కూడా ఇద్దరు కొరియోగ్రఫర్ల డైరెక్షన్ లో రెండు సినిమాలు చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి, లారెన్స్ మాస్టర్ దర్శకత్వంలో రెబెల్ చిత్రాల్లో నటించాడు. అయితే ఈసినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా.. యావరేజ్ గా నిలిచాయి. ఆడియన్స్ ను అలరించాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా ప్రభాస్ మరోసారి ఒక కొరియోగ్రాఫర్‌తో పని చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభాస్ ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Related Stories
Recommended image1
వారణాసి ఈవెంట్ అట్టర్ ప్లాప్, రాజమౌళి పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్, గ్లోబ్ ట్రాటర్ ఫెయిల్యూర్ కు కారణాలివే
Recommended image2
మూగమనసులు రివ్యూ.. సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని నాగేశ్వరరావు, కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved