- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu Today నవంబర్ 8 ఎపిసోడ్: అత్త అంటే ఇలా ఉండాలి.. నర్మదకు అండగా వేదవతి, పుట్టింటికి పరుగులు తీసిన ప్రేమ..!
Illu Illalu Pillalu Today నవంబర్ 8 ఎపిసోడ్: అత్త అంటే ఇలా ఉండాలి.. నర్మదకు అండగా వేదవతి, పుట్టింటికి పరుగులు తీసిన ప్రేమ..!
Illu Illalu Pillalu Today: భద్రావతి చేసిన కుట్రలో నర్మద బలి అవుతుంది. లంచం తీసుకుందనే నేరం కింద నర్మదను సస్పెండ్ చేస్తారు. బాధతో ఇంటకి తిరిగి వచ్చిన నర్మదను శ్రీవల్లి, ఆమె తల్లి భాగ్యం మాటలతో చిత్ర హింసలు చేయగా, అత్త భద్రావతి అండగా నిలుస్తుంది.

ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్..
ఉద్యోగం పోయిందనే బాధలో నర్మద నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. నర్మద రావడం చూసి భద్రావతి, సేనాపతి మాటలతో హేళన చేయడం మొదలుపెడతారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి అధికారికి స్వాగతం సుస్వాగతం. నిన్న మన ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు తల ఎగరేసింది కదా. ఇప్పుడేంట్రా తల దించుకొని వెళ్తోంది అని భద్రావతి అంటే.... అందరూ ఆమెను లేడి సింగం అనుకున్నారు.. కానీ అవినీతి తిమింగలం అని ఇప్పుడే కదా తెలిసింది అని సేనాపతి వత్తాసు పాడతాడు. ఇలా పక్కవారి డబ్బు కోసం ఆశ పడటం రామరాజుకు అలవాటే అని... ఇలా లంచం తీసుకోమని కూడా వాళ్ల మామయ్య చెప్పి ఉంటాడు అంటూ.. పనిలో పనిగా రామరాజు ని కూడా తిట్టేస్తారు.
‘నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు.. ఎవరికీ ముఖం చూపించలేక ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ.. ఇంటికి కూడా తిరిగి వచ్చింది అంటే గట్టి పిండమే’ అని సేనాపతి అంటాడు. వాళ్లు ఎన్ని మాటలు అంటున్నా... నర్మద మారు మాట్లాడకుండా.. అక్కడే నిలపడి ఉంటుంది. మరోవైపు నర్మద ఇంకా ఇంటికి రాలేదని.... ఇంట్లో వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా ఇంట్లోకి వచ్చేస్తుంది.
నోరు విప్పని నర్మద..
నర్మద రావడమే.. సాగర్ ఎదురెళ్లి... ‘ ఏమైంది నర్మద, నువ్వు లంచం తీసుకోవడం ఏంటి? ఈ వార్త టీవీలో వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందా అని మేమంతా కంగారు పడుతున్నాం, అసలు ఏం జరిగింది?’ అని సాగర్ అడుగుతాడు. నర్మద మాత్రం నోరు విప్పి ఏమీ మాట్లాడకుండా... మంచి నీళ్లు తాగుతుంది. వెనకే ప్రేమ, ధీరజ్ లు వెళ్లి... ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, వాళ్ల ప్రశ్నలకు కూడా నర్మద నోరు విప్పదు.
నర్మదను తిట్టిపోసిన శ్రీవల్లి..
నర్మద ఉద్యోగం ఎప్పుడు పోతుందా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శ్రీ వల్లికి... మంచి ఛాన్స్ దొరుకుతుంది. వెంటనే... నర్మద పై ఉన్న అక్కసు మొత్తం వెల్లగక్కడం మొదలుపెడుతుంది. ‘ నర్మద మౌనంగా ఉందంటే... నిజంగానే లంచం తీసుకున్నాను అనే కదా అర్థం. అదే తప్పు చేయకపోతే.. ఇలా మౌనంగా ఉంటుందా? నోరేసుకొని పడిపోతుంది కదా ’ అని అంటుంది. ఆ మాటకు ఇంట్లో వాళ్లందరికీ కోపం ముంచుకొస్తుంది. శ్రీవల్లిపై ప్రేమ కోప్పడుతుంది. కానీ.... శ్రీ వల్లి మాత్రం ఆగదు.
‘ చూడు నర్మద... పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, అత్త, మామలకు సేవలు చేసుకోవాలి కానీ.. ఈ ఉద్యోగాలు ఎందుకు..? ఒకవేళ ఉద్యోగం చేసినా నిజాయితీగా చేయాలి కానీ.... ఇలా లంచం తీసుకోవడం తప్పు కదా’ అని అంటుంది. ఆ వెంటనే... శ్రీవల్లి తల్లి భాగ్యం అందుకుంటుంది. ‘ చూడు అమ్మాయి... డబ్బు ఈ రోజు ఉంటుంది.. రేపు పోతుంది.. కానీ, నిజాయితీ ముఖ్యం. మేం చూడు.. మా ఆస్తి మొత్తం పోయినా..ఎంత నిజాయితీగా ఉన్నామో’ అని వాళ్ల గొప్పలు మొదలుపెడుతుంది. భాగ్యం మాటలకు ఆమె భర్త కూడా వత్తాసు పలుకుతాడు. అయితే... వీళ్ల మాటలు విని చిరాకు పుట్టిన ప్రేమ.... మీ నిజాయితీ గురించి నేను బయట పెట్టనా అని అడుగుతుంది. దీంతో... వద్దులేమ్మా అని నోరుమూసుకుంటారు.
కానీ, శ్రీ వల్లి మాత్రం వదిలిపెట్టదు. ‘అది కాదు నర్మద.. నువ్వు లంచం తీసుకొని బానే ఉన్నావు. కానీ మామయ్య గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. మామయ్య గారు అసలే పరువుకు ప్రాణం ఇచ్చే మనిషి. ఏమండీ రామరాజు గారు మీ రెండో కోడలు లంచం తీసుకొని దొరికిపోయింది కదా అని ఎవరైనా అడిగితే ఆయనకు ఎంత పరువు తక్కువ. ఆ బాధలో మామయ్య గారు తల ఎత్తుకొని తిరగగలరా, ఆ రోజు... దసరా పండగ రోజు కలెక్టర్ గారు తెగ పొగిడేశారు. నీ లాంటి కోడలు దొరకడం మామయ్యగారి అదృష్టం అని అన్నారు కదా, ఇదేనా మామయ్య గారి పరువు పెంచడం అంటే..? ఇదేనా నీవల్ల మామయ్య గారికి దొరికిన అదృష్టం అంటే..?’ అని ప్రశ్నిస్తుంది.
ఇంట్లో అందరికీ షాకిచ్చిన నర్మద..
‘ మా ఇంటి దీపం అని ముద్దెట్టుకుంటే... ముఖమంతా కాల్చేసినట్లు.. నువ్వు కూడా మంచి కోడలు, మంచి కోడలు అంటే.. పరువు పోగొడతావా? నువ్వు కూడా నాలాగా ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఇదంతా జరిగేదా? ఉద్యోగం చేస్తా.. ఊళ్లు ఎగరేస్తా అంటూ ఇంటి గౌరవాన్ని గోదాట్లో కలిపేశావు’అని ఆయాసం వచ్చేలా అరుస్తుంది.
ఆ మాటలకు వెంటనే నర్మద కూల్ గా హ్యాపీనా అని అడుగుతుంది. తర్వాత నాకు నిద్ర వస్తోంది.. నేను పడుకుంటాను అని నర్మద చెబుతుంది. ఆ మాటకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ మాటకు శ్రీవల్లి మరింత రగిలిపోతుంది. ‘ ఉద్యోగం పోయిందన్న బాధలో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది.. తిండి తిప్పలు లేకుండా ఓ మూల ఏడ్చుకుంటూ కూర్చుంటి అనుకున్నాం. కానీ, కళ్లలో కన్నీటి చుక్క లేదు.. అదే పొగరు, అదే బలుపు, అదే గర్వం’ అని శ్రీవల్లి వాళ్ల అమ్మతో చెబుతుంది. అసలే వీళ్లు కోపంతో ఊగిపోతుంటే... నర్మదను శ్రీవల్లి తండ్రి పొగుడుతాడు. దీంతో అతన్ని చితకబాదతారు.
నా కోడలు బంగారం...
మరోవైపు, నర్మద ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. భద్రావతి , శ్రీవల్లి అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. బాధగా కూర్చున్న నర్మద దగ్గరకు అత్త వేదవతి వచ్చి కూర్చుంటుంది. ‘ ఎందుకు ఇలా చేశావ్?’ అని అడుగుతుంది. ‘అంటే నేను లంచం తీసుకున్నాను అని అత్తయ్య నమ్ముతుందా?’ అని మనసులోనే నర్మద బాధపడుతుంది. వేద వతి మాత్రం ఎందుకు ఇలా చేశావ్ అని అడుగుతూనే ఉంటుంది. నర్మద సమాధానం చెప్పకపోవడంతో.. వెంటనే వేదవతి మాట్లాడుతూ ఉంటుంది.
‘ నా కోడలు ఏంటో నాకు తెలుసు, తన నిజాయితీ ఏంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా తప్పు చేయదని తెలుసు. పరాయి వాళ్ల సొమ్ముకి ఆశపడదని కూడా తెలుసు. అలాగే నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా, నీ తప్పు లేకుండా నీ మీద ఎవరైనా నింద వేసినా ఊరుకోవు అని కూడా తెలుసు. మరి నువ్వు లంచం తీసుకున్నావ్ అని నీ మీద నింద పడితే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావ్? మా కోసమే కదా? మా కోసం ఆలోచించి నువ్వు మౌనంగా ఉన్నావ్ కదా? నిన్ను లంచం కేసులో ఇరికించింది మా పుట్టింటి వాళ్లే కదా? మా వాళ్లకు నువ్వు ఎదురు తిరిగితే వాళ్ల పరువుపోతుందని, వాళ్లు బాధపడితే.. నేను, ప్రేమ బాధ పడతామని నువ్వు ఆలోచించావ్ అందుకే... మా కోసం నువ్వు వెనక్కి తగ్గావ్. నువ్వు చేయని తప్పుకు నిందను మోసావ్ అవునా?’ అని వేధ వతి అడుగుతుంది.
సమాధానం చెప్పకుండా వెళ్తున్న నర్మదను ఆపి.. వేదవతి హగ్ చేసుకుంటుంది. ఇదంతా దూరంగా ప్రేమ చూస్తూనే ఉంటుంది. ‘ నువ్వు ఎంత గొప్ప కోడలివి. మా కోసం నువ్వు బాధను మోస్తున్నావ్ , అవమానాలు మోస్తున్నావ్. ఎంత ఉన్నతమైన మనసే నీది. ఏ విషయంలో తగ్గని నువ్వు.. మా కోసం చేయని తప్పుకు దోషిలా నిలపడ్డావా’ అని అడుగుతుంది.
‘ అత్తయ్య.. ఏరోజు నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలేదు. అలాగే, నా నిజాయితీ మీద నింద వేస్తే ఊరుకోలేను. ఈ విషయంలో కూడా అలానే ఉండేదాన్ని అత్తయ్య. కానీ, ఆ క్షణం నా కళ్ల ముందు మీరు, ప్రేమ కనిపించారు. మీరు నాతో మాట్లాడకపోయినా,ప్రేమ నా పక్కన లేకపోయినా అది నాకు భరించలేని బాధ. మీరిద్దరూ నన్ను దూరం పెట్టేస్తే... ఈ ఇంట్లో నేను అనాథ అయిపోయినట్లే. అందుకే, మౌనంగా నిందలు మోసాను’ అని చెబుతుంది. అయితే... ఇలా ఉండొద్దని.. చేయని తప్పుకు నిందలు మోయాల్సిన అవసరం లేదని భద్రావతి చెబుతుంది. ‘ నిన్ను లంచం కేసులో ఎవరు ఇరికించారో నాకు అనవసరం. నేను జోక్యం చేసుకొను. కానీ నా కోడలి పై కుట్ర జరిగిందని ఈ లోకానికి తెలీదు. అందుకే.. ఈ షమస్యను నర్మద ఎలా ఎదుర్కొంటుందో అలానే చెయ్యి. నా కోడలు అంటే ఏంటో అందరికీ తెలియాలి. నువ్వు వెనక్కి తగ్గొద్దు. నీ నిజాయితీ నిరూపించుకో’ అని చెప్పి వెళ్తుంది.
తోటికోడలు అంటే ఇలానే ఉండాలి...
వెంటనే ప్రేమ వచ్చి..‘ అక్క.. ఈ చెల్లి నీతో మాట్లాడకపోతే.. నీకు దూరంగా ఉంటేనే భరించలేను అన్నావ్.. మరి, మా అక్క చేయని తప్పుకి నిందను మోస్తే మాకు బాధ కాదా’ అని ప్రేమ అడుగుతుంది. ఆ మాటకు ఆనందంతో నర్మద ప్రేమను హత్తుకుంటుంది. సీన్ చూడటానికి చాలా బాగుంటుంది. ‘ అక్కడ ఉండే మా వాళ్ల గురించి ఆలోచించకు. నీ నిజాయితీకి మచ్చ రాకూడదని మాత్రమే ఆలోచించు’ అని చెబుతుంది. నర్మద సరే అంటుంది.
పుట్టింటికి ప్రేమ...
మరోవైపు ఈ విషయం గురించి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ పుట్టింటి వాళ్లే ఈ పని చేశారని ధీరజ్ కి అర్థమౌతుంది. కోపంతో రగిలిపోతుంటే... ప్రేమ వచ్చి కదిలిస్తుంది. చాలా వరకు ధీరజ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ.. ప్రేమ వచ్చి ఏదో ఒకటి మాట్లాడి విసిగిస్తూనే ఉంటుంది. దీంతో... కోపంతో ధీరజ్ ఊగిపోతాడు. పుట్టింటి వాళ్లను తిడతాడు. వీరి గొడవను శ్రీవల్లి తల్లిదండ్రులు దూరం నుంచి చూస్తూ ఉంటారు. ధీరజ్ మీద కోపంతో ప్రేమ ఆవేశంగా పుట్టింటి వెళ్తుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి... ఈ సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది.