GuppedanthaManasu 31st January Episode:వసుధారను వేసేయడానికి భద్ర రెడీ, వసు ని ఏకిపారేసిన మినిస్టర్..!
మరి మన ఇంట్లోకి వచ్చి మరీ.. ఫోన్ లో వీడియో ఎవరు డిలీట్ చేస్తారు అని వీరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి మాటలను దూరం నుంచి భద్ర వింటూ ఉంటాడు.
Guppedantha Manasu
GuppedanthaManasu 31st January Episode: రిషి మరోసారి కిడ్నాప్ అవ్వడం, శైలేంద్రను ఆధారాలతో సహా నిరూపించకలేకపోవడంతో వసుధార చాలా ఫ్ఱస్టేట్ అవుతుంది. అన్నీ ఇంట్లో కిందపడేస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ కి మహేంద్ర, అనుపమ వస్తారు. వాళ్లు రాగానే..,వసుధార మహేంద్ర దగ్గరకు వెళ్లి.. నాకు రిషి సర్ కావాలి మామయ్య అని ఏడుస్తుంది. సర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనకు తెలుసు కదా.. కనీసం పది నిమిషాలు కూడా నిలపడలేకపోతున్నారు.. ఆయనకు ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ అందుతుందో లేదో.. సరైన ఆహారం పెడుతున్నారో లేదో. నేనే అనవసరంగా సర్ ని కాలేజీకి తీసుకురావాలని అనుకున్నాను. అలా అనుకొని ఉండకపోయినా బాగుండేది... ఆ పెద్దాయన దగ్గరే రిషి సర్ కి కనీసం ట్రీట్మెంట్ అయినా జరిగేది అని వసుధరా బాధపడుతుంది.
Guppedantha Manasu
నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా.. రిషి కొంచెం నడవగలుగుతున్నాడని.. కాలేజీకి తీసకువస్తే అందరూ సంతోషిస్తారు అని అనుకున్నావ్ అంతే కదా అని మహేంద్ర అంటాడు. వెంటనే అనుపమ... మనమేమో ఆ శైలేంద్రను అనుమానిస్తుంటే.. ముకుల్ మాత్రం మరో వ్యక్తి ప్రమేయం ఉందని అంటున్నాడు.. నాకుు కూడా అదే నిజం అనిపిస్తోంది... ఎందుకంటే శైలేంద్ర మన కళ్లముందే ఉన్నాడు.. ఆ సమయంలోనే రిషి కిడ్నాప్ అయ్యాడు కదా అని అనుపమ అంటుంది.
ఆ మూడో వ్యక్తి ఎవరు.. ఫోన్ లో వీడియో ఎలా మిస్ అయ్యింది అని వీరు ఆలోచిస్తూ ఉంటారు.. దేవయాణి వదిన అయ్యే ఛాన్స్ లేదని... నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నారని మహేంద్ర అంటాడు. మరి మన ఇంట్లోకి వచ్చి మరీ.. ఫోన్ లో వీడియో ఎవరు డిలీట్ చేస్తారు అని వీరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి మాటలను దూరం నుంచి భద్ర వింటూ ఉంటాడు.
Guppedantha Manasu
వీడియో ఎలా మిస్ అయ్యింది అని మహేంద్ర మరోసారి అడిగితే... భద్ర అని వసుధార అంటుంది. తన అనుమానం మొత్తం భద్ర మీదే ఉందని, తాను వాళ్ల నాన్న గారి ఇంటికి వెళ్లినప్పుడు మీరు చెప్పకుండానే అక్కడికి వచ్చాడని గుర్తు చేసుకుంటుంది. తనతో రిషి సర్ ఉన్నారో లేదో తెలుసుకోవడానికే వచ్చినట్లు అనిపించిందని చెబుతుంది. తనకు ఎవరూ లేరు అంటూనే ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడని.. అతను శైలేంద్ర మనిషి అని నాకు మొదటి నుంచి అనుమానం ఉందని వసు అంటుంది. ఆ మాటలు విన్న భద్ర.. వసుధారకు నామీద అనుమానం బలపడిందని.. ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదని.,. ఎలాగైనా పని ముగించుకొని వెళ్లాలి అని అనుకుంటాడు.
Guppedantha Manasu
వెంటనే.. శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. అక్కడ ఏం జరుగుతోంది అని శైలేంద్ర అంటే...చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెబుతాడు. మరి.. ఓ చెవి అటు పడేయకపోయావా వాళ్లు మాట్లాడుకునే విషయాలు తెలిసేవి అని శైలేంద్ర అంటే.. వాళ్లకు నా మీద అనుమానం వచ్చిందని భద్ర చెబుతాడు. సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్స్ ఎలాంటి అనుమానం రాకుండా పని పూర్తి చేస్తారు కదా.. నువ్వు అలా ఎందుకు చెయ్యలేకపోయావ్ అని శైలేంద్ర కోపంగా అడుగుతాడు.
Guppedantha Manasu
అయితే... ఇది సినిమా కాదని.. తాను పని చేసే విధానం వేరని భద్ర అంటాడు. ఇప్పుడు అదంతా కాదని.. ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. ఈ రోజే వసుధారను వేసేయ్ అని శైలేంద్ర చెప్పగా... మిస్ అయితే ఇద్దరం ప్రమాదంలో పడతామని.. కాస్త ఆలోచించమని భద్ర అంటాడు. శైలేంద్ర మాత్రం.. లేదని.. కచ్చితంగా ఈ రోజు పని పూర్తవ్వాల్సిందే అని అంటాడు. చేసేదేం లేక భద్ర సరే అంటాడు.
Guppedantha Manasu
ఇదిలా ఉంటే.. తాము మాట్లాడుకుంటూ ఉండగా..భద్ర అంతా వినడం.. వసుధార చూస్తుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోగా.. కాలేజీలో స్టూడెంట్స్ రిషి సర్ కావాలి అంటూ గొడవ చేస్తూ ఉంటారు. లెక్చరర్స్ ఆపడానికి ఎంత ప్రయత్నించినా వారు వినిపించుకోరు. శైలేంద్ర అక్కడే ఉండి కూడా ఏమీ పట్టనట్లు చూస్తూ ఉంటాడు. దీంతో.. ఒక మేడమ్.. స్టూడెంట్స్ గొడవ చేస్తుంటే ఆపరేంటి సర్ అని అడుగుతుంది. దానికి శైలేంద్ర.. తాను చేయాల్సిన ప్రయత్నాలు తాను చేశానని.. యూత్ ని ఎవరూ ఆపలేరు అని డైలాగులు కొడతాడు. ఇక, స్టూడెంట్స్ క్లాసులకు వెళ్లకుండా.. గొడవ చేస్తుండటంతో.. ఆమె మహేంద్రకు ఫోన్ చేసి విషయం చెబుతుంది.
Guppedantha Manasu
దీంతో.. మహేంద్ర, వసుధార, అనుపమ కాలేజీకి చేరుకుంటారు. స్టూడెంట్స్ ని కామ్ చేయడానికి వసుధార, మహేంద్ర ప్రయత్నిస్తారు. కానీ.. వాళ్లు ఆగరు. పక్కనుండి శైలేంద్ర వాళ్లను మరింత రెచ్చగొడుతూ ఉంటాడు. వాళ్లు కూడా మరింత ఎక్కువగా అరుస్తూ ఉంటారు. ఈ లోగా.. అక్కడికి మినిస్టర్ గారు వస్తారు. వాళ్లని చూసి.. మరింత ఎక్కువగా అరవమని శైలేంద్ర చెబుతాడు. వాళ్లు అంతే అరుస్తారు.
అయితే.. స్టూడెంట్స్ ని ఆగమని మినిస్టర్ గారు సైగ చేస్తారు. ఆ తర్వాత.. వసుధారకు క్లాస్ పీకుతాడు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంది.. రిషి కి ఫోన్ చెయ్యమని అంటాడు. అయితే.. సర్ తనకు టచ్ లో లేరు అని వసుధార చెబుతుంది. అంతే.. ఆయన సీరియస్ అవుతాడు. ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజీ ఎంత మంచి మంచి పనులతో, టాప్ ర్యాంకులతో పేపర్ లోకి వచ్చేది.. కానీ.. ఇప్పుడు అన్నీ గొడవలతోనే పేపర్ లోకి వస్తోందంటాడు. కాలేజీ ఫెస్ట్ కి రిషి వస్తున్నాడని, బ్యానర్లు కూడా కట్టారు కదా.. కానీ.. చివరకు రిషి రాలేదు.. ఇప్పటి వరకు ఏ కాలేజీ ఫెస్ట్ ప్లాప్ కాలేదు.. ఈ సారి అయ్యింది.. అది కూడా నువ్వు ఎండీగా ఉన్నప్పుడే అయ్యింది.. అని వసుధారకు మినిస్టర్ వాయిస్తాడు. సమాధనం చెప్పడానికి ఏమీలేక.. వసుధార మౌనంగా ఉండిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.