GuppedanthaManasu 30th January Episode:ఫణీంద్ర ముందు పరువు పోగొట్టుకున్న వసు, కొత్త కిడ్నాపర్ ఎవరు..?
ఆ రోజు ముకుల్ వినిపించిన వాయిస్ అబద్ధం కాదు.. అదే నిజం సర్. ఆ తర్వాత రిషి సర్ ని వీడే కిడ్నాప్ చేయించాడు అని చెబుతుంది.
Guppedantha Manasu
GuppedanthaManasu 30th January Episode: కాలేజీకి రిషి వచ్చేస్తున్నాడు అని అందరూ సంతోషించేలోగా.. మరోసారి కిడ్నాప్ కి గురయ్యాడు. అయితే.. ఈ సారి కూడా కిడ్నాప్ శైలేంద్ర చేయించాడని వసుధార ఫిక్స్ అవుతుంది. ఎవరు వద్దు అని చెప్పినా వినకుండా.. అక్కడి నుంచి శైలేంద్ర ఇంటికి వెళ్తుంది. రిషి సర్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ చెంపలు వాయిస్తుంది. అప్పుడే ఫణీంద్ర వస్తాడు.. వసుధార ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. నా భర్త కోసం సర్.. రిషి సర్ కోసం అని సమాధానం ఇస్తుంది. శైలేంద్రను నిలదీస్తే.. రిషి వచ్చేస్తాడా అని ఫణీంద్ర అంటాడు. దానికి వసుధార.. వీడే సర్.. అంతా చేసింది వీడే అని చెబుతుంది.
Guppedantha Manasu
మీ కొడుకు అని అతని గురించి నిజాలు తెలిస్తే.. మీరు భరించలేరు అని ఇంత కాలం మీకు నిజాలు చెప్పలేదు. మహేంద్ర సర్ కూడా అందుకే మీ దగ్గర ఈ నిజాలు దాచిపెడుతూ వచ్చారు అని వసుధార చెబుతుంది. దానికి ఫణీంద్ర.. పర్వాలేదు నిజం ఏంటో నాకు తెలియాలి చెప్పండి అంటాడు. అప్పుడు వసుధార ఒక్కొక్కటిగా నిజం చెప్పడం మొదలుపెడుతుంది. జగతి మేడమ్ ని బెదిరించింది వీడే సర్... రిషి సర్ ని చంపేస్తానని బెదిరించి.. సర్ పై నిందపడేలా చేసి..కాలేజీ నుంచి బయటకు వెళ్లేలా చేశాడు.. ఆ తర్వాత ఎండీ సీటు కోసం దేవతలాంటి జగతి మేడమ్ ని పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎండీ సీటు తనకే దక్కుతుందని ఆశపడ్డాడు. కానీ... ఆ సీటులోకి నేను రావడంతో... నాపై, రిషి సర్ చాలా కక్ష పెంచుకున్నాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశాడు. అని చెబుతుంది.
Guppedantha Manasu
అంతేకాదు.. ఆ రోజు ముకుల్ వినిపించిన వాయిస్ అబద్ధం కాదు.. అదే నిజం సర్. ఆ తర్వాత రిషి సర్ ని వీడే కిడ్నాప్ చేయించాడు అని చెబుతుంది. అప్పుడు హాస్పిటల్ లో ఉన్నాడు కదమ్మా అని ఫణీంద్ర అంటే... హాస్పిటల్ లో ఉంటే ఏంటి సర్... వీడికి ఎంత మంది రౌడీలతో పరిచయం ఉందో తెలుసా? వాళ్లకు డబ్బులు ఇస్తుంటే చాలా సార్లు ధరణి మేడమ్ కూడా చూశారు అని చెబుతుంది.
వెంటనే ఫణీంద్ర.. ధరణి నిజమేనా చూశావా అని అడుగుతాడు. శైలేంద్ర.. చెప్పొద్దు అని సైగలు చేస్తాడు. కానీ.. ధరణి నిజం చెప్పేస్తుంది. డబ్బులు ఇవ్వడం చూశాను అని చెబుతుంది. అది వినగానే శైలేంద్ర... నువ్వు చూశావా,.? నేను ఎవరికి ఇచ్చాను..? డెలివరీ బాయ్ కి ఇచ్చి ఉండొచ్చు కదా..? ప్లంబర్ కి ఇవ్వచ్చు కదా అని మాట మార్చే ప్రయత్నం చేస్తాడు. వెంటనే.. వసుధార.. నువ్వు మాటలతో అందరినీ మోసం చేద్దాం అని చూస్తున్నావ్ శైలేంద్ర అని అంటుంది
Guppedantha Manasu
నేనే నిజంగా రిషి ని దాచి పెట్టాను అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉంటే... చూపించు అని శైలేంద్ర అంటాడు. వెంటనే దేవయాణి కూడా నా కొడుకు తప్పు చేశాడని సాక్ష్యం చూపిస్తే.. ఇఫ్పుడే ఉరి వేసుకుంటాను అని అంటుంది. దానికి వసుధార తన దగ్గర సాక్ష్యం ఉందని.. తన ఫోన్ తీసుకొని వీడియో కోసం వెతుకుతుంది. కానీ.. ఆ వీడియోని శైలేంద్ర ఎప్పుడో డిలీట్ చేసేస్తాడు. దీంతో.. వసుధార నిరూపించలేకపోతుంది. తన ఫోన్ లోది కూడా డిలీట్ చేసేశాను అని అనుపమ మనసులో అనుకుంటుంది.
Guppedantha Manasu
ఇక.. సాక్ష్యం చూపించలేకపోవడంతో.. వసుధార డౌన్ అయిపోతుంది. అంతలో ముకుల్ ఎంట్రీ ఇస్తాడు. ముకుల్ ని చెప్పమని..వసుధార అడుగుతుంది. అయితే.. ఈసారి కిడ్నాప్ చేసింది మాత్రం శైలేంద్ర కాదు అని చెబుతుంది. దీంతో.. శైలేంద్ర రెచ్చిపోతాడు. ఫణీంద్ర ముందు... వసుధార దోషిలా నిలపడుతుంది. వసుధార మాటలను సాక్ష్యాలు లేకుండా నమ్మలేకపోతున్నాను అని ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.అయితే.. వసుధార వెళుతూ వెళుతూ... ఆధారాలు లేవు కాబట్టి తలదించుకుబోతున్నాను అని వార్నింగ్ ఇస్తుంది.
Guppedantha Manasu
ఇక.. వసుధార, మహేంద్ర, అనుపమ, ముకుల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రిషిని కచ్చితంగా శైలేంద్రే కిడ్నాప్ చేయించి ఉంటాడు అని మహేంద్ర అంటాడు. కానీ.. కాదు అని ముకుల్ అంటాడు. మరో వ్యక్తి ఉన్నాడని అతనే.. మీ ఫోన్ లో నుంచి వీడియో కూడా డిలీట్ చేశాడు అని ముకుల్ అంటాడు. శైలేంద్ర మీ ఇంటికి వచ్చి మరీ.. మీ ఫోన్ లో వీడియో డిలీట్ చేసే అవకాశం లేదు కదా.. ఇంకెవరో ఉన్నారు.. అతను ఎవరో మనం కనిపెట్టాలి అని ముకుల్ అంటాడు.
ఆ వ్యక్తి భద్ర అని మనకు నెక్ట్స్ సీన్ లోనే తెలిసిపోతుంది. ఆ వీడియో డిలీట్ చేసినందుకు భద్రకు శైలేంద్ర థ్యాంక్స్ చెబుతాడు. నిన్ను పనిలో పెట్టుకున్నందుకు.. ఈ ఒక్క పని చేశావ్ అని శైలేంద్ర అంటే.. నేను కాబట్టే ఆ పని చేయగలిగాను అని.. ఇంకెవరూ చేయలేకపోయేవారు అని భద్ర అంటాడు. తర్వాత.. రిషిని నువ్వు కాకుండా ఎవరు కిడ్నాప్ చేశారు..? అని అడుగుతాడు. తెలీదని.. తాను కాపు కాశాను కానీ వారు రాలేదు అని చెబుతాడు. అయితే.. .. రాజీవ్ చేసి ఉంటాడా అని శైలేంద్ర మనసులో అనుకొని.. నువ్వు వెళ్లు.. ఎక్కువ సేపు బయట ఉంటే అనుమానం వస్తుంది అని చెబుతాడు. భద్ర వెళ్లగానే... ఇప్పుడు గేమ్ రసవత్తరంగా ఉందని.. ఇఫ్పుడు అసలు గేమ్ ఆడిస్తాను అని శైలేంద్ర అంటాడు.