MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • GuppedanthaManasu 2nd February Episode: వసుధార ట్రాప్ లో పడిన భద్ర.. శైలేంద్రకు దిమ్మతిరిగే షాక్..!

GuppedanthaManasu 2nd February Episode: వసుధార ట్రాప్ లో పడిన భద్ర.. శైలేంద్రకు దిమ్మతిరిగే షాక్..!

దానికి మహేంద్ర మీరు ఏమీ చేయలేదని.. రిషిని చాలా రోజులు కంటికి రెప్పలా కాపాడారని మహేంద్ర అంటాడు.

4 Min read
ramya Sridhar
Published : Feb 02 2024, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Guppedantha Manasu

Guppedantha Manasu

GuppedanthaManasu 2nd February Episode: ఇంట్లో కూర్చొని మహేంద్ర, వసుధార, అనుపమలు కాలేజీలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు కాలేజీ బోర్డ్ మెంబర్స్.. ఒక్కోసారి నువ్వే ఆ ఎండీ పదవికి బెస్ట్ అంటారు.. మరోసారి అసలు పనికిరావు అని అంటారు.. అలా ఎందుకు అంటారో నాకు అర్థం కావడం లేదు అని మహేంద్ర అంటాడు. అయితే.. అదంతా శైలేంద్ర కుట్ర మామయ్య , వాళ్ల మనసుల్లో విషం నింపుతున్నాడు అని వసుధార అంటుంది. వాడు ఎంత చెప్పినా.. నీ గురించి తెలిసి కూడా వీళ్లు ఎలా నమ్ముతున్నారు అని మహేంద్ర ఆశ్చర్యపోతాడు. నా గురించి తెలిసి కూడా.. వాళ్లు అలా మాట్లాడుతున్నారు అంటే.. శైలేంద్ర వాళ్లను ఎంతగా మార్చి ఉంటాడో అర్థం చేసుకోండి మామయ్య అని వసుధార అంటుంది. ఆ శైలేంద్రకు ఎండీ పదవి కావాలి.. దాని కోసం ఏదైనా చేస్తాడు.. అయినా.. ఇప్పుడు ఆలోచించాల్సింది.. కాలేజీ గురించి కాదని.. రిషి సర్ ఏమయ్యారో అది ఆలోచించాలి అని అంటుంది.

28
Guppedantha Manasu

Guppedantha Manasu

అంతే.. వెంటనే మహేంద్ర ఎమోషనల్ అయిపోతాడు. ‘శైలేంద్ర కు ఎండీ పదవి ఆశ పుట్టినప్పటి నుంచి చాలా దారుణాలు చేశాడు. ముందు రిషిపై ఎటాక్ ఛేయించాడు. తర్వాత తనపై నిందపడేలా చేసి..కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేశాడు. దాని వల్ల దాదాపు మూడు సంవత్సరాలు నేను నా కొడుక్కి దూరమైపోయాను. అప్పుడు నరకం అనుభవించాను. తర్వాత మూడేళ్లకు వాడిని చూసిన తర్వాత నా ప్రాణం నాకు తిరిగి వచ్చినట్లు అయ్యింది. అప్పుడు వాడికి శైలేంద్ర చేసిన దారుణాల గురించి చెప్పాలని అనుకున్నాను. కానీ.. ఈలోగా జగతిని ఆ దుర్మార్గుడు దూరం చేశాడు. ఆ తర్వాత అయినా.. శైలేంద్ర కుట్రలు రిషి తెలిస్తాయి అనుకునేలోపు రిషిని కిడ్నాప్ చేశాడు. నిస్సహాయ స్థితిలో.. మళ్లీ నా కొడుకును చూడగలిగాను. అంతా బాగుంది అనుకునేలోపు మళ్లీ రిషి దూరం అయ్యాడు’ అని మహేంద్ర బాధపడతాడు.

38
Guppedantha Manasu

Guppedantha Manasu

మహేంద్ర బాధ చూసి చక్రపాణి మరింత బాధపడతాడు. క్షమించండి బావగారు అంటూ కాళ్ల మీద పడిపోతాడు. అయ్యో మీరు ఏం చేస్తున్నారు అని మహేంద్ర అంటే.. నా వల్లే మీకు ఈ బాధ. అప్పటికీ నేను అల్లుడి గారికి ఏమీ కాకూడదని కాపలాగానే ఉన్నాను. కానీ.. నా కళ్లముందే అల్లుడు గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చక్రపాణి బాధపడతాడు. దానికి మహేంద్ర మీరు ఏమీ చేయలేదని.. రిషిని చాలా రోజులు కంటికి రెప్పలా కాపాడారని మహేంద్ర అంటాడు.

48
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక సీన్ కట్ చేస్తే.. వసుధార ఫోన్ లో ఏంటి రిషీ సర్ ఎక్కడ ఉన్నారో తెలిసిందా..? నేను ఇప్పుడు వస్తున్నాను అని  ఫోన్ పెట్టేసి కారులో బయలుదేరుతుంది. ఆ మాటలు భద్ర చెవిన పడతాయి. వెంటనే శైలేంద్రకు ఫోన్ చేసి.. ఈ విషయం చెబుతాడు. 

58
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇప్పుడు ఏం చేస్తావ్ అని శైలేంద్ర అడిగితే... వసుధారను ఏసేస్తానని.. కనపడితే ఆ రిషి గాడిని కూడా వేసేస్తానని.. మీరు రెండు ఐస్ బాక్సులు రెడీ చేసుకోండి.. కుదిరితే.. ఇద్దిరీకీ ఒకే చితి ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వెళతాడు. ఆ మాటలు విని.. వసుధార పీడ తనకు వదిలిపోతుందని శైలేంద్ర సంబరపడిపోతాడు.

68
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక.. వసుధార కారును భద్ర బైక్ పై ఫాలో అవుతూ ఓ ప్లేస్ కి వెళతాడు. అక్కడ వసుధారకు కనపడకుండా.. రహస్యంగా ఫాలో అవుతాడు. ఒక ప్లేస్ కి వెళ్లేసరికి వసుధార కనపడదు. దీంతో... ఎక్కడికి వెళ్లిందా అని చూసేలోపు ఎదురుగా నిలపడుతుంది. చూసి షాకౌతాడు. ఇక వసుధార.. భద్ర రెండు చెంపలు వాయించేస్తుంది. ఏంటి మేడమ్.. నన్ను ఎందుకు కొడుతున్నారు అని భద్ర అడుగుతాడు. దానికి వసుధార.. నీ గురించి నాకు మొత్తం తెలుసు రా అని అంటుంది. అప్పుడు భద్ర.. ఓ తెలిసిపోయిందా... తెలుసుకొని ఏం చేస్తావ్ అంటాడు.

78
Guppedantha Manasu

Guppedantha Manasu

వెంటనే ముకుల్.. మాకు చెబుతుంది అని ఎంట్రీ ఇస్తాడు. ముకుల్ ని చూసిన తర్వాత.. దొరికిపోయాను అని భద్రకు అర్థమౌతుంది. ఎలాగైనా తప్పించుకోవాలని మళ్లీ.. అమాయకుడిలా నటించడం మొదలుపెడతాడు. కానీ. వాళ్లు నమ్మరు. నువ్వు.. వసుధార ఫోన్ లో వీడియో డిలీట్ చేసినప్పుడే అనుమానం వచ్చింది అని ముకుల్ అంటాడు. దానికి భద్ర నేను ఏమీ చేశాను.. నేను ఏ వీడియో డిలీట్ చేయలేదు.. నాకేం తెలీదు అని బుకాయిస్తాడు. కానీ.. వసుధార వదలదు. తనకు.. అతనిపై కలిగిన అన్ని అనుమానాలను బయటపెడుతుంది. మొదట మమ్మల్ని కాపాడినట్లు.. నటించడానికి.. నువ్వే రౌడీలను సెట్ చేశావు అనే విషయం కూడా నాకు తెలుసు అని  అంటుంది. ఇక.. తుపాకీ చూపించి.. నువ్వు గతంలో ఏం చేశావ్.. ఇక్కడ ఈ ఇంట్లో ఎందుకు చేరావ్.. అన్నీ బయటపెడతాను అని అరెస్టు చేసి తీసుకువెళతాడు.

అయితే... అరెస్టు అయ్యి వెళ్లే ముందు.. నన్ను పోలీసులకు పట్టించిన నిన్ను వదలను.. నిన్నే కాదు.. ఆ రిషి గాడిని కూడా వదలను అని భద్ర వార్నింగ్ ఇస్తాడు. అయితే.. నా ముందే వార్నింగ్ ఇస్తున్నావేంటి అని ముకుల్ సీరియస్ అవుతాడు.
 

88
Guppedantha Manasu

Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే..వసుధారకు దొరకకముందే.. భద్ర.. శైలేంద్రకు లొకేషన్ పంపుతాడు. దీంతో.. శైలేంద్ర అక్కడికి వచ్చేస్తాడు. భద్ర ఇక్కడికే రమ్మని చెప్పాడు కదా అని వెతుకుతూ ఉంటాడు. సడెన్ గా వసుధార కనపడుతుంది. ఏం వెతుకుతున్నావ్ అని వసుధార అడుగుతుంది. ఏం లేదు వసుధార అని శైలేంద్ర అంటాడు. దానికి వసుధార.. అదేంటి.. ఇందాకటి నుంచి వెతుకుతూనే ఉన్నావ్ కదా..  నా కోసం వెతుకుతున్నావా? లేక భద్ర కోసం వెతుకుతున్నావా అని అడుగుతుంది.

దానికి శైలేంద్ర... భద్ర ఎవరు అని అడుగుతాడు. నీ మనిషే.. భద్రను భధ్రంగా పోలీసులకు అప్పగించాను అని చెబుతుంది.  అయితే.. శైలేంద్ర తనకు భద్ర ఎవరో తెలీదని అంటాడు.. మరి.. ఎవరి కోసం వచ్చావ్ అని వసుధార అంటే.. నేను వాకింగ్ చేసుకుంటూ వచ్చానని చెబుతాడు. దానికి వసుధార.. ఓహో.. మరి వాకింగ్ చేయకుండా.. ఏదో వెతుకుతున్నావ్ ఏంటి అని వసు అడిగితే.. అదొక వ్యాయామం అని ఏదో కవర్ చేయాలని చెబుతాడు. కానీ.. నిజం తెలిసిన వసుధార.. అతని మాటలను నమ్మదు. బుద్ధి సరిచేసుకోమని సెటైర్ వేస్తుంది. 

అయితే... నీకు ఒక షాకింగ్ విషయం చెబుతాను అని వసు అంటుంది. ఏంటది అని శైలేంద్ర అంటే...  భద్ర నీ మనిషి అనే విషయం నాకు తెలుసు.. కావాలనే భద్రను ట్రాప్ చేసి.. నీకు కూడా ఫోన్ చేసేలా చేసింది తానేనని చెబుతుంది. నువ్వేమో ఆశగా.. నా శవం చూద్దాం అని వచ్చావ్.. కానీ.. భద్రను ముకుల్ కి అప్పగించాను. అని చెబుతుంది. ముకుల్ భద్రను అస్సలు వదిలిపెట్టడని.. నిజాలు మొత్తం భయటపెట్టిస్తాడని.. నీ నిజ స్వరూపం బయటకు రావడం ఖాయం అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలకు శైలేంద్రకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.  తర్వాత.. వసుధార.. రిషి గురించి అడుగుతుంది. తనకు తెలీదని శైలేంద్ర చెబుతాడు.  నువ్వు చెప్పకపోయినా.. రిషి సర్ ని నేను కనిపెడతాను.. రెడీగా ఉండు.. అందరి ముందు దోషిలా నిలపడతానికి అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu Today 12 డిసెంబర్ ఎపిసోడ్: నీకు ముందే పిల్లలు ఉన్నారా? రోహిణిపై మీనా అనుమానం, ప్రభావతి తిక్క కుదర్చడానికి సుశీలమ్మ ఎంట్రీ...
Recommended image3
Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved