GuppedanthaManasu 27th January Episode:శైలేంద్ర ఫ్యూచర్ తలుచుకొని దేవయాణి టెన్షన్, బాంబు పేల్చిన ధరణి..!
రిషి సర్ కి కాలేజీలో ఎదురు నిలపడేవారు లేరని.. సర్ వచ్చి.. స్టూడెంట్స్ తో మాట్లాడాలి అని అంటుంది. శైలేంద్ర తీసుకున్న గోతిలో శైలేంద్ర పడేలా చేయాలని త్వరగా తీసుకురమ్మని తండ్రితో చెబుతుంది.
Guppedantha Manasu
GuppedanthaManasu 27th January Episode: వసు ఇచ్చిన షాక్ కి శైలేంద్రకు మండిపోతుంది. నిజంగానే వసుధార.. రిషిని తీసుకువస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి చెబుతాడు. ఆ రిషి వస్తున్నాడని.. నువ్వు కూడా కాలేజీకి రా అని చెబుతుండగానే మహేంద్ర వచ్చి ఆ ఫోన్ తీసుకుంటాడు.. రిషి వస్తున్నాడు వదినగారు మీరు కూడా రండి అని చెబుతాడు. మీ కొడుకు చేసే దుర్మార్గాలకు మీరే ఆజ్యం పోశారు కదా.. ప్రతి విషయంలోనూ మీరు పక్కనుండి మరీ ప్రోత్సాహం ఇచ్చారు కదా.. అలాంటి మీరు రాకపోతే ఎలా..? ఒక తల్లి తన బిడ్డను చెడు మార్గంలో నడిపిస్తే.. వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో.. ఒక తల్లిగా మీరు చూడాలి కదా వదిన గారు.. వచ్చేయండి.. త్వరగా వచ్చేయండి.. మీ కొడుకు జైలుకు వెళితే.. కళ్లారా చూద్దురుగానీ రండి వదిన గారు అని ఫోన్ పెట్టేస్తాడు.
Guppedantha Manasu
తర్వాత.. శైలేంద్రకు మహేంద్ర చురకలు వేస్తాడు. ‘నీ దుర్మార్గాలకు ఈ రోజు ఎండ్ కార్డ్ పడబోతోంది నీలో ఉన్న అన్ని షేడ్స్ చూపించావ్ కదరా.. మీ నాన్న ముందు అమాయకుడిగా, రిషి ముందు మంచివాడిలా భలే నటించావ్ రా.. నీకు ఎండీ సీటు కావాలా? నీ మొహానికి ఎండీ అయ్యో లక్షణం ఉందారా? పది మందికి మంచి చేయడం రాదు కానీ.. చెడు చేయడంలో మాత్రం ముందుంటావ్. అసలు ఫారిన్ లో నువ్వు బిజినెస్ చేశావారా? లేక ఈ కుల్లు, కుతంత్రాలు , ఎటాక్ లు, హత్యలు ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకున్నావా? అలా సైలెంట్ గా ఉన్నావేంటి? ఒక మాట అనగానే ఎగిరెగిరి పడతావ్ గా, ఇప్పుడు మాట పగలడం లేదేంటి? ఓ రిషి వస్తున్నాడని.. నీ గుండెల్లో దడపుట్టిందా? ఏది ఏమైనా నీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఓ సారీ రోజులు కాదు.. గంటలు, గంటలు కూడా కాదు క్షణాలు.. దగ్గరపడ్డాయి. నీ బుద్ది అందరి ముందు బయటపడుతుంది. నీకు ఈ రోజు నా కొడుకు అంటే ఏంటో తెలుస్తుంది. వాడి కోపానికి భస్మం అయిపోతావ్.. ఊచలు లెక్కపెట్టడానికి రెడీగా ఉండు. ఇఫ్పటికైనా అర్థమైందా నువ్వు నా కొడుకు కాలి గోటు కూడా టచ్ చేయలేవని’ అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఈ లోగా మినిస్టర్ గారు రావడంతో అందరూ స్వాగతం పలుకుతారు. ఆయన రావడం రావడమే...రిషి వస్తున్నాడంట కదమ్మా.. చాలా సంతోషంగా ఉందని, డీబీఎస్టీ కాలేజీ ఈ స్థాయిలో ఉందంటే.. దానికి రిషి కారణం అని, కొత్త కొత్త ఆలోచనలతో వచ్చి.. వాటిని నా దగ్గరకు వచ్చి అప్రూవ్ చేసుకునేవాడని.. రిషి గురించి గొప్పగా మాట్లాడతాడు. రిషి ఈ ఫెస్ట్ కి వస్తున్నందుకు తన చాలా సంతోషంగా ఉందని చెప్పి.. ఫణీంద్ర పిలుపుతో లోపలికి వస్తాడు.
Guppedantha Manasu
మినిస్టర్ రావడంతో.. ఫెస్ట్ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఈలోగా వసుధార చక్రపాణికి ఫోన్ చేసి బయలుదేరారా అని అడుగుతుంది. కానీ.. చక్రపాణి ఇప్పుడు జ్యూస్ తాగాడని.. ఇంకా బయలుదేరలేదని చెబుతాడు. మరోసారి ఆలోచించుకోమని.. మరోసారి ఏదైనా జరిగితే కోలుకోవడానికి సమయం పడుతుంది అని చక్రపాణి చెబుతాడు. కానీ.. వసు మాత్రం... రిషి సర్ రావాల్సిందేనని.. త్వరగా బయలుదేరమని చెబుతుంది. డీబీఎస్టీ.. రిషి సర్ సామ్రాజ్యం అని.. ఇక్కడ సర్ ని ఎవరూ టచ్ ఛేయలేరని అంటుంది. నీటిలో మొసలికి బలం ఉన్నట్లే.. రిషి సర్ కి కాలేజీలో ఎదురు నిలపడేవారు లేరని.. సర్ వచ్చి.. స్టూడెంట్స్ తో మాట్లాడాలి అని అంటుంది. శైలేంద్ర తీసుకున్న గోతిలో శైలేంద్ర పడేలా చేయాలని త్వరగా తీసుకురమ్మని తండ్రితో చెబుతుంది.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర..రాజీవ్ కి ఫోన్ చేసి.. రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. రాజీవ్ తాను అదే పనిలో ఉన్నానని చెబుతాడు. శైలేంద్ర మాత్రం.. అదే పనిలో ఉండటమే కాదు.. నాకు టెన్షన్ వస్తోందని.. ఎక్కడ ఉన్నారో తెలుసుకోమని చెబుతాడు. అయితే.. రాజీవ్ కూల్ గా నేను వాళ్లను పట్టుకొని అంతమొందిస్తానని.. మీరు ఆ ఫెస్ట్ ని ఎంజాయ్ ఛేయమని చెబుతాడు.
Guppedantha Manasu
ఇక ఫెస్ట్ లో భాగంగా.. మంత్రి గారికి కాలేజీ యాజమాన్యం సత్కరిస్తుంది. మినిస్టర్ గారిని మాట్లాడమని అడిగితే.. తనకంటే ముందు కాలేజీ ఎండీ వసుధార మాట్లాడితే బాగుంటుంది అంటాడు. దీంతో.. వసుధార మైక్ పట్టుకొని.. స్టూడెంట్స్ గురించి మాట్లాడుతుంది. కాలేజీలో ఎలా ఉండాలి.. భవిష్యత్తు గురించి ఎలా ఆలోచించాలో చాలా బాగా చెబుతుంది. తర్వాత మళ్లీ మినిస్టర్ కి ఛాన్స్ ఇస్తుంది. ఆయన కూడా..స్టూడెంట్స్ గురించి.. యూత్ ఫెస్టివల్ గురించి మాట్లాడతాడు. స్టూడెంట్స్ అందరూ వసుధార ను ఆదర్శంగా తీసుకోమని చెబుతాడు. స్టూడెంట్ గా తన జీవితం మొదలుపెట్టిన వసుధార.. ఇప్పుడు ఎండీగా అయ్యిందని.. చాలా గొప్పగా మాట్లాడుతాడు. అయితే.. తన పేరు ఒక్కసారి కూడా చెప్పలేదని శైలేంద్ర ఫీలౌతాడు.
Guppedantha Manasu
తర్వాత.. మెరిట్ స్డూడెంట్స్ కి షీల్డ్ ఇవ్వమని లెక్చరర్ చెబితే... రిషి చేతుల మీదుగా ఇద్దాం అని మంత్రిగారు అంటారు. వసుధార సరే అంటుంది. మహేంద్ర.. రిషి వాళ్లు ఎక్కడిదాకా వచ్చారో కనుక్కోమని చెబుతాడు. శైలేంద్ర.. భద్రకు ఫోన్ చేసి రిషి ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు. లేదు అని.. నేను కాపు కాస్తున్నాను అని.. వేసేస్తాను అని హామీ ఇస్తాడు.
Guppedantha Manasu
మరోవైపు ఇంట్లో దేవయాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషి వస్తే.. వీళ్లంతా జరిగిన విషయం మొత్తం చెప్పేస్తారని, జగతిని చంపిన విషయం తెలిస్తే.. రిషి మమ్మల్ని బతకనిస్తాడా.. రిషిదాకా ఎందుకు.. స్టూడెంట్స్ ఏం చేస్తారో.. అక్కడ నా కొడుకు పరిస్థితి ఏంటో అని దేవయాణి భయపడుతూ ఉంటుంది. అప్పుడే..ధరణి వచ్చి అత్తయ్యగారు కాఫీ అని ఇస్తుంది. నేను అడగలేదు కదా అని దేవయాణి అంటే.. మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని అర్థమైంది.. అందుకే తెచ్చాను అని చెబుతుంది. కాఫీ తాగితే టెన్షన్ తగ్గుతుందని చెబుతుంది. నా టెన్షన్ నీకు కనపడుతుందా అని దేవయాణి అంటే.. క్లియర్ గా కనపడుతోందని చెప్పి.. కాఫీ చేతిలో పెడుతుంది. తర్వాత.. ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది.. ఏం లేదు అని దేవయాణి అంటే.. ఏదైనా పరిష్కారం నాకు తెలిస్తే చెబుతాను అంటుంది. దానికి దేవయాణి.. రిషి కాలేజీకి వస్తున్నాడంట అని చెబుతుంది. ఆ మాట విని ధరణి సంతోషిస్తుంది. కొంచెం ముందు చెబితే.. నేను కూడా కాలేజీకి వెళ్లేదాన్ని కదా, అయినా రిషి వస్తుంటే సంతోషించాలి కానీ.. టెన్షన్ ఎందుకు..? మీరు ఏదైనా తప్పు చేశారా? లేక మీ అబ్బాయి తప్పు చేశారా?చేసే ఉంటారులేండి.. ఇప్పుడు రిషి వస్తే ఏం చేస్తున్నాడా అని భయపడుతన్నారా అని అంటుంది.
తర్వాత.. ఇన్ని రోజులు రాకుండా ఉన్న రిషి సడెన్ గా కాలేజీకి ఎందుకు వస్తున్నాడు అత్తయ్య అని ధరణి అంటుంది. దానికి దేవయాణి.. పడుకున్న గుర్రాన్ని కాలితో తన్నినట్లు..వెళ్లి వసుధారతో శైలేంద్ర ఛాలెంజ్ చేశాడంట. రిషి వస్తున్నాడని కాలేజీలో ఫ్లెక్సీలు పెట్టించాడు. అందుకే వసుధార తీసుకువస్తోంది అని దేవయాణి చెబుతుంది. అసలు వీడికి ఈ ఆాలోచన ఎలా వచ్చిందో అని దేవయాణి అంటే... ధరణి నవ్వుకుంటూ.. నేను ఇచ్చాను అని చెబుతుంది. ఆయన కాలేజీలో అందరూ షాకయ్యే న్యూస్ వినాలి అని అడిగారు.. దానికి రిషి వస్తున్నాడు అని చెప్పు అన్నాను... ఆయన కూడా అదే ఫాలో అయ్యారు అని ధరణి అంటుంది. దీనంతటికీ కారణం నువ్వే అనమాట అని దేవయాణికి కోపం వస్తుంది.