MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha manasu: నిల్చున్నచోటే కప్పెట్టేస్తా, దేవయాణికి వసు వార్నింగ్, తండ్రి కోసం రిషి సర్ ప్రైజ్..!

Guppedantha manasu: నిల్చున్నచోటే కప్పెట్టేస్తా, దేవయాణికి వసు వార్నింగ్, తండ్రి కోసం రిషి సర్ ప్రైజ్..!

 శైలేంద్రకు పిచ్చిగా కోపం వస్తుంది. తనను రెచ్చగొట్టొద్దు అని  వార్నింగ్ ఇస్తాడు. వాళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా రిషి అక్కడకు వస్తాడు.

ramya Sridhar | Updated : Nov 13 2023, 11:04 AM
4 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Guppedantha Manasu

Guppedantha Manasu


గుప్పడెంత మనసు:  తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఈ సీరియల్ రోజు రోజుకీ ఆసక్తికర కథనంతో, ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మరి, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో, జగతి హత్య వెనక కుట్ర తెలుసుకోవడానికి రిషి ఏం చేశాడు...? మహేంద్ర కు రిషి, వసుధారలు ఎలాంటి సర్ ప్రైజ్ ఇచ్చారో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం..

210
Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha manasu: ఈ రోజు ఎపిసోడ్ లో నిన్నటి ఎపిసోడ్ కి కంటిన్యూషన్ జరిగింది. వసుధార, దేవయానితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. జగతి చనిపోవడానికి కారణం శైలేంద్ర, దేవయాని అనే విషయం వసుధారకు తెలుసు. అందుకే, రిషి లేని సమయంలో వారికి లెప్ట్ అండ్ రైట్ ఇస్తుంది. నిజానికి శైలేంద్రతో వసుధార మాట్లాడుతూ ఉంటుంది. తన తోటి కోడలు దరణిని మంచి గా చూసుకోమని సలహా ఇస్తుంది. ఆ సమయంలో దేవయాణి ఫోన్ తీసుకొని భార్య, భర్తలు ఎలా ఉండాలో నువ్వు చెప్పక్కర్లేదు అని సీరియస్ అవుతుంది. దీంతో, భార్యభర్తలు మంచిగా ఉంటే, ఎవరూ జోక్యం చేసుకోరని, ఒకరి వల్ల మరొకరు బాధపడుతుంటే తాను చూస్తూ ఊరుకోనని, ముఖ్యంగా తన తోటికోడలు బాధపడితే అస్సలు చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. వసు మాటలకు శైలేంద్ర, దేవయాణి లకు మండిపతుంది.

310
Guppedantha Manasu

Guppedantha Manasu

‘ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావ్, మేము ఏం చేయలేం అనుకుంటున్నావా వసుధారా’  అని దేవయాణి సీరియస్ గా అడుగుతంది. దీంతో, వసు.. ‘ఎందుకు చేయరు, మేం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం అని తెలుసుకునేందుకు నిఘా పెడుతూ ఉంటారు. ఇదే కదా మీరు చేసేది. అంతకు మించి మీరు ఏం చేయగలరు. కానీ, ఒక్క మాట గుర్తుపెట్టుకొండి. ఇక నుంచి మీ ఆటలు సాగవు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే. చూస్తూ ఉండండి’ అని వసు వార్నింగ్ ఇస్తుంది. దీంతో దేవయాణి నన్ను నీవు ఏం చేయలేవు వసుధార అని అరుస్తుంది. దానికి వసు చిన్నగా నవ్వి, ‘ ఏం చేయలేనని మీరు అనుకుంటున్నారు. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన, అది చేతకాని తనం కాదు. అందులో మంచితనం కూడా ఉంటుంది. మీ నిజ స్వరూపాలు బయటపడితే, ఫణీంద్ర సర్ బాధపడతారు. వాళ్లు బాధపడకుండా, దీనిని డీల్ చేయాలని అనుకుంటున్నాను. నేను తలుచుకుంటే, మీరు నిల్చున్న చోటే మిమ్మల్ని కప్పిపెట్టేయగలను.కానీ, ఈ వసుధారకి ఒక పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే వెళతాను. మా గురించి కూపీ లాగే పని పెట్టుకోవద్దు.’ అని చెప్పి, ఫోన్ పెట్టేస్తుంది. దీంతో, వసు మాటలకు శైలేంద్ర, దేవయాణి ఫ్రస్టేట్ అయిపోతారు.

410
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక, సీన్ కట్ చేస్తే, అనుపమ తన పాత స్నేహితులకు ఫోన్లు చేస్తూ ఉంటుంది. అందరికీ ఫోన్లు చేసి గెట్ టూ గెదర్ కి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. వాళ్లు అందరూ కూడా వస్తాం అని చెబుతూ ఉంటారు.

510
Guppedantha Manasu

Guppedantha Manasu

మరుసటి రోజు రిషి, వసుధారలు తమ డీబీఎస్టీ కాలేజీకి వెళతారు. అంతలో రిషికి, ముకుల్( జగతి కేసు డీల్ చేస్తున్న పోలీసు అధికారి) ఫోన్ చేస్తాడు. వారు రావడాన్ని దూరం నుంచి శైలేంద్ర చూస్తూ ఉంటాడు. రిషి ఫోన్ మాట్లాడుతూ ఆగిపోతే, వసుతో శైలేంద్ర మాట్లాడటం మొదలుపెడతాడు. ఫోన్ లో తమతో చాలా పొగరుగా మాట్లాడావ్ అంటాడు. దీంతో, వసు ‘ మీ నోటి నుంచి పొగరు అని వినడం నాకు చాలా అసహ్యంగా కంపరంగా ఉంది( రిషి ప్రేమగా పొగరు అని పిలుస్తాడు. అందుకే అలా అంటుంది) ఇంకెప్పుడు అలా అనకండి. అయినా, నా పొగరు నా ఇష్టం. అది ఎప్పటికీ తగ్గదు. మీరు అన్నా అనకున్నా నేను పొగరే. అసలు పొగరు నా సిగ్నేషర్. నా ఆటిట్యూడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నా పొగరు, నా ఆటిట్యూడ్ కి ఒక కాలుక్యిలేషన్ ఉంటుంది. అది ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటుంది.’ అని సమాధానం ఇస్తుంది.

610
Guppedantha Manasu

Guppedantha Manasu

దానికి శైలేంద్ర, ‘ పిన్ని చనిపోక ముందు ఇలా మాట్లాడావు అంటే ఒక అర్థం ఉంది. కానీ, చనిపోయిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావ్ ? నీకు చావు అంటే భయం లేదా?’ అని ప్రశ్నిస్తాడు. అయితే, వసు తనకు భయం ఉందని, కానీ దాని వెనక ధైర్యం కూడా ఉంది అని చెబుతుంది. ఆ ధైర్యం పేరు రిషి సర్ అని అంటుంది. ఆ తర్వాత  కాలేజీలో మీకేం పని ? ఎందుకు వచ్చారు? అటెండర్ ప్లేస్ భర్తీ చేయడానికి వచ్చారా అని అపహాస్యం చేస్తుంది. శైలేంద్రకు పిచ్చిగా కోపం వస్తుంది. తనను రెచ్చగొట్టొద్దు అని  వార్నింగ్ ఇస్తాడు. వాళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా రిషి అక్కడకు వస్తాడు.

710
Guppedantha Manasu

Guppedantha Manasu

వచ్చి రాగానే, ఏమైంది అని ప్రశ్నిస్తాడు. దానికి వసు భలే కవర్ చేస్తుంది. తనను శైలేంద్ర పొగరు అన్నారని, దానికి తనను రిషి సర్ మాత్రమే అలా అంటారు అని చెబుతున్నానని చెబుతుంది. ఇంత చిన్న విషయానికే అంత కోపంగా ఎందుకు ఉన్నావ్ అన్నయ్య అనేస్తాడు. నిజమే, వసుధారకు చాలా పొగరు అన్నయ్య అంటాడు. అంతేకాదు, తన పొగరు చూసే తాను ఇంప్రెస్ అయ్యానని, ఆమె విజయం వెనక ఉన్నది కూడా పొగరే అని చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి శైలేంద్ర కు మండిపోతూ ఉంటాడు. తర్వాత శైలేంద్ర మళ్లీ రిషి నుంచి కొంత సమాచారం తెలుసుకోవాలని చూస్తుంటే, వసు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది.

810
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక,  రిషి, ముకుల్ ని కలవడానికి బయటకు వెళతాడు. కొంత సమాచారం తెలసిందని చెబుతాడు. ఆ షూటర్ చినిపోవడానికి ముందు ఒక ఫోన్ వచ్చిందని, ఆ నెంబర్ ని ట్రేస్ చేస్తున్నట్లు చెబుతాడు. ఆ ఆఖరి కాల్ లో మాట్లాడిన వ్యక్తే, షూటర్ ని చంపి ఉంటాడని అనుమానంగా ఉందని చెబుతాడు. కిల్లర్ చాలా తెలివిగా,డీటేల్స్ అన్నీ ఎరేజ్ చేశాడని, కచ్చితంగా పట్టుకుంటామని చెబుతాడు. అమ్మను చంపిన వాడిని డాడ్ ముందు నిలపెట్టాలి అని రిషి అంటాడు.

ఆ తర్వాత మహేంద్రకు గెట్ టూ గెదర్ కి రమ్మని వరసగా ఫోన్లు వస్తూ ఉంటాయి. అది ఏంటని రిషి ఆరా తీస్తే, మహేంద్ర చెప్పకుండా వెళ్లిపోతాడు. అప్పుడే మహేంద్రకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రిషి లిఫ్ట్ చేస్తాడు. అనుపమ మాట్లాడుతుంది. వారి మధ్య అరకులో  జరిగిన సన్నివేశాలన్నీ రిషికి గుర్తుకు వస్తాయి.  వెంటనే, ఆమెతో మంచిగా మాట్లాడతాడు. గెట్ టూ గెదర్ ప్లాన్ గురించి మొత్తం అనుపమ రిషికి చెబుతుంది. మహేంద్రను ఫంక్షన్ కి తీసుకురమ్మని చెబుతుంది. జగతిని కూడా తీసుకురమ్మని అనుపమ చెబుతుంది. రిషి ఏదో చెప్పబోతుంటే అనుపమ వినకుండా, ఫోన్ కట్ చేస్తుంది. 
 

910
Guppedantha Manasu

Guppedantha Manasu

ఆ తర్వాత ఇదే విషయంపై వసుతో మాట్లాడతాడు. అనుపమ, మహేంద్ర మధ్య బంధం తెలియాలంటే, వారు అక్కడకు వెళ్లాలి అని అనుకుంటారు. అక్కడకు వెళ్తేనే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని అనుకుంటారు. జగతి మేడమ్ కి  అనుపమ కి మధ్య రిలేషన్ ఏంటో అక్కడికి వెళ్తేనే తెలుస్తుందని వారు అనుకుంటారు. జగతి చనిపోయిన విషయం మహేంద్ర అనుపమకు ఎందుకు చెప్పడం లేదో తెలుసుకోవాలని అనుకుంటారు. సీక్రెట్ గా మహేంద్రకు తెలియకుండా తీసుకొని వెళ్లాలని  అనుకుంటారు. మహేంద్రను దగ్గర ఉండి రెడీ చేసి మరీ రిషి బయటకు తీసుకువెళతాడు. ఎక్కడికి అనే విషయం చెప్పకుండా తీసుకువెళతారు.

1010
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక, అక్కడ గెట్ టూ గెదర్ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అందరూ తమ పాత స్నేహితులను కలుసుకొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా, అక్కడికి అప్పుడే రిషి వాళ్ల కారు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories