- Home
- Entertainment
- TV
- Guppedantha manasu Serial 30th December:భద్ర ప్లాన్ రివర్స్... టెన్షన్ లో శైలేంద్ర, వసు కోసం రిషి ప్రయత్నాలు..
Guppedantha manasu Serial 30th December:భద్ర ప్లాన్ రివర్స్... టెన్షన్ లో శైలేంద్ర, వసు కోసం రిషి ప్రయత్నాలు..
ఈలోగా.. అనుపమ కనపడం లేదని.. వసుధార మహేంద్రను నిద్రలేపుతుంది. తాను ఇళ్లంతా వెతికానని, కనపడలేదని చెబుతుంది. మహేంద్ర కంగారుపడతాడు.

Guppedantha Manasu
Guppedantha manasu Serial 30th December:రౌడీలు బయట వసుధార మెడకు కత్తిపెట్టి... రిషిని బయటకు రమ్మంటూ పిలుస్తారు. రిషి బయటకు వెళతాను అంటే, పెద్దయ్య వద్దు అని ఆపుతూ ఉంటాడు. అయితే, రౌడీలు మాత్రం రిషిని రెచ్చగొడుతూ ఉంటారు. నేను వసుధారను కాపాడుకోవాలి.. నేను వెళతాను అంటూ రిషి అంటూ ఉంటాడు. వాళ్లు మాత్రం.. నీ పెళ్లాం చచ్చినా నీకు పర్వాలేదా అని అంటూ, దీని చాప్టర్ క్లోజ్ చేస్తాం అని చంపబోతారు. నిద్రలో రిషి.. వసుధార అని అరుస్తాడు. అదంతా ఊహించినట్లుగా కలే. వసుకి ఏదో జరిగినట్లు కల వచ్చిందని.. ఆ వృద్ధ దంపతులు అర్థం చేసుకుంటారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, వైద్యం పూర్తైన తర్వాత మీ వాళ్ల దగ్గరకు వెళ్దువ్ కానీ అని వాళ్లు చెబుతారు. కానీ, రిషి తనకు వాళ్ల డాడ్ ని, వసుధార చూడాలని అనిపిస్తోందని.. తాను అన్ని రోజులు ఆగలేను అంటాడు. పెద్దయ్య మాత్రం.. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని నచ్చచెబుతూ ఉంటారు. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పడుకోమని సలహా ఇస్తారు.
Guppedantha Manasu
మరోవైపు భద్ర... మత్తుమందు ఇచ్చి... అనుపమను ఎత్తుకొస్తాడు. నిజానికి వసుధార అనుకొనే తీసుకువస్తాడు. కానీ అది అనుపమ అవుతుంది. ఆవిడను తీసుకొని వస్తుండగా.. వసుధార గొంతు వినపడుతుంది. వసుధార గొంతు అక్కడ వినపడితే.. నేను తీసుకొచ్చింది ఎవరినీ అనుకొని చూస్తాడు. చూస్తే అనుపమ ఉంటుంది. ఈలోగా.. అనుపమ కనపడం లేదని.. వసుధార మహేంద్రను నిద్రలేపుతుంది. తాను ఇళ్లంతా వెతికానని, కనపడలేదని చెబుతుంది. మహేంద్ర కంగారుపడతాడు.
Guppedantha Manasu
ఈ లోగా భద్ర.. అనుపమను కిందపడుకోపెట్టి.. ఎవరో వచ్చి.. అనుపమను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్లు డ్రామా చేస్తాడు. ఈ లోగా వసు, మహేంద్ర వచ్చి... అనుపమను లేపడానికి ప్రయత్నిస్తారు. ఈ లోగా భద్ర వచ్చి.. ఓ వ్యక్తి వచ్చి అనుపమను కిడ్నాప్ చేయాలని చూశాడని, తాను పట్టుకునేలోగా పారిపోయాడని కట్టు కథ అల్లి చెబుతాడు. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో.. వాడి ఫేస్ కూడా చూడలేకపోయానని చెబుతాడు. అందరికీ కరెంట్ ఉంది కదా.. మనకే ఎందుకులేదు అని మహేంద్ర అడిగితే.. అది కూడా వాడి ప్లాన్ అనుకుంట..మన ఇంట్లో మెయిన్ ఆఫ్ చేశాడనుకుంట అని చెప్పి.. తర్వాత.. మెయిన్ ఆన్ చేస్తాడు.
Guppedantha Manasu
తర్వాత.. ముఖంపై నీరు చల్లి అనుపమను మహేంద్ర, వసు లేపుతారు. కిడ్నాప్ గురించి తెలియని అనుపమ..ఏమైందని, తాను ఇక్కడకి ఎలా వచ్చాను అని అడుగుతుంది. అప్పుడు.. తనని ఎవరో కిడ్నాప్ చేయబోయారని మహేంద్ర చెబుతాడు. నిన్ను ఎవరో ఎత్తుకుపోతుంటే.. భద్ర చూసి కాపాడాడు అని మహేంద్ర చెబుతాడు. మత్తు మందు ఇచ్చి తీసుకువెళ్లడం వల్ల.. నువ్వు స్పృహ కోల్పోయావని, సమయానికి భద్ర కాపాడాడు అని అనుకుంటూ ఉంటారు.
Guppedantha Manasu
నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అనుపమ అంటుంది. అదే అర్థం కావడం లేదు.. మహేంద్ర కూడా అంటాడు. తర్వాత.. అనుపమ..కిడ్నాప్ చేయాలని చూసింది తనని కాదని, వసుధార కోసమే వచ్చాడని.. వసుని అనుకొని నన్ను కిడ్నాప్ చేశారని అనుపమ అంటుంది. అంతా చూసిన భద్ర ఏమీ తెలియనట్లుగా.. మీకు చాలా మంది శత్రువులు ఉన్నారనుకుంట మేడమ్.. జాగ్రత్త అంటాడు.
మహేంద్ర కూడా.. వసుకి జాగ్రత్తలు చెబుతాడు. నీకు ఎవరి మీద అయినా అనుమానం వస్తే.. నాకు చెప్పుు లేదంటే.. భద్రకు చెప్పు అని వసుకి చెబుతూ ఉంటాడు. వసుకి చాలా ఆపదలు ఉన్నాయని, ముందు చూపుతో నువ్వే వసుధారను కాపాడాలని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని భద్రకు మహేంద్ర చెబుతాడు. తాను జాగ్రత్తగా చూసుకుంటానని, అది తన డ్యూటీ అని భద్ర కూడా నమ్మకంగా మాట్లాడతాడు. కానీ, ప్లాన్ మిస్ అయినందుకు భద్ర ఫీలౌతాడు. ఈరోజు ప్లాన్ మిస్ అయినా, రేపు అయినా ఫినిష్ చేస్తాను అని అనుకుంటాడు.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర ఇంట్లో నిద్రపట్టక ఆలోచిస్తూ ఉంటాడు. ధరణి నిద్రపోయిందని నిర్థారించుకున్న తర్వాత.. భద్ర పని పూర్తి చేశాడో లేదో అని , భద్ర ఇంకా ఫోన్ చేయలేదని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా శైలేంద్రకు ఫోన్ వస్తుంది. ధరణి ఆ సౌండ్ కి మెళకువ వస్తుంది. శైలేంద్ర బుద్ధి మారలేదని మనసులోనే తిట్టుకుంటుంది.
తర్వాత శైలేంద్ర.. పక్కకు వెళ్లి.. భద్రతో ఫోన్ మాట్లాడుతాడు. చాలా ఫ్రస్టేట్ అవుతూ పని అయ్యిందా అని అడుగుతాడు. అవ్వలేదని, ఓ పొరపాటు జరిగిందంటాడు. అసలే ఫ్రస్టేషన్ లో ఉన్న శైలేంద్ర.. క్లియర్ గా చెప్పమంటే.. జరిగిన విషయం చెబుతాడు. వసుధార అనుకొని అనుపమను తీసుకువచ్చావా అని తిడతాడు. చీకట్లో కనపడలేదు అని భద్ర చెబుతాడు. పర్సనాలిటీ అయినా తెలుస్తుంది కదా అని శైలేంద్ర అడిగితే.. అప్పుడు ఉన్న పరిస్థితిలో పర్సనాలిటీ చూసుకునేంత లేదని చెబుతాడు. నిన్ను నమ్ముకుంటే ఇలా చేశావేంటి రా అని శైలేంద్ర అంటే.. ఇదంతా మన మంచికే జరిగిందని భద్ర అంటాడు.
Guppedantha Manasu
ఆ మాటకు శైలేంద్రకు కాలుతుంది. ఏదోదో మాట్లాడతాడు. అయితే.. నేను తప్పుకుంటా.. నువ్వు వచ్చి చంపుతావా అని భద్ర అడుగుతాడు. దాంతో శైలేంద్ర అలర్ట్ అయ్యి మంచిగా మాట్లాడతాడు. దానికి భద్ర.. ఈ రోజు సంఘటనతో నాపై ఇంట్లో వాళ్లకు మంచి అభిప్రాయం వచ్చిందని, నేనే అనుపమను కాపాడాను అని అనుకుంటున్నారని చెబుతాడు. నమ్మకం, తొక్కా, తోటకూర కాకుండా.. తొందరగా పని పూర్తి చెయ్యి అని ఆర్డర్ వేసి శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. శైలేంద్ర ప్రవర్తన తనకు నచ్చకపోయినా.. ఇచ్చిన పని చేయక తప్పదు అని భద్ర అనుకుంటాడు.
ఇక.. లోపలికి వచ్చిన శైలేంద్ర.. నిజంగా ధరణి నిద్రపోయిందా లేక.. నటిస్తోందా అని అనుకుంటూ ఉంటాడు. లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. ధరణి మాత్రం.. మీరు ఎంత పిలిచినా నేను పలకను కదా అనుకుంటుంది. ధరణి నిజంగానే నిద్రపోయింది అనుకొని.. శైలేంద్ర ప్రశాంతంగా నిద్రపోతాడు. శైలేంద్ర పడుకున్న తర్వాత.. ‘ మీలాంటి మూర్ఖులు ఈ భూమ్మీద ఉండకూడదు’ అని ధరణి మనసులో అనుకుంటుంది.
Guppedantha Manasu
మరోవైపు తెల్లారిన తర్వాత.. రిషి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ‘ వసుధార నా శరీరం సహకరించడం లేదు. కానీ, నా మనసు ఆగడం లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను, డాడ్ ని చూస్తానా అని అనిపిస్తోంది. నేను ఇక్కడ ఎంతో కాలం ఉండలేను. జీవచ్ఛవంలా ఉండలేను. వస్తున్నా వసుధార అంటూ లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లేవలేడు. బయట ఉన్న ముసలివాళ్లు వచ్చి.. రిషి ని మళ్లీ పడుకోపెడతారు.
పైకి లేవద్దు అని చెప్పాం కదా.. ఎందుకు లేచావ్? నీ పెండ్లాం గుర్తుకొస్తుందా? కొద్ది రోజులు ఆగు.. అని మంచిగా చెప్పాలని చూస్తారు. రిషి మాత్రం.. తాను వెళ్లాలి అని పట్టుపడతాడు. వాళ్లు మాత్రం.. వద్దు అని.. కొద్ది రోజులు చికిత్స అవసరం అని చెబుతారు. అయితే.. రిషి తనకు తన వాళ్లని చూడాలని, వాళ్లతో మాట్లాడాలని ఉందని.. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉందా అని అడుగుతాడు. కనీసం ఫోన్ లో అయినా వాళ్లతో మాట్లాడాలి అని చెబుతాడు. అయితే.. తమ వద్ద ఫోన్ లేదని చెబుతారు.
పెద్దాయన వెళ్లి.. నెంబర్ చెప్పు..నేను మాట్లాడతాను అంటాడు. దానికి పెద్దమ్మ.. ఎవరినో ఒకరిని అడిగి ఫోన్ తీసుకొని రమ్మని చెబుతుంది. సరే అని అతను వెళతాడు. తర్వాత పెద్దమ్మతో..తన భార్య గొప్పతనాన్ని రిషి పంచుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తయ్యింది. మరి.. తర్వాతి ఎపిసోడ్ లో అయినా.. వసుతో రిషి మాట్లాడతాడేమో చూడాలి.