- Home
- Entertainment
- TV
- Guppedantha manasu Serial Today Episode:రౌడీలను చితక్కొటి మరీ.. రిషిని చేరిన వసు..!
Guppedantha manasu Serial Today Episode:రౌడీలను చితక్కొటి మరీ.. రిషిని చేరిన వసు..!
నువ్వు ఫాలో అవ్వు అని భద్రను శైలేంద్ర పంపుతాడు. వసుధార.. రిషిని కలుసుకుంటే.. ఇద్దరినీ చంపేయమని, లేకపోతే వసుధారను చంపేయమని ఖాళీ చేతులతో మాత్రం రావద్దు అని చెబుతాడు.

Guppedantha Manasu
Guppedantha manasu Serial:రిషి నుంచి ఫోన్ రావడంతో వసుధార అక్కడికి ఎవరికీ చెప్పకుండా బయలు దేరుతుంది. మరి, రిషిని వసు చేరుకుందా? మళ్లీ శైలేంద్ర ఏదైనా కుట్ర చేశాడా అనే ఆసక్తికర విషయాలను నేటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం...
Guppedantha Manasu
వసుధార కోసం మహేంద్ర, ఫణీంద్ర వస్తారు. వసుధార క్లాస్ రూమ్ కి వెళ్లిందేమో అని, అటెండర్ ని పిలుస్తాడు. అతను వచ్చి.. ఏదో ఫోన్ వచ్చిందని వసుధార హడావిడిగా బయటకు వెళ్లిందని చెబుతాడు. ఆ మాట శైలేంద్ర చెవినపడుతుంది. రిషి గురించి ఏదైనా జాడ వసుకి తెలిసి ఉంటుంది. అందుకే, హడావిడిగా బయటకు వెళ్లింది అనుకుంటాడు. మరోవైపు ఫణీంద్ర.. మహేంద్రకు ఫోన్ చేయమని, వసు ఎక్కడ ఉందో అడగమంటాడు. కానీ, మహేంద్ర.. ఏ పనిలో ఉందో.. ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకులే వద్దు అంటాడు.
Guppedantha Manasu
సరే అని ఫణీంద్ర ఊరుకుంటాడు. వెళ్తూ వెళ్తూ.. మహేంద్ర.. ఎండీ సీటును పట్టుకొని బాధపడతాడు. అందులో కూర్చున్న జగతి లేదని, కూర్చోవాల్సిన రిషి కూడా దగ్గర లేడని.. రిషిని తలుచుకుంటూ ఏడ్చేస్తాడు. రిషికి ఏం కాదు అని ఫణీంద్ర ధైర్యం చెబుతాడు. వసు కూడా రిషి వస్తాడనే నమ్మకంతో ఉందని, ఆ నమ్మకానికి నిదర్శనం ఈ ఖాళీ కుర్చీ అని మహేంద్ర అంటాడు. దానికి ఫణీంద్ర... తనకు కూడా వసు నమ్మకంపై గౌరవం ఉందని, రిషి ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని అంటాడు. తర్వాత మహేంద్రకు జగతి ఫోటో చూపిస్తాడు. రిషి కోసం జగతి చేసిన త్యాగం వృధా పోదని, ఇంత మంది రిషిని ప్రాణంలా ప్రేమిస్తున్నామని, ఆ ప్రేమే రిషిని కాపాడుతుందంటాడు. రిషి ఎక్కడ ఉన్నా, జగతి కాపాడుతుందని, ఆ నమ్మకం తనకు ఉందని ఫణీంద్ర అంటాడు. మహేంద్ర మనసులో.. జగతి మన కొడుకును నువ్వు కాపాడతావ్ అని ఎమోషనల్ అవుతాడు. మహేంద్రను ఫణీంద్రను బయటకు తీసుకువెళతాడు.
Guppedantha Manasu
శైలేంద్ర బయటకు వచ్చి.. భద్రకు క్లాస్ పీకుతూ ఉంటాడు. వసుధారకు ఫోన్ వచ్చి.. బయటకు వెళ్లిందని.. నువ్వు ఇక్కడ ఉండి ఏం పీకుతున్నావ్ అని తిడతాడు. నీ పనితనం సరిగా లేదని శైలేంద్ర సీరియస్ అవుతాడు. తాను బాగానే పని చేస్తున్నానని, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కదా అని భద్ర అంటాడు, ‘ తను ఏదో ఫోన్ మాట్లాడి బయటకు వెళ్లింది. ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది అంటే నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు అదే నిజం’ అని శైలేంద్ర అంటాడు. ఏంటా నిజం అని భద్ర అడగగా.... ఎవరో ఫోన్ చేసి రిషి గురించి చెప్పారని, రిషి కోసమే తాను బయటకు వెళ్లిందని చెబుతాడు. వసుధార ఎక్కువ దూరం వెళ్లి ఉండదని, నువ్వు ఫాలో అవ్వు అని భద్రను శైలేంద్ర పంపుతాడు. వసుధార.. రిషిని కలుసుకుంటే.. ఇద్దరినీ చంపేయమని, లేకపోతే వసుధారను చంపేయమని ఖాళీ చేతులతో మాత్రం రావద్దు అని చెబుతాడు.
Guppedantha Manasu
మరోవైపు వసు... రిషి కోసం అతను ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది. మధ్యలో రిషి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటుంది. ఆ దేవుడు రిషి సర్ కి ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడా అని బాధపడుతుంది. తర్వాత క్యాబ్ డ్రైవర్ వసు అడిగిన అడ్రస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అడ్రస్ కోసం తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తుంది. టీ షాప్ దగ్గర ఫోన్ మోగడంతో అక్కడే పెద్దాయన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇల్లు తనకు తెలీదని టీ షాప్ అతను చెబుతాడు. వసు ఎదురుచూస్తూ ఉండగా..... అదే సమయానికి ఇద్దరు రౌడీలు వచ్చి వసు ని చూస్తూ ఉంటారు. ఆలోగా ఆ పెద్దాయన వచ్చేస్తాడు. అతనిని కూడా రౌడీలు చూస్తారు.
Guppedantha Manasu
నువ్వేనా వసుధార అంటే అని అడుగుతాడు. నేనే అని చెబుతుంది. మనిషి చాలా బలహీనంగా ఉన్నాడని, నీ కోసం కలవరిస్తున్నాడని.. వసు ని రిషి ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటాడు. వాళ్లను రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. మరోవైపు వసు ఇంకా రాలేదని రిషి ఎదురుచూస్తూ ఉంటాడు. వసుధార కోసం తానే వెళ్లి చూద్దామని అనుకుంటాడు. దానికోసం లేవడానికి ప్రయత్నిస్తుండగా... ఆ పెద్దమ్మ ఆపుతుంది. కచ్చితంగా వసుధారను తీసుకువస్తాడని ఆమె ధైర్యం చెబుతుంది. కొంచెం సేపు ఎదురుచూస్తే.. వసుధార వస్తుందని, నాకు కూడా నీ పెండ్లాని చూడాలని అనిపిస్తోందని ఆ పెద్దమ్మ అంటుంది. కావాలంటే.. నేను వెళ్లి చూసొస్తాను అంటుంది.
Guppedantha Manasu
మరోవైపు రౌడీలు.. వసుధారను వెంబడిస్తూ ఉంటారు. అది తెలియని వసు... రిషి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. పెద్దాయన కూడా పలు ప్రశ్నలు అడుగితే.. రిషి గురించి వసు చాలా గొప్పగా చెబుతుంది. అలాంటి మంచివ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో అని ఆ పెద్దాయన బాధపడతాడు. ఈ లోగా.. ఎవరో తమను వెంబడిస్తున్నారనే అనుమానం వసుకి కలుగుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి రౌడీలు దాక్కుంటారు. మరోసారి చెక్ చేసుకుంటుంది. వాళ్లు మళ్లీ అలానే దాక్కుంటారు. దాక్కున్న రౌడీలు మళ్లీ చూసేసరికి వసుధార కనపడదు. రౌడీలకు కనిపించకుండా దాక్కుంటుంది. తర్వాత ఓ పెద్ద కర్ర కనపడితే దానిని చేతితో పట్టుకొని రౌడీల వెనకాలే వెళ్తుంది. వాళ్లను ఆ కర్రతో తలపై ఒక్కటి కొడుతుంది. ఒకడి తల పగలకొట్టి... కనిపించకుండా పారిపోతుంది. తర్వాత మళ్లీ పెద్దాయన దగ్గరకు వచ్చేస్తుంది.
Guppedantha Manasu
ఈలోగా వసుధార వచ్చేసింది అని రిషికి తెలిసిపోతుంది. ఇంకా రాలేదు అని పెద్దమ్మ అంటున్నా.. రిషి ఒప్పుకోడు. వసుధార వచ్చేసిందని, తనకు తెలిసిపోయింది అంటాడు. నిజంగానే అప్పుడే వాళ్లు డోర్ కొడతారు. పెద్దమ్మ వెళ్లి డోర్ తీస్తుంది. వసుని చాలా బాగున్నావ్ అని మెచ్చుకుంటూ... రిషి దగ్గరకు పరుగులు తీస్తుంది. రిషి గాయాలతో పడి ఉన్నప్పటికీ... తనని చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా సంతోషిస్తుంది. ప్రేమగా రిషి పక్కన కూర్చొని.. చెయ్యి పట్టుకొని మాట్లాడుతుంది.